వీటితో ఏపీకి భారీ ఆదాయమట..?

ఏపీలో కొత్త మద్యం పాలసీ రాబోతోంది. కొత్త విధానంలో భాగంగా 20 శాతం మద్యం షాపులు తగ్గిపోతాయి. ఇకపై ప్రభుత్వమే మద్యం షాపుల్ని నిర్వహిస్తుంది. దశల వారీగా మద్యపాన నిషేధంలో భాగంగా జగన్‌ సర్కార్‌ ఈ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. మరి కొత్త పాలసీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుందా? పెరుగుతుందా? తెలుగు రాష్ట్రాల్లో ఎక్సైజ్ కొత్త పాలసీ.. అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతుంది. మరో 40 రోజుల్లో ఏపీలో నూతన ఎక్సైజ్ విధానం అమలులోకి […]

వీటితో ఏపీకి భారీ ఆదాయమట..?
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2019 | 1:25 PM

ఏపీలో కొత్త మద్యం పాలసీ రాబోతోంది. కొత్త విధానంలో భాగంగా 20 శాతం మద్యం షాపులు తగ్గిపోతాయి. ఇకపై ప్రభుత్వమే మద్యం షాపుల్ని నిర్వహిస్తుంది. దశల వారీగా మద్యపాన నిషేధంలో భాగంగా జగన్‌ సర్కార్‌ ఈ సరికొత్త నిర్ణయాన్ని తీసుకుంది. మరి కొత్త పాలసీ ద్వారా ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుందా? పెరుగుతుందా?

తెలుగు రాష్ట్రాల్లో ఎక్సైజ్ కొత్త పాలసీ.. అక్టోబర్‌ ఒకటో తేదీ నుంచి ప్రారంభమవుతుంది. మరో 40 రోజుల్లో ఏపీలో నూతన ఎక్సైజ్ విధానం అమలులోకి రానుంది. దశలవారీగా మద్య నిషేధాన్ని అమలు చేయాలని జగన్‌ ప్రభుత్వం తన పాలసీగా నిర్ణయించుకుంది. ప్రభుత్వానికి దిక్సూచిగా ఉన్న నవరత్నాల్లో ఇదీ ఒకటి. అందుకే కొత్త మద్యం విధానాన్ని తీసుకువస్తోంది. ఇందుకు సంబంధించి కొత్త మార్గదర్శకాలు కూడా విడుదల చేసింది. కొత్త ఎక్జైజ్‌ సంవత్సరం నుంచి రాష్ట్రంలో మద్యం షాపులు 20 శాతం తగ్గిపోతాయి. ప్రస్తుతం ఉన్న 4,380 షాపులకు బదులుగా… ఇకపై 3,500 షాపులు మాత్రమే కొనసాగుతాయి.

అదే విధంగా ప్రైవేట్ షాపులకు బదులుగా అక్టోబర్‌ నుంచి బేవరేజెస్‌ కార్పొరేషన్‌ షాపులే ఉనికిలోకి వస్తాయి. ఇందుకోసం ఉద్యోగుల నియామక ప్రక్రియ కూడా మొదలైంది. షాప్స్‌కు అనుబంధంగా ఉండే పర్మిట్‌ రూమ్స్‌ను రద్దు చేయనున్నారు. ఇటువంటి పరిణామాలతో ప్రభుత్వానికి ఆదాయం తగ్గుతుందని ఎవరైనా భావిస్తారు. అయితే.. ఇక్కడే ప్రభుత్వం మ్యాజిక్‌ చేసింది. మద్యం ధరలను పెంచడంతో పాటు.. వ్యాట్‌ పెంచి ఆదాయం పెంచుకునేందుకు ప్రభుత్వం ప్లాన్‌ చేసింది. తద్వారా గత ఏడాది కంటే సుమారు 5 వేల కోట్ల ఆదాయం పెరగనున్నాయని సమాచారం.

Liquor ban in AP: Profit or loss for the state?