Weight Loss: డైటింగ్‌ చేయకుండా బరువు తగ్గవచ్చు.. నిపుణులు ఏం సూచిస్తున్నారో తెలుసా..?

Weight Loss:వాస్తవానికి బరువు తగ్గాలంటే డైటింగ్ ఒక్కటే మార్గమని అనుకుంటారు. కానీ ఇది నిజంకాదు. మీరు డైటింగ్‌ చేయకుండా బరువు తగ్గవచ్చు.

Weight Loss: డైటింగ్‌ చేయకుండా బరువు తగ్గవచ్చు.. నిపుణులు ఏం సూచిస్తున్నారో తెలుసా..?
Weight Loss
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 21, 2021 | 7:23 AM

Weight Loss:వాస్తవానికి బరువు తగ్గాలంటే డైటింగ్ ఒక్కటే మార్గమని అనుకుంటారు. కానీ ఇది నిజంకాదు. మీరు డైటింగ్‌ చేయకుండా బరువు తగ్గవచ్చు. అందుకు ఆహారంలో మార్పు చేస్తే సరిపోతుంది. మీరు మీ జీవనశైలిలో చిన్న చిన్న మార్పులు చేస్తే సులువుగా బరువు తగ్గవచ్చు. ఇందుకోసం కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారాలను అవైడ్‌ చేయాలి. ఉప్పు తక్కువగా తినాలి. పరిశుభ్రమైన ఫుడ్‌ తీసుకోవాలి. ఇది మీ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది. ఇప్పుడు డైటింగ్‌ చేయకుండా బరువు ఎలా తగ్గాలో తెలుసుకుందాం.

1. పోషకాహారం బరువు తగ్గడానికి ముందుగా పోషకాహారం తీసుకోవాలి. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, గింజలలో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి శరీరం సమర్థవంతంగా పనిచేయడానికి అవసరమవుతాయి. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను అదుపులో ఉంచవచ్చు. టైప్ 2 డయాబెటిస్, గుండె సమస్యల ప్రమాదాన్ని తగ్గించవచ్చు.

2. ప్రాసెస్ ఆహారం వద్దు ప్రాసెస్ చేయబడిన ఆహారాలు, జంక్‌ ఫుడ్ తినడం మంచిది కాదు. దీనివల్ల త్వరగా బరువు పెరుగుతారు. సహజంగా మీరు బరువు తగ్గాలనుకుంటే కచ్చితంగా వీటిని అవైడ్‌ చేయాలి. ప్రాసెస్ చేసిన ఆహారాలలో ఉప్పు, అనారోగ్యకరమైన కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి బరువు పెరగడం, హృదయ సంబంధ సమస్యలు, మూత్రపిండాల సమస్యలకు కారణమవుతాయి. కాబట్టి డైట్‌లో ఎప్పుడు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు మాత్రమే ఉండేలా చూసుకోండి.

3. చక్కెర ఆహారాలు చక్కెరలో కేలరీలు తప్ప మరేమీ ఉండవు. అవి జీరో పోషకాలను కలిగి ఉంటాయి. మీ శరీర అంతర్గత వ్యవస్థకు ఏ విధంగానూ సహాయపడవు. పంచదార తినడం వల్ల ఆరోగ్యానికి ఎక్కువ హాని జరుగుతుంది. ఇది వాపునకు దారి తీస్తుంది. టైప్ 2 మధుమేహం, క్యాన్సర్ ప్రమాదాన్ని పెంచుతుంది. వృద్దాప్య ఛాయలు తొందరగా వస్తాయి. మీరు ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటే, బరువు తగ్గాలని ప్రయత్నిస్తే ఆహారం నుంచి చక్కెరను తీసివేయండి. బదులుగా బెల్లం, తేనె, వాడండి.

4. ప్రొటీన్‌ ఆహారాలు కండరాల నిర్మాణం కోసం తగినంత మొత్తంలో ప్రోటీన్ తీసుకోవడం అవసరం. భోజనంలో ప్రొటీన్‌ ఉండటం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. కొవ్వును కండరాలతో భర్తీ చేయడానికి కూడా ప్రోటీన్ సహాయపడుతుంది. ఇది ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండటానికి కచ్చితంగా అవసరం.

BEL Recruitment 2021: మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..

BEL Recruitment 2021: మచిలీపట్నంలోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్‌లో పోస్టులు.. ఇలా అప్లై చేసుకోండి..

Electric Cars: ఎలక్ట్రిక్‌ కార్ల కొనుగోలుపై పన్ను మినహాయింపు.. ఎంత ప్రయోజనం పొందవచ్చంటే..?