నువ్వంటే నాకేం భయం ..? పైథాన్ తో చిన్నారి సయ్యాట..

Little girl gets a kiss on forehead from her pet python Video is fascinatingly scary, నువ్వంటే నాకేం భయం ..? పైథాన్ తో చిన్నారి సయ్యాట..

చిన్నారులు పెంపుడు జంతువులతో ఆడుకుంటూ ఉంటారు. సమయం దొరికితే చాలు. కుక్క పిల్లలు, చిలుకలు లాంటి పెట్స్‌ను ముద్దు చేస్తూ ఉంటారు. అదే పామును చూస్తే మాత్రం ఆమడదూరం పెరుగెత్తుతారు. కానీ ఇక్కడ ఓ బాలిక మాత్రం ఏకంగా పైథాన్‌తోనే ఆటలాడుతోంది. చూడటానికే చాలా భయంకరంగా ఉన్న ఆ పైథాన్‌ కూడా బాలికపై తన ప్రేమను చూపుతోంది. చిన్నారి నుదుటిపై ముద్దాడుతూ గారాలు పోతోంది. ఆ చిన్నారి కూడా నవ్వుతూ దానిని కౌగిలించుకుంటోంది.  ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.  11మిలియన్లకు పైగా వ్యూస్‌, 29వేల కంటే ఎక్కువ లైకులు, 8వేల రీ ట్వీట్స్‌ వచ్చాయి. ఇక ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.కొంతమంది నెటిజన్లు ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటే..మరికొంతమంది తమ భయాన్ని వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *