మా కుటుంబాన్ని గెంటేశారు, కాలిఫోర్నియా హోటల్ పై మండిపడిన అనన్య బిర్లా

కాలిఫోర్నియాలోని ఓ రెస్టారెంట్ పై ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా  మండిపడింది. స్కూపా అనే ఈ హోటల్ జాతివివక్షను పాటిస్తోందని, రేసిస్ట్ అని ఆమె ట్వీట్ చేసింది. సింగర్ ఆర్టిస్ట్ కూడా అయిన అనన్య బిర్లా.. తమ కుటుంబం ఈ హోటల్ లో అనుభవించిన క్షోభను వివరించింది. తమను మూడు గంటలపాటు వెయిట్ చేయించారని, అక్కడి వెయిటర్… జోషువా సిల్వర్ మన్  తన తల్లి పట్ల అమానుషంగా ప్రవర్తించాడని […]

  • Umakanth Rao
  • Publish Date - 6:51 pm, Mon, 26 October 20

కాలిఫోర్నియాలోని ఓ రెస్టారెంట్ పై ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా కుమార్తె అనన్య బిర్లా  మండిపడింది. స్కూపా అనే ఈ హోటల్ జాతివివక్షను పాటిస్తోందని, రేసిస్ట్ అని ఆమె ట్వీట్ చేసింది. సింగర్ ఆర్టిస్ట్ కూడా అయిన అనన్య బిర్లా.. తమ కుటుంబం ఈ హోటల్ లో అనుభవించిన క్షోభను వివరించింది. తమను మూడు గంటలపాటు వెయిట్ చేయించారని, అక్కడి వెయిటర్… జోషువా సిల్వర్ మన్  తన తల్లి పట్ల అమానుషంగా ప్రవర్తించాడని ఆమె పేర్కొంది. మమ్మల్ని దాదాపు హోటల్ నుంచి గెంటి వేయించారు అని ఆమె వాపోయింది. తమకు కలిగిన అవమానాన్ని అనన్య తల్లి నీరజ్ బిర్లా, అనన్య సోదరుడు ఆర్యమాన్ బిర్లా కూడా తీవ్రంగా ఖండిస్తూ ట్వీట్లు చేశారు.