ఏపీ స్థానికసంస్థల ఎన్నికల నిబంధనల్లో మార్పులివే

ఏపీలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనల్లో జగన్ ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. పంచాయితీ ఎన్నికల నియమావళిలో మార్పలు తేవడంతోపాటు నిర్దిష్టమైన లక్ష్యాలను సాధించే ప్రజాప్రతినిధులకు ప్రోత్సాహాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. పంచాయితీ ఎన్నికల నియమావళిలో చేసిన మార్పులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. పంచాయతీ ఎన్నికల నియమావళిలో మార్పులు తేవాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. స్థానికులను ప్రోత్సహించే […]

ఏపీ స్థానికసంస్థల ఎన్నికల నిబంధనల్లో మార్పులివే
Follow us

|

Updated on: Feb 12, 2020 | 6:38 PM

ఏపీలో త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనల్లో జగన్ ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. పంచాయితీ ఎన్నికల నియమావళిలో మార్పలు తేవడంతోపాటు నిర్దిష్టమైన లక్ష్యాలను సాధించే ప్రజాప్రతినిధులకు ప్రోత్సాహాలివ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం జరిగిన కేబినెట్ భేటీలో ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. పంచాయితీ ఎన్నికల నియమావళిలో చేసిన మార్పులను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు.

పంచాయతీ ఎన్నికల నియమావళిలో మార్పులు తేవాలని కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకున్నట్లు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. స్థానికులను ప్రోత్సహించే విధంగా చట్టాలను తేవాలని తీర్మానించినట్లు చెప్పారు. గ్రామంలో ఉండే వారే సర్పంచులుగా పోటీ చేయాలని, పంచాయతీ రాజ్ చట్ట సవరణ ద్వారా ఎన్నికల్లో ధన, మద్య ప్రలోబాలను తగ్గించనున్నామని ఆయన చెబుతున్నారు. ఓటర్లను ప్రలోభాలకు గురి చేసే వారిని అనర్హులుగా ప్రకటిస్తామని పెద్దిరెడ్డి తెలిపారు.

ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియకు18 రోజులు, సర్పంచ్ ఎన్నికలకు 13 రోజులపాటు ఎన్నికల ప్రక్రియ వుంటుందన్నారాయన. పచ్చదనం, పారిశుధ్యం బాధ్యతలను సర్పంచులే చేపట్టాలని ప్రభుత్వం నిర్దేశిచంనున్నదన్నారు. 100 శాతం గిరిజన జనాబా ఉన్న దగ్గర కేవలం గిరిజనులే పోటీ చేసేలా చట్టంలో మార్పులు చేశామని చెప్పారు. గ్రామాల అభివృద్ది కోసమే ఈ మార్పులని, ఇవి మంచి ఫలితాల్నిస్తాయని చెప్పారు. ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్దంగా ఉందని… కోర్ట్ అనుమతి ఇచ్చిన వెంటనే ఎన్నికలు నిర్వహిస్తామని పెద్దిరెడ్డి తెలిపారు.

మూడు రాజధానులు అంశంలో చంద్రబాబు అడ్డు పడుతున్నారని, సీఎం ఎక్కడ నుండి అయినా పరిపాలన చేయొచ్చని మంత్రి చెబుతున్నారు. బడ్జెట్ సమావేశాల అనంతరం ఏ క్షణమైనా విశాఖ నుండి ప్రభుత్వ పరిపాలన మొదలుపెట్టే అవకాశం వుందన్నారు.

మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
మహేష్ బాబుతో నటించిన ఈ హీరోయిన్ గుర్తుందా.?
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
ఇంటర్‎లో ఫెయిల్ అయిన ఇద్దరు విద్యార్థులు.. మనస్థాపంతో ఆత్మహత్య..
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా