Breaking News
  • భారత్‌లో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 27,114 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
  • యాదాద్రి-భువనగిరి జిల్లా: భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలో పంచాయతీ సెక్రెటరీ కళ్యాణ్.. ట్రైన్ కింద పడి ఆత్మహత్య. గత కొద్దిరోజుల క్రితం.. ఇతని కూతుర్ని.. ఘట్కేసర్ లో ఒకతను గొంతుకోసి చంపటం జరిగింది.
  • హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ నిర్వాకం. అధిక రెట్ ల తో సినిమా టికెట్ల విక్రయం. సినిమా టికెట్ ల పై 10 శాతం అధికంగా . జీ ఎస్టీ ఛార్జ్ వసూలు. 18 శాతం కు బదులు 28 శాతం టాక్స్ విధించి టికెట్ విక్రయం పై 30 లక్షలు ఆదాయం. జి ఎస్టీ అధికారులకు గతం లో పలు ఫిర్యాదులు.
  • సౌందర్యంతోపాటు సౌకర్యానికీ ప్రాధాన్యమివ్వాలి. పర్యావరణహిత, సుస్థిర నిర్మాణాలపై మరింతగా దృష్టిపెట్టాలి. భవిష్యత్ ప్రాజెక్టుల నిర్మాణాల్లో పునరుత్పాదక శక్తి వినియోగాన్ని ప్రోత్సహించాలి. నాగరికత సాధించిన విజయాల్లో నిర్మాణ కౌశల్యం (అర్కిటెక్చర్) కూడా ఒకటి. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో స్థానిక కళాకారులకు అవకాశం కల్పించాలి. ఐఐఏ జాతీయ సదస్సులో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు.
  • కోవిడ్-19పై ప్రధాని సమీక్షా సమావేశం. భేటీలో ఆరోగ్యశాఖ మంత్రితో పాటు హోంమంత్రి. కోవిడ్-19 తాజా స్థితిగతులు, తీసుకుంటున్న చర్యలపై చర్చ.
  • టీవీ9 మేయర్ బొంతు రామ్మోహన్: సచివాలయ కూల్చివేతలు సందర్భంగా పర్యావరణానికి సంబంధించిన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కూల్చివేత లకు జిహెచ్ఎంసి నుంచి అన్ని అనుమతులు ఉన్నాయి. భారీ స్థాయిలో వచ్చే శిధిలాలను రీసైక్లింగ్ చేసే ప్రక్రియను మొదలుపెట్టపోతున్నాం... కొన్ని వందల లారీల్లో శిథిలాలను జీడిమెట్ల లోని వేస్ట్ మేనేజ్మెంట్ ప్లాంట్ కి తరలిస్తారు. రాత్రి సమయంలో మాత్రమే శిథిలాల తరలింపును చేపడతాం. ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా, రోడ్లు పాడవకుండా అన్ని జాగ్రత్తలు ఇలా తరలింపులో తీసుకుంటాం.. సచివాలయ శిథిలాల నుంచి కంకర, ఐరన్, డస్ట్ వేరుచేస్తారు.
  • నల్లకుం లోని పీహెచ్సీ సెంటర్, లాలాగూడ లోని రైల్వే హాస్పిటల్ కరోనా టెస్టింగ్ సెంటర్లను పరిశీలించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి. కరోనా టెస్ట్ లు జరుగుతోన్న తీరు, వైద్య సిబ్బంది జాగ్రత్తలపై వివరాలను ఆరా తీసిన కేంద్రమంత్రి. కిషన్ రెడ్డి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి.

లోకల్ లీడర్‌ కాల్చివేత.. ఎక్కడో కాదు..

Local leader shot dead in Delhi, లోకల్ లీడర్‌ కాల్చివేత.. ఎక్కడో కాదు..

దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్ కొనసాగుతుండటంతో.. మొన్నటి వరకు క్రైం రేటు తగ్గిందనుకున్నారంతా.. కానీ లాక్‌డౌన్ 4.0 నుంచి 5.0 వచ్చే సరికి.. క్రైం రేటు మళ్లీ పెరుగుతోంది. తాజాగా దేశ రాజధాని ఢిల్లీలో దారుణం చోటుచేసుకుంది. బుధవారం ఉదయం మండ్వాలీ పార్క్ సమీపంలో ఓ స్థానిక లీడర్‌ను కాల్చి చంపేశారు గుర్తు తెలియని దుండగులు. ఈ విషయాన్ని పోలీసులు వెల్లడించారు. మండ్వాలీ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న ఓ పార్క్‌లో ఉదయం 7.30 నిమిషాలకు ఈ సంఘటన చోటుచేసుకుందని తెలిపారు. దుండుగులు కాల్చి పారిపోయిన వెంటనే.. అతడిని స్థానిక పట్‌పర్ గంజ్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అతడి ప్రాణాలు పోయినట్లు వైద్యులు తెలిపారు. మృతుడు రాహుల్ బురుగా గుర్తించారు. అతడి శరీరంలో నాలుగు బుల్లెట్లు ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఇక మృతుడిపై మండ్వాలీ పోలీస్ స్టేషన్‌లో పలు క్రిమినల్ కేసులు కూడా ఉన్నాయని.. అయితే ఇతడు స్థానిక మున్సిపల్ కార్పోరేషన్‌లో
లీడర్‌గా ఉన్నారని తెలిపారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు. కాగా, గతేడాది నవంబర్‌లో కూడా ఇతడిపై హత్యాయత్నం జరిగిందని తెలుస్తోంది.

Related Tags