రైల్వే ట్రాక్‌పై మృగరాజు.. ట్రైన్ ఆపేసిన లోకో పైలట్.. ఆ తర్వాత..

గాంధీనగర్‌ : రైల్వేట్రాక్ పై వచ్చిన సింహాలు దాదాపు 20 నిమిషాల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కల్గించాయి. గుజరాత్‌లోని జునాగఢ్‌ జిల్లాలో గిర్‌ అభయారణ్యం ఉంది. ముళ్లపొదలతో నిండిన ఈ అరణ్యంలో అక్కడక్కడా పొదల్లో మృగరాజులు సంచరిస్తుంటాయి. అయితే ఈ అడవి మధ్యలో నుంచి ఓ రైల్వే ట్రాక్‌ ఉంది. ఎప్పటిలానే ఆ మార్గంలో రైలు వెళ్తుండగా రైల్వే ట్రాక్‌పైనే ఓ సింహం సేదతీరుతుండటాన్ని లోకో పైలట్‌ గమనించాడు. దానికి తోడుగా మరో రెండు సింహాలు […]

రైల్వే ట్రాక్‌పై మృగరాజు.. ట్రైన్ ఆపేసిన లోకో పైలట్.. ఆ తర్వాత..
Follow us

| Edited By:

Updated on: Apr 07, 2019 | 11:46 AM

గాంధీనగర్‌ : రైల్వేట్రాక్ పై వచ్చిన సింహాలు దాదాపు 20 నిమిషాల పాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం కల్గించాయి. గుజరాత్‌లోని జునాగఢ్‌ జిల్లాలో గిర్‌ అభయారణ్యం ఉంది. ముళ్లపొదలతో నిండిన ఈ అరణ్యంలో అక్కడక్కడా పొదల్లో మృగరాజులు సంచరిస్తుంటాయి. అయితే ఈ అడవి మధ్యలో నుంచి ఓ రైల్వే ట్రాక్‌ ఉంది. ఎప్పటిలానే ఆ మార్గంలో రైలు వెళ్తుండగా రైల్వే ట్రాక్‌పైనే ఓ సింహం సేదతీరుతుండటాన్ని లోకో పైలట్‌ గమనించాడు. దానికి తోడుగా మరో రెండు సింహాలు కూడా ట్రాక్‌ పక్కనే చిన్న చెట్ల నీడన కూర్చొని ఉన్నాయి. సింహాలను చూసిన లోకో పైలట్‌ రైలును నిలిపివేశాడు. ఆ తర్వాత లోకో పైలట్‌ ట్రైన్‌ హారన్‌ మోగిస్తూ వాటిని పట్టాలకు దూరంగా తరిమేశాడు. గుజరాత్‌లోని గిర్‌ అభయారణ్యంలో వెరవాల్‌, ధరీ రైల్వే స్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. అయితే జరిగిన ఘటనను ఓ ప్రయాణికుడు సెల్‌ఫోన్‌లో బంధించాడు.