టూరిస్టుల వెంటబడి.. పరుగులు తీస్తూ.. వామ్మో ! సింహం !

కర్నాటకలోని బళ్లారిలో గల జూ పార్క్ అది ! అటల్ బిహారీ వాజ్ పేయి పేరిట గల ఆ జూ పార్క్ కి సఫారీ వాహనంలో వెళ్లిన కొందరు టూరిస్టులకు భయంకర అనుభవం ఎదురైంది. ఈ వాహన డ్రైవర్ సింహాలున్న ప్రాంతానికి తన వాహనాన్ని దగ్గరగా పొనిఛ్చి హారన్ బిగ్గరగా కొట్టాడు. అంతే… అక్కడే ఉన్న ఓ సింహానికి చిర్రెత్తుకొచ్చి.. వెంటనే సఫారీ వెంట బడింది. ఇక భయంతో బిగుసుకుపోయిన డ్రైవర్, టూరిస్టులు ‘ కాళ్లకు ‘ […]

టూరిస్టుల వెంటబడి.. పరుగులు తీస్తూ.. వామ్మో ! సింహం !
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Oct 14, 2019 | 2:13 PM

కర్నాటకలోని బళ్లారిలో గల జూ పార్క్ అది ! అటల్ బిహారీ వాజ్ పేయి పేరిట గల ఆ జూ పార్క్ కి సఫారీ వాహనంలో వెళ్లిన కొందరు టూరిస్టులకు భయంకర అనుభవం ఎదురైంది. ఈ వాహన డ్రైవర్ సింహాలున్న ప్రాంతానికి తన వాహనాన్ని దగ్గరగా పొనిఛ్చి హారన్ బిగ్గరగా కొట్టాడు. అంతే… అక్కడే ఉన్న ఓ సింహానికి చిర్రెత్తుకొచ్చి.. వెంటనే సఫారీ వెంట బడింది. ఇక భయంతో బిగుసుకుపోయిన డ్రైవర్, టూరిస్టులు ‘ కాళ్లకు ‘ ‘బుధ్ది ‘ చెప్పినట్టే తమ వాహనాన్ని వేగంగా ముందుకు పరుగులు తీయించారు. కానీ ఆ సింహం మాత్రం వారి వెంటబడడం ఆపలేదు.ఒక చోట ఈ వాహనాన్ని కొంత మెల్లగా పోనిస్తూ .. ఆ మృగరాజు వెనక్కి తగ్గిందా అని నిశితంగా చూస్తే.. అది పరుగు ఆపకుండా దూసుకువస్తూనే ఉంది. దీంతో డ్రైవర్ మళ్ళీ భయపడుతూనే వేగం పెంచాడు. మొత్తానికి ఆ సింహం బారి నుంచి అంతా క్షేమంగా బయటపడ్డారు. ఈ వీడియో వైరల్ అయింది. గత ఆగస్టు నాటి వీడియో శుక్రవారం బయటికొచ్చి వైరల్ అయింది.

అన్నట్టు ఆ సింహం పేరు కేసరి అట.. సుమారు ఆరేళ్ళ వయసున్న దీన్ని ఆ మధ్య ఈ జూకి తరలించారు. ఇది తమ వాహనం వెంట బడిన విషయాన్ని జూ అధికారుల దృష్టికి పర్యాటకులు తేగా.. వారు తేలిగ్గా పరిగణించారు. సాధారణంగా ఇలాంటి క్రూర జంతువులున్న చోటికి దగ్గరగా పోరాదని, అత్యంత జాగ్రత్తగా ఉండాలని, హారన్ కొట్టడం వంటి ‘ చిలిపి చేష్టలు ‘ మానుకోవాలని వారు సలహా ఇచ్చారు.