Weight Loss – Mango: మామిడితో ఈజీగా బరువు తగ్గొచ్చు.. ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..

మామిడికాయలో కేలరీలు ఎక్కువగా ఉంటాయని, దీని వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చాలా మంది పేర్కొంటుంటారు. అయితే ఇది అస్సలు నిజం కాదు.

Weight Loss - Mango: మామిడితో ఈజీగా బరువు తగ్గొచ్చు.. ఈ విషయాలను తప్పనిసరిగా తెలుసుకోండి..
Mango
Follow us

|

Updated on: Jun 16, 2022 | 9:09 PM

Weight Loss with Mango: మామిడిపండు..  పండ్లల్లో రారాజు అని పేర్కొంటుంటారు. ఈ పండును.. చిన్నా, పెద్దా అందరూ ఇష్టంతో తింటారు. అయితే.. కొంతమంది తినేందుకు భయపడుతుంటారు. అలాంటివారందరికీ శుభవార్త. ఎందుకంటే.. మామిడిని ఎలాంటి సంకోచం లేకుండా తినవచ్చు. అవును, మామిడి పండ్లను తినడం ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకోవడంతోపాటు బరువు కూడా తగ్గవచ్చు. అయితే మామిడికాయలో కేలరీలు ఎక్కువగా ఉంటాయని, దీని వల్ల బరువు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చాలా మంది పేర్కొంటుంటారు. అయితే ఇది అస్సలు నిజం కాదు. అందుకే.. ఈ రోజు మేము మామిడిని తినడానికి సరైన మార్గం, దాని ప్రయోజనాల గురించి మీకు తెలియజేయబోతున్నాము. తద్వారా ఇది మీ బరువు తగ్గించే ప్రక్రియలో ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది ఎలాంటి హాని కలిగించదు. మామిడి బరువును ఎలా అదుపులో ఉంచుతుందో ఇప్పుడు తెలుసుకోండి..

మామిడి ప్రయోజనాలు..

మామిడిలో ఫైబర్, విటమిన్ సి, కాపర్, ఫోలేట్, విటమిన్లు A, E, B5, K, B6, పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి అనేక రకాలుగా మేలు చేస్తాయి.

ఇవి కూడా చదవండి

ఒక నివేదిక ప్రకారం, మామిడిలో ఉండే బయోయాక్టివ్ సమ్మేళనాలు, ఫైటోకెమికల్స్ కొవ్వుతో సంబంధం ఉన్న జన్యువులను నివారిస్తాయి . శరీరంలో పేరుకుపోయిన అదనపు కొవ్వు తగ్గడంతోపాటు బరువు కూడా తగ్గుతుంది.

నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బరువు తగ్గించే ప్రక్రియలో ఉన్నవారు మామిడి పండ్లను ఎక్కువగా తినకూడదు. బరువు పెరగకుండా, బరువు తగ్గించే ప్రయాణంపై ప్రభావం చూపకుండా ఉండేలా కొన్ని చర్యలు తీసుకోవాలి. వీటిని దృష్టిలో ఉంచుకున్న తర్వాత మాత్రమే మామిడిని తినాలని నిపుణులు సూచిస్తున్నారు.

మామిడిని ఇలా తినండి

  • మామిడిపండు పరిమాణాన్ని దృష్టిలో ఉంచుకుని తింటే, మీ బరువు పెరగదు.
  • మీరు బరువు తగ్గించే ప్రక్రియలో ఉన్నట్లయితే, జ్యూస్, షేక్‌ లా తీసుకోవాలి.
  • ఒక రోజులో ఒకటి కంటే ఎక్కువ మామిడిని తినకూడదు.
  • ఆహారంతో పాటుగా మామిడిని ఎప్పుడూ తినకూడదు.
  • భోజనానికి ముందు లేదా అల్పాహారంలో తినవచ్చు

మామిడిని ఎప్పుడు తినాలి.. మధ్యాహ్నం లేదా స్నాక్స్‌లా వీటిని తినవచ్చు. మామిడి పండు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కానీ బరువు తగ్గేటప్పుడు దాని పరిమాణాన్ని గుర్తుంచుకోండి. అతిగా తీసుకోవడం వల్ల కూడా బరువు పెరుగుతారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. ఆరోగ్య నిపుణుల సలహాల మేరకు అందించడం జరుగుతుంది. ఏదైనా సందేహాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించండి.)

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
కృషిపట్టుదలకు స్ఫూర్తి ఈ యువతి చేతులు లేకపోయినా కాళ్లతో డ్రైవింగ్
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
వ్యాయామం చేస్తే ఒళ్ళు నొప్పులు ఎందుకు వస్తాయి..? ఇలా చేస్తే..
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
మహిళలూ ఇది మీకోసమే.. ఈ వ్యాపారంతో అస్సలు తిరుగుండదు.!
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
పీఎఫ్ విత్ డ్రా నిబంధనలు మరింత సరళతరం.. రూ. లక్ష వరకూ..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
ఎన్నికల్లో టికెట్ కాదు ముఖ్యం.. నామినేషన్ దగ్గరే అసలు సమస్య..
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
రుతురాజ్ సెంచరీ చేస్తే మ్యాచ్ ఫసక్.. చెన్నై సారథి చెత్త రికార్డు
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
ప్రేక్షకులపైకి దూసుకెళ్లిన రేస్‌ కారు.. ఏడుగురు దుర్మరణం..
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
మూడు శుభ గ్రహాలపై శనీశ్వరుడి దృష్టి.. వారికి రాజయోగ ఫలితాలు..!
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
6,128 విమానాలు.. 4.71 లక్షల మంది ప్రయాణికులు
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే
ఈ మసాలాలు వాడితే చాలు,ఒంట్లో కొవ్వు కొవ్వొత్తిలా కరిగిపోవాల్సిందే