AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Curd: పెరుగు తినడానికి ఏది బెస్ట్ టైమ్..? తప్పక తెలుసుకోండి.. లేకపోతే..

పెరుగు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు మనందరికీ తెలుసు. కానీ దానిని ఎంత తినాలి..? ఏ టైమ్‌లో తింటే మంచిది..? అనే విషయాలు తెలిస్తే మీకు రెట్టింపు ప్రయోజనాలు లభిస్తాయి. కానీ దాదాపు 90 శాతం మందికి పెరుగు తినడానికి సరైన సమయం తెలియదు.

Curd: పెరుగు తినడానికి ఏది బెస్ట్ టైమ్..? తప్పక తెలుసుకోండి.. లేకపోతే..
What Is The Best Time To Eat Curd Know
Krishna S
|

Updated on: Oct 10, 2025 | 8:10 PM

Share

పెరుగు ఆరోగ్యానికి చాలా మంచిదని మనందరికీ తెలుసు. దీన్ని ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఎముకల బలం పెరగడం, జీర్ణక్రియ మెరుగుపడటం లాంటి అనేక ప్రయోజనాలు లభిస్తాయి. అయితే పెరుగు తినడానికి సరైన సమయం, సరైన పద్ధతి తెలిస్తే, ఆ ప్రయోజనాలను మనం రెట్టింపు చేసుకోవచ్చు. పెరుగు తినడంపై ఆయుర్వేదం చెప్పిన ముఖ్యమైన నియమాలను ఇప్పుడు చూద్దాం.

ప్రతిరోజూ పెరుగు తినడం మంచిదేనా..?

తప్పకుండా మంచిది. పెరుగు అనేది ప్రోబయోటిక్స్‌కు గొప్ప వనరు.

జీర్ణక్రియకు మేలు: ఇందులో ఉండే మంచి బ్యాక్టీరియా పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. వేయించిన జీలకర్ర పొడితో కలిపి తింటే మలబద్ధకం, అజీర్ణం వంటి కడుపు సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

శక్తి పెరుగుతుంది: పెరుగులో పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఇది శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది. అలసటగా, బలహీనంగా అనిపించినప్పుడు పెరుగు క్రమం తప్పకుండా తీసుకోవడం చాలా ప్రయోజనకరం.

జుట్టు, చర్మానికి: పెరుగును జుట్టుకు రాస్తే చుండ్రు తగ్గుతుంది. చర్మానికి పూస్తే టానింగ్ సమస్య తగ్గి, చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. బరువు తగ్గడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

పెరుగు ఎప్పుడు తినకూడదు?

ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. కొన్ని సమయాల్లో పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిది కాదు:

రాత్రి పూట వద్దు: పెరుగు చల్లబరిచే గుణం కలిగి ఉంటుంది. రాత్రిపూట మన శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది కాబట్టి ఈ సమయంలో పెరుగు తింటే జలుబు, దగ్గు, సైనస్ లేదా కఫం పెరిగే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో ఉదయం లేదా రాత్రి పూట పెరుగు తినడం పూర్తిగా మానుకోవడం మంచిది.

ఎవరు పెరుగు తినొద్దు..?

పెరుగు మంచిదే అయినా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి:

గుండె జబ్బులు, కొలెస్ట్రాల్: అధిక కొలెస్ట్రాల్ లేదా గుండె జబ్బులు ఉన్నవారు పెరుగును మితంగా తీసుకోవాలి. వీలైనంత వరకు తక్కువ కేలరీలు ఉన్న పెరుగును ఎంచుకోవాలి.

ఉప్పుతో సమస్య: అధిక రక్తపోటు లేదా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారు పెరుగులో ఉప్పు కలపకుండా తినాలి.

తీపి పెరుగు మంచిదా?

చాలామంది పెరుగులో చక్కెర, బ్రౌన్ షుగర్ లేదా బెల్లం కలుపుకొని తినడానికి ఇష్టపడతారు. కానీ ఇది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. తీపి కలపడం వల్ల కేలరీల సంఖ్య పెరుగుతుంది.అధిక బరువు ఉన్నవారు లేదా డయాబెటిస్ రోగులు తీపి పెరుగును పూర్తిగా మానుకోవాలి.

ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేనివారు పెరుగును ఎలాంటి భయం లేకుండా ఆస్వాదించవచ్చు. పోషక విలువలు పెరగాలంటే పెరుగులో పచ్చి కూరగాయల సలాడ్‌లను కలుపుకుని తినడం ఉత్తమమైన ఎంపిక.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
చెన్నంగి ఆకులతో చెప్పలేనన్నీ లాభాలు.. ఇలా వాడారంటే ఆ సమస్యలన్నీ
చెన్నంగి ఆకులతో చెప్పలేనన్నీ లాభాలు.. ఇలా వాడారంటే ఆ సమస్యలన్నీ
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
ఈ 5 విషయాలే ధీరూభాయ్ అంబానీ సక్సెస్‌కు ప్రధాన కారణం!
ఈ 5 విషయాలే ధీరూభాయ్ అంబానీ సక్సెస్‌కు ప్రధాన కారణం!
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్.. సోషల్ మీడియాలో
స్మృతి మంధాన పెళ్లి క్యాన్సిల్.. సోషల్ మీడియాలో
ఉదయాన్నే టీ, కాఫీలు వద్దు..చియాసీడ్‌ వాటర్‌ తీసుకున్నారంటే...
ఉదయాన్నే టీ, కాఫీలు వద్దు..చియాసీడ్‌ వాటర్‌ తీసుకున్నారంటే...
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
'దూకుడు' మూవీ వలనే అఖండ2 ఆగిపోయిందా..అప్పట్లో ఏం జరిగిందంటే?
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
హైదరాబాదీలకు ఫ్రీ బిర్యానీ.. టాలీవుడ్ హీరో క్రేజీ ఆఫర్ వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
ఓ వైపు విమానాలు క్యాన్సిల్‌..మరో వైపు టికెట్లు ఫుల్‌ ? వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
అత్యంత కఠిన మార్గంలో.. భారత్‌‌కు పుతిన్‌ విమానం..వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
బాలయ్య రేర్‌ రికార్డ్‌.. ఆ తరం హీరోల్లో ఒక్క మగాడు ఈయనే వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
మేనేజర్‌ కూతురికి.. మెగాస్టార్ వరాల జల్లు వీడియో
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
తప్పుదారి పట్టిస్తున్నాడా? నిజంగానే చేస్తున్నాడా?
వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో
వివాదంలో మంగ్లీ పాట.. తెలంగాణ వాదుల నుంచి తీవ్ర ఆగ్రహం వీడియో
షాకింగ్ ఎలిమినేషన్ రీతూ చౌదరి అవుట్ వీడియో
షాకింగ్ ఎలిమినేషన్ రీతూ చౌదరి అవుట్ వీడియో
వేణు స్వామిపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..ఎరక్కపోయి ఇరుకున్నాడుగా వీడియ
వేణు స్వామిపై బాలయ్య ఫ్యాన్స్ ఫైర్..ఎరక్కపోయి ఇరుకున్నాడుగా వీడియ