Weight Loss Tips: కడుపు నిండా తింటూ కూడా ఈజీగా వెయిట్ లాస్ అవ్వండి..

|

Sep 22, 2024 | 2:43 PM

ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఇబ్బంది పడే సమస్యల్లో అధిక బరువు, ఊబకాయం. ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగానే బరువు అనేది ఎక్కువగా పెరుగుతున్నారు. అధిక బరువు కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు కూడా త్వరగా ఎటాక్ చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు, డయాబెటీస్, బీపీ, క్యాన్సర్, ఇన్ఫెక్షన్ల బారిన పడటం వంటి వాటితో బాధ పడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే బరువు తగ్గడం కోసం ఏవోవే ప్రయత్నిస్తూ ఉంటారు. వ్యాయామం చేయడానికి సమయం లేనివారు..

Weight Loss Tips: కడుపు నిండా తింటూ కూడా ఈజీగా వెయిట్ లాస్ అవ్వండి..
Weight Loss
Follow us on

ఈ మధ్య కాలంలో ఎక్కువ మంది ఇబ్బంది పడే సమస్యల్లో అధిక బరువు, ఊబకాయం. ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్ల కారణంగానే బరువు అనేది ఎక్కువగా పెరుగుతున్నారు. అధిక బరువు కారణంగా ఇతర అనారోగ్య సమస్యలు కూడా త్వరగా ఎటాక్ చేసే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. గుండె జబ్బులు, డయాబెటీస్, బీపీ, క్యాన్సర్, ఇన్ఫెక్షన్ల బారిన పడటం వంటి వాటితో బాధ పడాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే బరువు తగ్గడం కోసం ఏవోవే ప్రయత్నిస్తూ ఉంటారు. వ్యాయామం చేయడానికి సమయం లేనివారు తిండిపై ఫోకస్ పెడతారు. తినడం తగ్గించేస్తారు. దీంతో త్వరగా నీరసించి పోతారు. కానీ కడుపు నిండా తింటూనే.. ఈజీగా కూడా వెయిట్ లాస్ అవ్వొచ్చని డైటీషియన్లు, ఆరోగ్య నిపుణులు కూడా చెబుతున్నారు. మీ డైట్‌లో కొన్ని ఆహారాలు యాడ్ చేసుకుంటే చాలు. ధాన్యాలు, కూరాయలు, పండ్లు, గింజలు తీసుకోవడం వల్ల ఎనర్జిటిక్‌గా.. ఆరోగ్యంగా.. ఫిట్‌గా.. ఉండొచ్చు. మరి అవేంటో ఇప్పుడు చూద్దాం.

సొరకాయ:

సొరకాయ తినడం వల్ల ఈజీగా బరువు తగ్గొచ్చు. ఎందుకంటే ఇందులో వాటర్ కంటెంట్, ఫైబర్ ఎక్కువగా.. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. ప్రతిరోజూ ఓ గ్లాస్ సొరకాయ జ్యూస్ తాగితే.. కడుపు నిండుగా ఉంటుంది. దీంతో ఇతర ఆహారాలు త్వరగా తీసుకోరు.

గుమ్మడి కాయ:

గుమ్మడి కాయ జ్యూస్ తాగడం వల్ల కూడా మీరు ఊబకాయం, అధిక బరువు నుంచి బయట పడొచ్చు. ప్రతి రోజూ ఉదయం లేదా సాయంత్రం గుమ్మడి కాయ జ్యూస్ తాగండి. దీని రుచి కొబ్బరి నీళ్లలా ఉంటాయి. చాలా రుచిగా ఉంటాయి. కాబట్టి ఈజీగా తాగేయవచ్చు. ఇందులో క్యాలరీలు తక్కువగా.. ఇతర పోషకాలు ఎక్కువగా లభిస్తాయి. వెయిట్ లాస్ తగ్గండంలో ఈ వాటర్ చక్కగా సహాయ పడతాయి.

ఇవి కూడా చదవండి

క్యారెట్:

బరువు తగ్గడంలో సహాయ పడే వాటిల్లో క్యారెట్ కూడా ఒకటి. ఇందులో క్యాలరీలు తక్కువగా, పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఎలాంటి డౌట్ లేకుండా క్యారెట్‌ని కడుపు నిండా తినవచ్చు. జ్యూస్ కూడా తగవచ్చు. ఇది శరీరంలోని హార్మోన్లను బ్యాలెన్స్ చేస్తూ బరువును తగ్గిస్తుంది.

కీర దోసకాయ, క్యాబేజీ:

అధిక బరువు తగ్గడంలో క్యాబేజీ, కీర దోసకాయ కూడా ఎంతో హెల్ప్ చేస్తాయి. వీటిని బ్రేక్ ఫాస్ట్ లేదా డిన్నర్ సమయంలో పొట్ట నిండా తినవచ్చు. ఇందులో క్యాలరీలు తక్కువగా ఉంటాయి. వీటితో సలాడ్ కూడా తయారు చేసుకుని తినవచ్చు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..