LIVE: కొండపోచమ్మను అభిషేకిస్తున్నగోదారమ్మ…కేసీఆర్ మాటల్లో..

కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రెండో అతిపెద్ద జలాశయం కొండపోచమ్మ సాగర్ కాగా.. తెలంగాణలో అత్యంత ఎత్తులో నిర్మించిన జలాశయం ఇదే కావడం విశేషం.

LIVE: కొండపోచమ్మను అభిషేకిస్తున్నగోదారమ్మ...కేసీఆర్ మాటల్లో..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 29, 2020 | 2:59 PM

తెలంగాణ ప్రజల కల సాకారమైంది. గోదావరి జలాలు కొండపోచమ్మను అభిషేకించే అద్భుత ఘట్టం తెలంగాణలో ఆవిష్కారం అయ్యింది. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా కొండపోచమ్మ సాగర్ రిజర్వాయర్ ప్రారంభం అయ్యింది. మేడిగడ్డ వద్ద 100 మీటర్ల ఎత్తుకు కాళేశ్వరం జలాలు చేరగా.. అక్కడి నుంచి మరో 518 మీటర్ల ఎత్తులో ఉన్న కొండపోచమ్మ జలాశయంలోకి నీటిని ఎత్తిపోస్తారు. ఈ జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా పంట చేలకు నీటిని అందించవచ్చు…చెరువులను నింపొచ్చు. కొండపోచమ్మ రిజర్వాయర్‌ హైదరాబాద్‌ నగరానికి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. సీఎం కేసీఆర్ ప్రాతినిధ్యం వహించే గజ్వేల్ నియోజకవర్గంలోని అత్యధిక శాతం ఆయకట్టుకు ఈ రిజర్వాయర్ నుంచి నీరు అందుతుంది. కొండపోచమ్మ జలాశయం పనులను 2018 జనవరిలో ప్రారంభించి ఏడాదిలోగా పూర్తి చేశారు. ఈ రిజర్వాయర్ కోసం 4 ఊళ్లను ఖాళీ చేయించారు. 15 టీఎంసీల సామర్థ్యం ఉన్న ఈ రిజర్వాయర్ ద్వారా ఐదు జిల్లాల్లోని 2.85 లక్షల ఎకరాల వర్షాధార భూములకు సాగునీరు అందుతుంది. కాళేశ్వర ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన రెండో అతిపెద్ద జలాశయం కొండపోచమ్మ సాగర్ కాగా.. తెలంగాణలో అత్యంత ఎత్తులో నిర్మించిన జలాశయం ఇదే కావడం విశేషం. ఈ సందర్బంగా తెలంగాణ సీఎం కేసీఆర్ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తున్నారు.

[svt-event title=”కేసీఆర్ ప్రెస్‌మీట్” date=”29/05/2020,2:07PM” class=”svt-cd-green” ] గోదావరి నీళ్లకు జలహారతి కార్యక్రమం [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ప్రెస్‌మీట్” date=”29/05/2020,2:08PM” class=”svt-cd-green” ] తెలంగాణ చరిత్రలో ఓ ఉజ్వలమైన ఘట్టం [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ప్రెస్‌మీట్” date=”29/05/2020,2:11PM” class=”svt-cd-green” ] నిర్వాసితుల త్యాగాలకు వెల కట్టలేం..వారి త్యాగాల వల్లే ప్రాజెక్టు సాధ్యమైంది [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ప్రెస్‌మీట్” date=”29/05/2020,2:12PM” class=”svt-cd-green” ] నిర్వాసిత గ్రామాల యువతకు ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లలో ఉద్యోగాలు [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ప్రెస్‌మీట్” date=”29/05/2020,2:13PM” class=”svt-cd-green” ] భూములు కోల్పోయిన వారికి పునరావాసం కల్పించాం [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ప్రెస్‌మీట్” date=”29/05/2020,2:14PM” class=”svt-cd-green” ] కాలుష్య రహిత ఇండస్ట్రీని పెట్టిస్తాం..గజ్వేల్ పట్టణానికి ప్రతిరూపంగా న్యూ గజ్వేల్ టౌన్‌ రూపుదిద్దుకుంటోంది [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ప్రెస్‌మీట్” date=”29/05/2020,2:18PM” class=”svt-cd-green” ] తెలంగాణ ఇంజినీర్ల ప్రతిభకు కాళేశ్వరం ప్రాజెక్టు నిదర్శనం [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ప్రెస్‌మీట్” date=”29/05/2020,2:20PM” class=”svt-cd-green” ] ఏడాదికి లక్ష కోట్ల విలువైన పంటను తెలంగాణ రైతులు పండించబోతున్నారు [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ప్రెస్‌మీట్” date=”29/05/2020,2:22PM” class=”svt-cd-green” ] దేశంలో ధాన్యం సేకరణలో 63శాతం తెలంగాణదే కావడం గర్వకారణం [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ప్రెస్‌మీట్” date=”29/05/2020,2:23PM” class=”svt-cd-green” ] వారం రోజుల్లో అద్భుతమైన విషయాన్ని ప్రకటిస్తా [/svt-event]

[svt-event title=”కేసీఆర్ ప్రెస్‌మీట్” date=”29/05/2020,2:26PM” class=”svt-cd-green” ] భారత దేశమే ఆశ్చర్యపోయేలా ఆ నిర్ణయం ఉండబోతోంది [/svt-event]