రోజుకు 12 గంటల పని.. లాక్‌డౌన్ తర్వాత దబిడి దిబిడే!

కరోనా వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో చాలా మంది ఉద్యోగులు, ఫ్యాక్టరీ కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు మరికొన్ని రోజుల పాటు లాక్‌డౌన్ కొనసాగనుంది. ఇదే కనుక జరిగితే కేంద్రం 1948 నాటి చట్టాన్ని తేవాలని భావిస్తోందట. దీని ప్రకారం లాక్‌డౌన్ ముగిసిన తర్వాత కార్మికులు..

రోజుకు 12 గంటల పని.. లాక్‌డౌన్ తర్వాత దబిడి దిబిడే!
Follow us

| Edited By:

Updated on: Apr 11, 2020 | 10:44 PM

కరోనా వైరస్‌ కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌తో చాలా మంది ఉద్యోగులు, ఫ్యాక్టరీ కార్మికులు ఇళ్లకే పరిమితమయ్యారు. ఇప్పుడు మరికొన్ని రోజుల పాటు లాక్‌డౌన్ కొనసాగనుంది. ఇదే కనుక జరిగితే కేంద్రం 1948 నాటి చట్టాన్ని తేవాలని భావిస్తోందట. దీని ప్రకారం లాక్‌డౌన్ ముగిసిన తర్వాత కార్మికులు రోజుకి 12 గంటల పాటు పరిశ్రమల్లో పని చేయాలనే నిబంధన తీసుకురావాలనుకుంటోందట. రెండు షిఫ్టుల్లో ఈ విధానాన్ని అమలు చేయాలని యోచిస్తోంది. ఇప్పుడు 21 రోజుల పాటు కంపెనీలన్నీ మూతపడటంతో ఉత్పత్తులు ఆగిపోయాయి. దీన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త చట్టాన్ని ప్రయోగించనున్నారట.

ప్రస్తుతం 8 గంటల చొప్పున వారంలో 48 గంటలకు మించి ఎవరినీ పని చేయించరాదన్న నిబంధనలు ఉన్నాయి. కానీ అత్యవసర సమయాల్లో పని గంటలను వారానికి 72 గంటలు పొడిగించవచ్చనే నియమం కూడా ఉంది. దీని ఆధారంగా పరిశ్రమల్లో ఉత్పత్తి పెంచేందుకు.. పనివేళలను పెంచనున్నారు అధికారులు. 11 మంది సీనియర్ అధికారుల సాధికార కమిటీ ఫ్యాక్టరీల చట్టానికి సవరణల సూచించింది. ఔషదాల సరఫరా కూడా సరిగా లేకపోవడంతో ఫ్యాక్టరీల చట్టానికి తాత్కాలికంగా సవరణలను చేయడమనే ఉత్తమమని అధికారుల బృందం పేర్కొంది. అలాగే వారికి అదనపు వేతనం కూడా ఇవ్వాలని వీరు నిర్ణయించారు. దీనిపై త్వరలోనే కేంద్రం నిర్ణయం తీసుకోనుందని అధికారిక వర్గాలు చెబుతున్నాయి.

ఇవి కూడా చదవండి:

ఫ్లాష్‌న్యూస్: ఏప్రిల్ 30 వరకూ రాష్ట్రంలో లాక్‌డౌన్‌

జబర్దస్త్ నుంచి వాళ్లిద్దరినీ తప్పించనున్న మల్లెమాల టీం?

ఫేస్‌బుక్ వ్యసనానికి.. ఫేస్‌బుక్కే మందు కనిపెట్టింది

లాక్ డౌన్‌పై మనసులో మాట బయటపెట్టిన జగన్..!

హిందూ మహాసముద్రంలో వింత ఆకారం.. మెరుపు తిగలాంటి

బ్రేకింగ్: జగన్ జెడ్ స్పీడ్.. ఏపీ కొత్త ఎన్నికల కమీషనర్‌ నియామకం