చిరు వ్యాపారులకు రూ.10వేల చొప్పున రుణాలు: మంత్రి హరీశ్‌రావు

నిరుపేదలు, మధ్య తరగతి ప్రజలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు.  కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా కుదేలైన చిరువ్యాపారులకు  సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రుణ మంజూరి పత్రాలు పంపిణీ చేశారు.

చిరు వ్యాపారులకు రూ.10వేల చొప్పున రుణాలు: మంత్రి హరీశ్‌రావు
Follow us

|

Updated on: Jul 17, 2020 | 8:53 PM

నిరుపేదలు, మధ్య తరగతి ప్రజలను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడూ అండగా ఉంటుందన్నారు ఆర్థిక మంత్రి హరీశ్‌రావు.  కరోనా, లాక్‌డౌన్‌ కారణంగా కుదేలైన చిరువ్యాపారులకు  సంగారెడ్డి జిల్లా కేంద్రంలో రుణ మంజూరి పత్రాలు పంపిణీ చేశారు. లాక్​డౌన్​ కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న చిరు వ్యాపారులకు ఈ రుణాలు ఇస్తున్నామని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. వ్యాపార అభివృద్ధికి ఈ రుణాలు వినియోగించుకోవాలని, సకాలంలో బ్యాంకులకు తిరిగి చెల్లించాలని కోరారు. వ్యాపారులు క్రెడిట్ లిమిట్ పెంచుకోవాలని సూచించారు. ప్రస్తుతం 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందజేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి చిరువ్యాపారికి రుణం అందేలా అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు చర్యలు తీసుకోవాలని మంత్రి హరీశ్ రావు ఆదేశించారు.