
పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎముకల బలం పెరగడం, జీర్ణక్రియ మెరుగుపడటం లాంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అయితే పెరుగు తినడానికి సరైన సమయం, సరైన పద్ధతి తెలిస్తే, ఆ ప్రయోజనాలను మనం రెట్టింపు చేసుకోవచ్చు. పెరుగు తినడంపై ఆయుర్వేదం చెప్పిన ముఖ్యమైన నియమాలను ఇప్పుడు చూద్దాం.
తప్పకుండా మంచిది. పెరుగు అనేది ప్రోబయోటిక్స్‌కు గొప్ప వనరు.
జీర్ణక్రియకు మేలు: ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వేయించిన జీలకర్ర పొడితో కలిపి తింటే మలబద్ధకం, అజీర్ణం వంటి కడుపు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.
శక్తి పెరుగుతుంది: పెరుగులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది. అలసటగా, బలహీనంగా అనిపించినప్పుడు పెరుగు క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ప్రయోజనకరం.
జుట్టు, చర్మానికి: పెరుగును జుట్టుకు రాస్తే చుండ్రు తగ్గుతుంది. చర్మానికి పూస్తే టానింగ్ సమస్య తగ్గి, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.
ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. కొన్ని సమయాల్లో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు:
రాత్రి పూట వద్దు: పెరుగు చల్లబరిచే గుణం కలిగి ఉంటుంది. రాత్రిపూట మన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి ఈ సమయంలో పెరుగు తింటే జలుబు, దగ్గు, సైనస్ లేదా కఫం పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో ఉదయం లేదా రాత్రి పూట పెరుగు తినడం పూర్తిగా మానుకోవడం మంచిది.
పెరుగు మంచిదే అయినా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి:
గుండె జబ్బులు, కొలెస్ట్రాల్: అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె జబ్బులు ఉన్నవారు పెరుగును మితంగా తీసుకోవాలి. వీలైనంత వరకు తక్కువ కేలరీలు ఉన్న పెరుగును ఎంచుకోవాలి.
ఉప్పుతో సమస్య: అధిక రక్తపోటు లేదా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు పెరుగులో ఉప్పు కలపకుండా తినాలి.
చాలామంది పెరుగులో చక్కెర, బ్రౌన్ షుగర్ లేదా బెల్లం కలుపుకొని తినడానికి ఇష్టపడతారు. కానీ ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. తీపి కలపడం వల్ల కేలరీల సంఖ్య పెరుగుతుంది.అధిక బరువు ఉన్నవారు లేదా డయాబెటిస్ రోగులు తీపి పెరుగును పూర్తిగా మానుకోవాలి.
ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనివారు పెరుగును ఎలాంటి భయం లేకుండా ఆస్వాదించవచ్చు. పోషక విలువలు పెరగాలంటే పెరుగులో పచ్చి కూరగాయల సలాడ్‌లను కలుపుకుని తినడం ఉత్తమమైన ఎంపిక.
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..