ఉమ్మివేసినందుకు వ్యక్తిపై కేస్ బుక్ చేసిన పోలీసులు

ఉమ్మివేసిందనుకు ఓ వ్యక్తిపై కేస్ బుక్ చేసారు హైదరాబాద్ పోలీసులు. హయత్ నగర్ చెక్ పోస్ట్ దగ్గర రోడ్డుపై ఉమ్మినందుకు అబ్దుల్ ముజేద్‌ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు వెళ్తుండగా వాహనంపై ఉమ్మి పోలీసులకు..

ఉమ్మివేసినందుకు వ్యక్తిపై కేస్ బుక్ చేసిన పోలీసులు
Follow us

| Edited By:

Updated on: Apr 10, 2020 | 10:06 PM

ఉమ్మివేసినందుకు ఓ వ్యక్తిపై కేస్ బుక్ చేసారు హైదరాబాద్ పోలీసులు. హయత్ నగర్ చెక్ పోస్ట్ దగ్గర రోడ్డుపై ఉమ్మినందుకు అబ్దుల్ ముజేద్‌ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రోడ్డు వెళ్తుండగా వాహనంపై ఉమ్మి పోలీసులకు అడ్డంగా దొరికాడు ముజేద్. దీంతో సెక్షన్ 274, 269 ఐపీసీ కింద కేసు నమోదు చేశారు అధికారులు. దీన్ని బట్టి చూస్తుంటే.. పోలీసులు ఇక ముందు ఎంత కఠినంగా శిక్షలు అమలు చేయబోతున్నారో తెలుస్తోంది.

కాగా ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా విజృంభణ పెరుగుతోన్న కారణంగా.. కట్టడి చేయడానికి పలు రకాల చర్యలను తీసుకొచ్చారు అధికారులు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం కూడా శిక్షలు అమలుపరుస్తోంది. ఈ నేపథ్యంలో రోడ్డుపై ఉమ్మివేసినందుకు అబ్దుల్ ముజేద్‌ అనే వ్యక్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే ఇక నుంచి మాస్క్‌ లేకుండా రోడ్డుపైకి వెళ్తే జైలు శిక్షతో పాటు జరిమానా కూడా విధిస్తున్నట్లు హైదరాబాద్ పోలీసులు తెలిపారు. కాగా తెలంగాణలో ఇవాళ కొత్తగా 16 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 482కి చేరగా.. 12 మంది మృతి చెందారు. అలాగే 45 మంది కరోనా నుంచి కోలుకుని ఆస్పత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు.

ఇవి కూడా చదవండి:

బ్రేకింగ్: జగన్ జెడ్ స్పీడ్.. ఏపీ కొత్త ఎన్నికల కమీషనర్‌ నియామకం

మహిళల కోసం ప్రత్యేకంగా వాట్సాప్ నెంబర్.. గృహ హింస ఎదుర్కొంటే..

కరోనాపై పోరుకు టిక్‌టాక్ భారీ సాయం.. రూ.1900 కోట్ల విరాళం

కరోనా వ్యాప్తి: కరెన్సీ వద్దు.. డిజిటల్ చెల్లింపులే చేయండి..

కరోనా ఎఫెక్ట్‌తో మరో కీలక నిర్ణయం తీసుకున్న మోదీ సర్కార్

జబర్దస్త్‌లో ఉన్న కమెడియన్స్ అందరూ నాగబాబువైపే ఉన్నారు.. కుండబద్దలు కొట్టిన ధన్‌రాజ్

బ్రేకింగ్: సినీ నటుడు నర్సింగ్‌ యాదవ్‌కు తీవ్ర అస్వస్థత..