బ్రెయిన్‌స్ట్రోక్‌కు అసలు కారణం..

బ్రెయిన్‌ స్ట్రోక్‌..ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇటీవలి కాలంలో చాలా మంది బ్రెయిన్‌స్ట్రోక్‌తోనే మరణిస్తున్నారు. మెదడులో రక్తనాళాలు చిట్లితే బ్రెయిన్ స్ట్రోక్‌‌కు గురవుతారు.. అయితే ఈ బ్రెయిన్‌స్ట్రోక్ ఎక్కువగా నాన్‌ వెజిటేరియన్లకే వస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. వాస్తవానికి మాంసాహారుల్లో కంటే శాఖాహారుల్లోనే ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తాయని EPIC- ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. దాదాపు 50 వేల మందిపై సుమారు 18 ఏళ్లపాటు జరిపిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అసలు […]

బ్రెయిన్‌స్ట్రోక్‌కు అసలు కారణం..
Follow us

|

Updated on: Sep 09, 2019 | 5:06 PM

బ్రెయిన్‌ స్ట్రోక్‌..ఇప్పుడు ప్రపంచాన్ని వణికిస్తోంది. ఇటీవలి కాలంలో చాలా మంది బ్రెయిన్‌స్ట్రోక్‌తోనే మరణిస్తున్నారు. మెదడులో రక్తనాళాలు చిట్లితే బ్రెయిన్ స్ట్రోక్‌‌కు గురవుతారు.. అయితే ఈ బ్రెయిన్‌స్ట్రోక్ ఎక్కువగా నాన్‌ వెజిటేరియన్లకే వస్తుందని తాజా అధ్యయనాలు వెల్లడించాయి. వాస్తవానికి మాంసాహారుల్లో కంటే శాఖాహారుల్లోనే ఈ బ్రెయిన్ స్ట్రోక్స్ ఎక్కువగా వస్తాయని EPIC- ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్శిటీ పరిశోధకుల అధ్యయనంలో తేలింది. దాదాపు 50 వేల మందిపై సుమారు 18 ఏళ్లపాటు జరిపిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటకు వచ్చాయి. అసలు మాంసాహారులకన్నాశాకాహారుల్లోనే బ్రెయిన్‌ స్ట్రోక్‌ వచ్చే అవకాశం 20 శాతం అధికమని పరిశోధకులు తేల్చిచెప్పారు. దీనికి గల కారణాలను కూడా ఆక్స్‌ఫర్డ్ పరిశోధకులు తెలిపారు. శాకాహారుల్లో మెదడు రక్తనాళాల గుండా తక్కువ కొలస్ట్రాల్, బీ12 లాంటి విటమిన్లు తక్కువగా ప్రవహించడం వల్ల రక్తనాళాలు చీలిపోయే అవకాశం ఎక్కువగా ఉందని వారు గుర్తించారు. తద్వారా మాంసాహారులతో పోలిస్తే శాఖాహారుల్లో మెదడులో రక్తనాళాలు చిట్లిపోయి బ్రెయిన్‌స్ట్రోక్ సంభవిస్తుందని పరిశోధకులు తెలిపారు. అయితే మాంసాహారుల్లో హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వారు చెప్పారు. రెగ్యులర్‌గా చికెన్, మటన్ తినేవారి కంటే కూరగాయలు, చేపలు తినే వారిలో గుండెపోటు వచ్చే అవకాశం తక్కువ ఉంటుందని వారు తెలిపారు. మాంసాహారులతో పోలిస్తే శాకాహారుల్లో గుండెపోటు వచ్చే అవకాశం 22 శాతం తక్కువని చెప్పారు. ఈ వివరాలన్నీ బ్రిటిష్‌ మెడికల్‌ జర్నల్‌లో ప్రచురించారు.

సగటున 45 ఏళ్ల ప్రాయంగల 50వేల మందిని ఎంపిక చేసుకొని వారిపై పరిశోధకులు తమ అధ్యయనం చేశారు. వారిలో సగం మంది మాంసహారులుకాగా, మూడో వంతు మంది శాకాహారులు, ఐదో వంతు మంది చేపలు తినేవారు ఉన్నారు. వారిపై 18 ఏళ్లపాటు అధ్యయనం కొనసాగించగా వారిలో 2,820 మంది గుండె జబ్బులకు గురికాగా, 1,072 మంది బ్రెయిన్‌ స్ట్రోక్‌లకు గురయ్యారు. అయితే నేటి పరిస్థితుల్లో బ్రెయిన్‌ స్ట్రోక్‌ కన్నా గుండెపోటు వల్లనే ఎక్కువ మంది మరణిస్తున్నారు కావున మాంసాహారం కంటే శాకాహారమే ఒక విధంగా మేలని పరిశోధకులు అంటున్నారు. మొత్తంగా..మాంసాహారంతో గుండెపోటు ముప్పు ఉంటే…శాఖాహారంతో బ్రెయిన్‌స్ట్రోక్ ప్రమాదం ఉందన్న మాట. అయితే శాకాహారుల్లో సాధారణ ఆకుకూరలు, కూయగారలతో పాటు, దుంపలు, గింజలు, పప్పు దినుసులు, పండ్లు తిన్నట్లయితే కొలస్ట్రాల్‌ శాతం పెరిగి శాఖాహారులు బ్రెయిన్‌స్ట్రోక్ ముప్పు నుంచి బయటపడవచ్చునని డాక్టర్లు అంటున్నారు.
మొత్తానికి వెజిటేరియన్‌, నాన్‌ వెజిటేరియన్‌ అని కాకుండా..మన శరీర అవసరానికి కావాల్సిన అన్ని రకాల ప్రోటీన్లు, విటమిన్లు, కార్బోహైడ్రేడ్లు కలిగిన అన్నిరకాల కూరగాయలు, పండ్లు,

దుంపలు, పప్పుదినుసులు సమతుల్యంగా తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు మన పెద్దలు.

కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
కాంగ్రెస్‌ కార్పొరేటర్‌ కుమార్తె దారుణహత్య.. కత్తితో పొడిచి పరార్
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
సీఎం జగన్‎పై దాడి కేసులో పురోగతి.. రిమాండుకు ఏ1.. ఏ2 కోసం విచారణ.
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
బాలీవుడ్‌లో దుమ్మురేపుతోన్న మన సినిమాలు..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
చెన్నైతో పోరుకు సిద్ధమైన లక్నో.. గణాంకాలు చూస్తే హోరాహోరీ..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
కాంతార ప్రీక్వెల్‌లో ఆ స్టార్ నటుడు.. రిషబ్ శెట్టి ప్లాన్ అదేనా..
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చావు బ్రతుకుల మధ్య బిడ్డ.. కర్కశంగా మారిన రాజ్!
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
చారిత్రాత్మక మ్యాచ్‌లో రెండు రికార్డులు లిఖించిన రోహిత్ శర్మ
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
ఇది బిగినింగ్ మాత్రమే బ్రదర్..! ఓజీ పై హైప్ ఎక్కిస్తున్న తమన్..
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!