Election code: కోర్టు తీర్పు.. ఈసీ నిర్ణయం.. జగన్‌కు లైన్ క్లియర్!

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 25 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందా? ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు.. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం వెరసి సీఎం జగన్ తలపెట్టిన ప్రాజెక్టు పట్టాలెక్కే పరిస్థితి కనిపిస్తోంది.

Election code: కోర్టు తీర్పు.. ఈసీ నిర్ణయం.. జగన్‌కు లైన్ క్లియర్!
Follow us

|

Updated on: Mar 18, 2020 | 6:59 PM

ఏపీ ముఖ్యమంత్రి జగన్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 25 లక్షల ఇళ్ళ పట్టాల పంపిణీకి గ్రీన్ సిగ్నల్ వచ్చేసిందా? ఒకవైపు సుప్రీంకోర్టు తీర్పు.. మరోవైపు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయం వెరసి సీఎం జగన్ తలపెట్టిన ప్రాజెక్టు పట్టాలెక్కే పరిస్థితి కనిపిస్తోంది. ఇక మిగిలింది వారం రోజులే కాబట్టి.. ఆలోగా ఏర్పాట్లను చేసేయాల్సిందిగా ఆదేశాలు ఇప్పటికే జారీ అయినట్లు తెలుస్తోంది.

ఏపీలో లోకల్ ఎన్నికలను వాయిదా వేసిన స్టేట్ ఎలెక్షన్ కమిషనర్.. ఎన్నికల కోడ్‌ని మాత్రం అలాగే కొనసాగించారు. వాయిదానే చెల్లదన్న వాదనతోపాటు.. ఒకవేళ వాయిదా వేస్తే మరి ఎన్నికల కోడ్ కొనసాగించడంలో మతలబేంటన్న సందేహాలతో సుప్రీంకోర్టు కెక్కిన జగన్ ప్రభుత్వానికి ఒక విషయంలో ఎదురు దెబ్బ తగిలినా కోడ్ విషయంలో మాత్రం వాదన నెగ్గించుకుంది. ఏపీలో ఎన్నికల కోడ్ ఎత్తి వేయాలన్న అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్నారు స్టేట్ ఎలెక్షన్ కమిషనర్ రమేశ్ కుమార్. బుధవారం మధ్యాహ్నం తీర్పు రాగా.. సాయంత్రానికి రాష్ట్రంలో ఎన్నికల కోడ్‌ను ఎత్తివేశారాయన.

మార్చి ఏడవ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన ఎన్నికల కోడ్‌ను సడలిస్తూ ఆదేశాలు జారీ చేశారు రాష్ట్ర ఎన్నికల కమిషనర్. దాంతో ప్రభుత్వ పథకాల అమలుకు గ్రీన్ సిగ్నల్ లభించినట్లయ్యింది. అయితే ఈ ఆదేశాలతో ఉగాది నాడు నిర్వహించనున్న ఇళ్ళ పట్టాల పంపిణీకి లైన్ క్లియర్ అయినట్లేనా? కొందరు ఎస్ అంటుంటే.. మరికొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే సుప్రీంకోర్టు పాత పథకాలను కొనసాగించవచ్చని మాత్రమే చెప్పింది. కొత్త పథకాలు వద్దని కూడా పేర్కొంది. మరి ఇళ్ళ పట్టాల పంపిణీ గతంలోనే ప్రకటించారు కాబట్టి పాత పథకం అనుకోవాలా? లేక ఇంకా ప్రారంభించలేదు కాబట్టి ఇప్పుడు ప్రారంభిస్తే కొత్త స్కీమ్ అవుతుందా? మరి సుప్రీంకోర్టు ఆదేశాల్లో ఏముంది? ఇదిప్పుడు ఏపీలో చర్చనీయాంశంగా మారింది.

స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
స్దాన బలం గురించి వేమన చెప్పిన పద్యానికి సజీవ సాక్ష్యం ఈ వీడియో
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
ఢిల్లీతో మ్యాచ్.. సెంచరీ కొట్టేసిన శుభ్‌మన్ గిల్..అరుదైన రికార్డు
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
దెబ్బేసిన తెలుగోడు.. టీ20 వరల్డ్‌కప్ జట్టులో హర్దిక్‌ నో ప్లేస్.!
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
ఐపీఎల్‌లో శివ తాండవం.. ఈ ప్లేయర్ టీ20 ప్రపంచకప్ లో ఉండాల్సిందే
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
కవిత బెయిల్ పిటిషన్‎పై ముగిసిన వాదనలు.. కోర్టులో తీర్పు రిజర్వ్..
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
మట్టి కుండతో మ్యాజిక్‌..! దేశీ జుగాఢ్ జాదు చూస్తే మతిపోవాల్సిందే!
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
ఫ్యాన్స్‌కు పూనకాలే.. పుష్ప 2 ఫస్ట్ సింగిల్ వచ్చేది అప్పుడే..
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
హిందూ యువతి వివాహం తర్వాత మంగళసూత్రాన్ని ఎందుకు ధరిస్తుందో తెలుసా
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
రాజన్న సినిమాలో నటించిన చిన్నారి..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..
సీఎం జగన్ 'మేమంతా సిద్దం' బస్సుయాత్ర సక్సెస్.. ఎలా సాగిందంటే..