లాక్‌డౌన్‌తో మేలు కంటే కీడే ఎక్కువ!

కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఉంది ప్రస్తుతం బిట్రన్‌ పరిస్థితి.. కరోనా వైరస్‌ మరోమారు వేగంగా విస్తరిస్తుండటంతో గత్యంతరం లేక మరో విడత లాక్‌డౌన్‌ను విధించింది బ్రిటన్‌ ప్రభుత్వం.. నెల రోజుల పాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.. అయితే లాక్‌డౌన్‌ వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా ఉంటుందంటున్నారు అక్కడి మానసిక వైద్య నిపుణులు.. లాక్‌డౌన్‌ వల్ల కరోనా వ్యాప్తి తగ్గుతుందేమో కానీ వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు ఇబ్బందులు పడాల్సి […]

లాక్‌డౌన్‌తో మేలు కంటే కీడే ఎక్కువ!
Follow us

|

Updated on: Nov 02, 2020 | 4:07 PM

కరవమంటే కప్పకు కోపం, విడవమంటే పాముకు కోపం అన్నట్టుగా ఉంది ప్రస్తుతం బిట్రన్‌ పరిస్థితి.. కరోనా వైరస్‌ మరోమారు వేగంగా విస్తరిస్తుండటంతో గత్యంతరం లేక మరో విడత లాక్‌డౌన్‌ను విధించింది బ్రిటన్‌ ప్రభుత్వం.. నెల రోజుల పాటు లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేయాలని నిర్ణయించింది.. అయితే లాక్‌డౌన్‌ వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా ఉంటుందంటున్నారు అక్కడి మానసిక వైద్య నిపుణులు.. లాక్‌డౌన్‌ వల్ల కరోనా వ్యాప్తి తగ్గుతుందేమో కానీ వివిధ వ్యాధులతో బాధపడుతున్నవారు ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు.. కేన్సర్‌, కిడ్నీలు, గుండె జబ్బులున్నవారు శస్త్ర చికిత్సల కోసం ఎదురుచూస్తున్నారని, లాక్‌డౌన్ కారణంగా వారికి ఆపరేషన్లు చేయడం కష్టమవుతుందని చెబుతున్నారు. ఎమర్జెన్సీ ఆపరేషన్లను అనుమతించినా లాక్‌డౌన్‌ కారణంగా మానసిక ఒత్తిళ్లు పెరుగుతాయని మానసిక వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.. ఒక్కోసారి ఆ ఒత్తిళ్లు తట్టుకోలేక బలవన్మరణాలకు కూడా పాల్పడవచ్చంటున్నారు. లాక్‌డౌన్‌తో ఇంట్లోనే ఉన్నవారు లిక్కర్‌ ఎక్కువగా పుచ్చుకుంటారని, ఇది కూడా ప్రమాదమేనని చెబుతున్నారు. లాక్‌డౌన్‌తో కరోనా వైరస్‌ వ్యాప్తిని తగ్గించవచ్చునేమో కానీ దాన్ని పూర్తిగా నియంత్రించలేమంటున్నారు డాక్టర్లు.. మనుషులు గుంపులుగా తిరిగితే వారిపై కరోనా వైరస్‌ సామూహికంగానే దాడి చేస్తుందని, అందువల్ల వైరస్‌ దాడి బలహీనంగా ఉంటుందని చెబుతున్నారు. దానివల్ల రోగ నిరోధకశక్తి కూడా పెరుగుతుందంటున్నారు. ఇక ఆర్ధిక నిపుణులు కూడా లాక్‌డౌన్‌ను వ్యతిరేకిస్తున్నారు.. దీనివల్ల రోజుకు 17 వేల కోట్ల రూపాయల ఆర్ధిక నష్టం వాటిల్లుతుందని హెచ్చరిస్తున్నారు. మొదటిసారి విధించిన లాక్‌డౌన్‌తోనే ఆర్ధిక వ్యవస్థ అస్తవ్యస్తం అయ్యిందని, ఇప్పుడు మరోసారి లాక్‌డౌన్‌ విధించడం తెలివిలేని పని అని విమర్శిస్తున్నారు