హలో ..మీ వంటింట్లో ఉప్పు ఉందా?

ఉప్పు లేని ఇల్లు ఉంటుందా? ఇదేం ప్రశ్న అనుకోకండి. ఉప్పు లేకపోతే వంటలు ఎలా చేసుకోగలుతాం? నిజమే.. వంటల్లో రుచికోసం ఉపయోగించే ఉప్పు.. ఒక రకమైన విషపదార్ధమని మీకు తెలుసా? అవును ఇది నిజం. ఎందుకంటే ఉప్పును మోతాదుకు మించి తీసుకుంటే కోరి కష్టాలను కొనితెచ్చుకున్నట్టే. ఉప్పును అధికంగా ఉపయోగిస్తే కలిగే నష్టాలేమిటో ఇది చదివితే మీకే తెలుస్తుంది. చిన్న వయస్సులోనే మూత్రపిండాల వ్యాధులు ఏటికేడాది పెరుగుతున్నాయి. డయాలసిస్ చేయించుకునే వారిలో 25 నుంచి 30 ఏళ్లలోపు […]

హలో ..మీ వంటింట్లో ఉప్పు ఉందా?
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2019 | 1:55 AM

ఉప్పు లేని ఇల్లు ఉంటుందా? ఇదేం ప్రశ్న అనుకోకండి. ఉప్పు లేకపోతే వంటలు ఎలా చేసుకోగలుతాం? నిజమే.. వంటల్లో రుచికోసం ఉపయోగించే ఉప్పు.. ఒక రకమైన విషపదార్ధమని మీకు తెలుసా? అవును ఇది నిజం. ఎందుకంటే ఉప్పును మోతాదుకు మించి తీసుకుంటే కోరి కష్టాలను కొనితెచ్చుకున్నట్టే. ఉప్పును అధికంగా ఉపయోగిస్తే కలిగే నష్టాలేమిటో ఇది చదివితే మీకే తెలుస్తుంది. చిన్న వయస్సులోనే మూత్రపిండాల వ్యాధులు ఏటికేడాది పెరుగుతున్నాయి. డయాలసిస్ చేయించుకునే వారిలో 25 నుంచి 30 ఏళ్లలోపు ఉన్న రోగుల సంఖ్య పెరిగిపోతుంది. దీనికి ప్రధాన కారణం కిడ్నీ వైఫల్యం. దేశంలో సంభవించే మరణాల్లో ఐదు ప్రధాన కారణాల్లో కిడ్నీ వైఫల్యం ఒకటని నివేదికలు చెబుతున్నాయి. మరి ఈ సమస్యను నివారించడం ఎలా? దీనికి చేయాల్సింది పెద్దగా ఏమీలేదు. మన వంటింట్లోనే దీనికి పరిష్కారం ఉంది. వంటల్లో రుచికోసం ఉపయోగించే ఉప్పును తగ్గిస్తే కిడ్నీలను కాపాడుకున్నట్టే అంటున్నారు వైద్యులు.

మూత్రపిండాలు వైఫల్యం చెందడానికి ఒక కారణం బీపీ. ఉప్పు అధికంగా వినియోగించడానికి.. శరీరంలో బీపీ పెరగడానికి మధ్య లింక్ ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉప్పును అధికంగా తీసుకోవడం రక్తపోటుకు దారితీయవచ్చు, కానీ దీనికి విరుద్ధంగా, మీరు రక్తపోటును నియంత్రించగలిగితే, ఖచ్చితంగా కిడ్నీలు పాడవకుండా ఉంటాయంటున్నారు.

నోటికి రుచిగా ఉన్నాయి కదా అని ఊరగాయలు, పచ్చళ్లు, నామ్కీన్స్ (వేయించిన స్నాక్స్) వంటి ఆహార పదార్ధాలను తీసుకోవడం మంచిది కాదంటున్నారు. వీటిలో ఉప్పు అధికంగా ఉంటుంది. ఉప్పు శాతాన్ని తగ్గించి తింటే మందులు కూడా బాగా పనిచేస్తాయి. ఉప్పును తగ్గించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకున్నవాళ్ళమవుతాం. ముఖ్యంగా వండిన పదార్ధాలపై ఉప్పును చల్లుకుని తినే అలవాటు కొన్ని ప్రాంతాల వారికి ఉంది. దీంతో మరీ ప్రమాదం ఏర్పడే అవకాశాలున్నాయి. తినే ఆహార పదార్ధాల్లో ఉప్పును తగ్గించడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండటం ద్వారా కిడ్నీ సమస్యలతో పాటు ప్రాణాపాయకర పరిస్థితులనుంచి కూడా కాపాడుకోవచ్చు.

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!