ACని ఎంత టెంపరేచర్‌లో ఉంచాలి? చాలా మంచి తెలియక చేసే పొరబాటు ఇదే
వేసవిలో AC వాడకం అవసరమే అయినప్పటికీ, దానిని సరైన విధంగా ఉపయోగించడం మరింత ముఖ్యం. 24°C నుంచి 25°C మధ్య ఉష్ణోగ్రతను నిర్వహించడం వల్ల శరీరానికి సౌకర్యం లభించడమే కాకుండా ఆరోగ్య సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది. కాబట్టి చల్లదనం కోసం ఆరోగ్యాన్ని పణంగా పెట్టకుండా, సరైన ఉష్ణోగ్రతతో ACను ఉపయోగించడం ఉత్తమం..

వేసవిలో ఎయిర్ కండిషనర్ (AC) లేకుండా ఉండలేని పరిస్థితి చాలా మందికి ఉంటుంది. అయితే ఏసీని ఎక్కువసేపు ఉపయోగించడం లేదా చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద నడపడం ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. సౌకర్యంతో పాటు ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలంటే ఏసీని సరైన ఉష్ణోగ్రతలో ఉపయోగించడం చాలా ముఖ్యం. భారత ప్రభుత్వ విద్యుత్ మంత్రిత్వ శాఖ, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE) సూచనల ప్రకారం.. ఏసీని 24°C నుంచి 25°C మధ్య ఉంచడం అత్యంత అనుకూలంగా ఉంటుంది. ఈ ఉష్ణోగ్రత శరీరానికి సౌకర్యవంతంగా ఉండటంతో పాటు విద్యుత్ వినియోగాన్ని కూడా తగ్గిస్తుంది. బయటి ఉష్ణోగ్రతకు, గది ఉష్ణోగ్రతకు మధ్య వ్యత్యాసం చాలా ఎక్కువగా ఉండకపోవడం వల్ల శరీరం సులభంగా ఆ వాతావరణానికి అలవాటు పడుతుంది.
చాలా తక్కువ ఉష్ణోగ్రతలో AC వాడితే ఏమవుతుంది?
చాలా మంది 18°C లేదా 20°C వంటి తక్కువ ఉష్ణోగ్రతల వద్ద ఏసీని నడుపుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల కొన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది.
సాధారణంగా కనిపించే సమస్యలు
- కండరాల బిగుతు, నొప్పులు
- చర్మం పొడిబారడం
- గొంతు నొప్పి లేదా గొంతు ఇన్‌ఫెక్షన్లు
- తలనొప్పి
- దగ్గు, జలుబు
- శరీరంలో అసౌకర్యం
- అధిక చలిగా అనిపించడం
అలాగే బయట మండే ఎండలో నుంచి నేరుగా చాలా చల్లని గదిలోకి వెళ్లడం వల్ల శరీర ఉష్ణోగ్రతలో ఆకస్మిక మార్పులు ఏర్పడి అస్వస్థతకు దారితీయవచ్చు.
ఎవరికి ఎక్కువ జాగ్రత్త అవసరం?
కొన్ని వర్గాల వారు AC వాడేటప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలి.
- చిన్నపిల్లలు
- వృద్ధులు
- ఆస్తమా బాధితులు
- అలర్జీ సమస్యలు ఉన్నవారు
- శ్వాసకోశ సంబంధిత సమస్యలు ఉన్నవారు
ఇలాంటి వారు ఎక్కువసేపు చల్లని గదిలో ఉండకూడదు.
ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
- ఏసీని 24°C–25°C మధ్య ఉంచడం ఉత్తమం.
- క్రమం తప్పకుండా AC ఫిల్టర్లను శుభ్రం చేస్తే గాలి నాణ్యత మెరుగ్గా ఉంటుంది.
- ఏసీ గదిలో ఎక్కువసేపు గడపడం వల్ల శరీరం డీహైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది.
- AC గాలి నేరుగా ముఖం లేదా శరీరంపై పడితే అసౌకర్యం, కండరాల నొప్పులు కలగవచ్చు.
- రోజులో కొంతసేపు కిటికీలు లేదా తలుపులు తెరిచి ఉంచడం ద్వారా గదిలో గాలి ప్రసరణ మెరుగుపడుతుంది.




