లాక్ డౌన్ పొడిగింపు తేల్చే ప్లాన్ ఇదే.. కేసీఆర్ సూపర్

ఇంకో నాలుగు రోజులు... దేశంలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగిస్తారా లేక పాక్షికంగా తొలగిస్తారా లేక మొత్తం ఎత్తేస్తారా? కీలకమైన ఈ మూడు ప్రశ్నలకు సమాధానం దొరికే క్షణం దగ్గరవుతోంది. ఏప్రిల్ 11వ తేదీన అటు కేంద్రంలో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్సు...

లాక్ డౌన్ పొడిగింపు తేల్చే ప్లాన్ ఇదే.. కేసీఆర్ సూపర్
Follow us

|

Updated on: Apr 10, 2020 | 12:35 PM

Lack-down extension possible: ఇంకో నాలుగు రోజులు… దేశంలో మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో లాక్ డౌన్ పొడిగిస్తారా లేక పాక్షికంగా తొలగిస్తారా లేక మొత్తం ఎత్తేస్తారా? కీలకమైన ఈ మూడు ప్రశ్నలకు సమాధానం దొరికే క్షణం దగ్గరవుతోంది. ఏప్రిల్ 11వ తేదీన అటు కేంద్రంలో ప్రధాన మంత్రి వీడియో కాన్ఫరెన్సు, ఇటు రాష్ట్రంలో తెలంగాణ కేబినెట్ ప్రత్యేక భేటీ… ఇలా రెండు కీలక పరిణామాలు లాక్ డౌన్ విషయాన్ని తేల్చేయబోతున్నాయి.

శనివారం ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దేశంలోని అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించి, లాక్ డౌన్ కొనసాగింపుపై అభిప్రాయాలను తెలుసుకోబోతున్నారు. అదే సమయంలో కేంద్రంతో సంబంధం లేకుండా రాష్ట్రంలో ఏం చేయాలనే ది చర్చించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక కేబినెట్ భేటీ నిర్వహించబోతున్నారు. దేశంలో లాక్ డౌన్‌ని మరో రెండు వారాలు కొనసాగించాలని కేంద్రాన్ని కోరుతున్నారు కేసీఆర్.

అయితే, లాక్ డౌన్ కారణంగా పడిపోయిన ప్రభుత్వ రాబడిని ఎలా కాపాడుకోవాలా అన్న దానిపై కేసీఆర్ మధనపడుతున్నారు. ప్రజారోగ్యం దృష్ట్యా లాక్ డౌన్ పొడిగింపు సమంజసమే అయినా.. ఆ తర్వాత రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి అన్నది ఇపుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. రాష్ట్రంలోని మొత్తం 32 జిల్లాల్లో ఆరేడు జిల్లాల్లో కరోనా ప్రభావం కనిపిస్తోంది. హైదరాబాద్ నగరంతోపాటు నిజామాబాద్, కరీంనగర్, గద్వాల, వరంగల్, నల్గొండ జిల్లాల్లో ఎక్కువగా కరోనా కేసులు నమోదయ్యాయి.

కరోనా ప్రభావం వున్న ప్రాంతాలను హాట్ స్పాట్లుగా, కంటైన్మెంట్ క్లస్టర్లు, రెడ్ జోన్లుగా గుర్తించి, ఆ ప్రాంతాల పరిధిలో సంపూర్ణ లాక్ డౌన్ కొనసాగించి… మిగిలిన ప్రాంతాల్లో పాక్షిక లాక్ డౌన్ అమలు పరచడం ద్వారా కొంత మేరకు నార్మల్సీ తీసుకు వచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి ఆర్థిక రంగం నిఫుణులు సూచిస్తున్నారు. అయితే.. లాక్ డౌన్‌ని ఏ మాత్రం సడలించినా.. దాని ప్రభావాన్ని నియంత్రించడం సాధ్యం కాదని ముఖ్యమంత్రి అనుకుంటున్నారని.. ఆ క్రమంలోనే ఏప్రిల్ 11వ తేదీన జరగనున్న రాష్ట్ర కేబినెట్ భేటీ అత్యంత కీలకం కాబోతోందని తెలుస్తోంది.

ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?
CSK vs RCB మ్యాచ్‌కు రికార్డు వ్యూస్.. ఎన్ని కోట్ల మంది చూశారంటే?