Sibling Rivalry: పిల్లల్లో గిల్లిగజ్జాలు శృతి మించుతున్నాయా? తల్లిదండ్రులూ ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

పొద్దున లేచిన దగ్గర నుంచి స్నానం చేయాలన్నా.. టిఫిన్, ఫుడ్, గేమ్స్, ఆఖరి బెడ్ విషయంలోనూ పిల్లల మధ్య పోటీ, అరుపులు కేకలు కొనసాగుతూనే ఉంటాయి. ఇవి శృతిమించనంత వరకూ ఓకే.. పరిధి దాటితేనే సమస్యలు ఉత్పన్నమవుతాయి. మరీ అలాంటి సమయంలో తల్లిదండ్రులు ఏం చేయాలి..

Sibling Rivalry: పిల్లల్లో గిల్లిగజ్జాలు శృతి మించుతున్నాయా? తల్లిదండ్రులూ ఈ టిప్స్ ఫాలో అవ్వండి..
Sibling Rivalries
Follow us

|

Updated on: Jan 29, 2023 | 1:10 PM

ఇంట్లో పిల్లలుంటేనే సందడి.. వారి గిల్లికజ్జాలు, ప్రతిదాంట్లో పోటీ, కీచులాటలు.. ఒకే ఇద్దరు ముగ్గురు పిల్లలున్న ప్రతి ఇంట్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తుంటుంది. పొద్దున లేచిన దగ్గర నుంచి స్నానం చేయాలన్నా.. టిఫిన్, ఫుడ్, గేమ్స్, ఆఖరి బెడ్ విషయంలోనూ పిల్లల మధ్య పోటీ, అరుపులో కేకలు కొనసాగుతూనే ఉంటాయి. ఒకవేళ చిన్నోడు ఏదైనా మంకు పట్టు పడితే, చిన్నోడికి నచ్చజెప్పడం.. లేదా పెద్దోడి డిమాండ్లకు తలొగ్గి చిన్నోడిని సముదాయించడం ఇంట్లో తల్లికి గానీ తండ్రికిగానీ కత్తి మీద సామే. చూడటానికి, ఆస్వాదించడానికి బావుంటాయి. అయితే అవి శృతి మించనంత వరకే.. పరిధి దాటిపోతే పిల్లల మానసిక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాంటి సందర్భంగా తల్లిదండ్రులు తీసుకోవాల్సిన చర్యలు, జాగ్రత్తలపై వారు చెబుతున్న సూచనలివి..

పిల్లల మధ్య ఎలాంటి పోటీ ఉండాలి?

ఇంట్లో ఇద్దరు పిల్లలున్నారుకోండి.. వారి మధ్య తరచూ జరిగే గొడవలు.. వాదోపవాదాలు, పోటీ తత్వం ఎంత ఉన్నా అవి స్నేహపూర్వక వాతావరణంలోనే ఉండాలి. ఇది పిల్లల ఎదుగుదలకు బాగా ఉపకరిస్తుంది. ఒకరికొకరు సాయం చేసుకోవడం.. ఒకరి సాయంతో మరొకరు సమస్యలు పరిష్కరించుకోవడం, ఒకరికి ఒకరు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు వీలుగా అవసరమైన నైపుణ్యాలు ఆ చిన్న చిన్న గిల్లికజ్జాలు వారికి నేర్పిస్తాయి. అంతేకాక ఓడిపోయినప్పుడు కూడా పాజిటివ్ అప్రోచ్ ను అలవాటు చేయిస్తాయి. అలాగే కష్టాన్ని, పనితనాన్ని అభినందించేలా చేస్తాయి. ఇది వారి జీవితంలో మంచి మనస్తత్వం పెంపపొందించుకునేందుకు సాయంపడతాయి.

ఒకవేళ మీ ఇద్దరు పిల్లల మధ్య పరిధి దాటిన గొడవలు, కొట్టుకోవడం, పిచ్చి పిచ్చి మాటలు అనుకోవడం వంటివి ఎక్కువ అయితే పిల్లలో స్వార్థపూరిత మనస్తత్వం అలవడటం తోపాటు వారిలో మానసిక సమస్యలు తలెత్తుతాయి. ముఖ్యంగా యాంగ్జైటీ, డిప్రెషన్, స్ట్రెస్ ఎక్కువవుతాయి. దీర్ఘకాలంలో అవి అనేక మానసిక సమస్యలకు కారణమవుతాయి. అలాగే ఇదే గొడవులు ఇద్దరు తోబుట్టువుల మధ్య దూరాన్ని పెంచేస్తాయి. ఒకరిపై ఒకరికి ప్రేమ లేకుండా చేసేస్తాయి. వాటిని సరిదిద్దలేనంతగా వారి జీవితాలను ప్రభావితం చేస్తాయి.

ఇవి కూడా చదవండి

తల్లిదండ్రులదే బాధ్యత..

అయితే పిల్లల మధ్య ఈ పరిస్థితులను గుర్తించడం తల్లిదండ్రుల ముఖ్య బాధ్యత. వారి మధ్య తరచూ జరుగుతున్న గొడవలు, వాదోపవాదాలను ఎప్పటి కప్పుడు గుర్తించి, వారి మధ్య మీరు ఉండి సమస్యలు రాకుండా చేయాలి. తద్వారా పిల్లలో నెగెటివ్ ప్రభావాలు రాకుండా కాపాడవచ్చు. అందుకోసం తల్లిదండ్రులు ఈ టిప్స్ ఫాలో అవ్వండి..

సానుకూల ధోరణిని అలవాటు చేయాలి.. పిల్లల్లో వ్యతిరేక ప్రభావాలను నియంత్రించడానికి తల్లిదండ్రలు చేయాల్సిన మొదటి విధి వారిలో సానుకూల దృక్పథం అలవాటు చేయాలి. ఒకరినొకరు గౌరవించుకునేలా చేయడం, ఎదుటి వారి అభిప్రాయాలకు విలువ ఇవ్వడం వంటివి నేర్పించాలి. ఒకరి కొకరు కొన్ని బహుమతులు ఇచ్చుకునేలా ప్రోత్సహించాలి.

శృతి మించకుండా.. పిల్లల్లో ఏదైనా పని చేస్తున్నప్పుడు శృతి మించకుండా చూసుకోవాలి. వారికి కచ్చితమైన పరిధులు చెప్పాలి. ఇలా చేయాలి.. అలా చేయకూడదు.. వంటి కొన్ని నియమాలు విధించాలి.

స్వేచ్ఛనివ్వాలి.. పిల్లలను బంధించకూడదు. భయపెట్టకూడదు. వారికి అవసరమైన స్వేచ్ఛను తల్లిదండ్రులు ఇవ్వాలి. వారి ఇష్టాలు, అభిరుచులకు అనుగుణంగా నడుచుకునేలా ప్రోత్సహించాలి. వారికంటూ కొన్ని గోల్స్ పెట్టుకుని ముందుకు వెళ్లేలా చూడాలి. అది తోబుట్టువుల మధ్య జెలస్ ఫీలింగ్ రాకుండా చేస్తుంది.

టీం వర్క్.. పిల్లలు ఎక్కువగా టీం వర్క్ చేసేలా ప్రోత్సహించాలి. వారు చేసే పనులు, ప్రాజెక్ట్స్ వంటివి ఒక్కరిచేతనే చేయించకుండా ఇద్దరు పంచుకుని చేసేలా చూడాలి. ఇది వారు ఒకరికొకరు అర్థం చేసుకోడానికి, ప్రోత్సహించుకోడానికి సాయపడుతుంది. ఇద్దరూ కలిసి ఆడుకోవడం వంటి చేయాలి.

సమన్యాయం ఉండాలి.. పిల్లల మధ్య సమానభావం పెంపొందించాలి. ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అనే భావన మనసులోకి రానివ్వకుండా జాగ్రత్తపడాలి. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. అలాగే ఒకరితో ఒకరిని కంపేర్ చేసుకోకుండా చూడాలి.

కమ్యూనికేషన్ పెంచాలి.. పిల్లల్లో కమ్యూనికేషన్ పెంచేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకోవాలి. ఒకరి మాట ఒకరు వినడంతో పాటు తమ భావాలను భయం లేకుండా వెల్లడించేలా ప్రోత్సహించాలి. అప్పుడు వారి మధ్య సమస్యలను వారే సక్రమంగా పరిష్కరించుకోగలుతారు.

మీరే ఓ రోల్ మోడల్.. పిల్లలకు తల్లిదండ్రులే ఓ రోల్ మోడల్ లా ఉండాలి. ఇంట్లో సమస్యల ప్రభావాలను పిల్లలపై పడకుండా చూసుకోవాలి. జీవితంలో చాలా పాఠాలు పిల్లలు తల్లిదండ్రుల నుంచే నేర్చుకుంటారు. కాబట్టి వారికి ప్రతి విషయంలో మీరే ఓ ఉదాహరణగా నిలబడగలగాలి.

నిపుణుల సలహాలు.. పిల్లల్లో ప్రతికూల ప్రభావాలు అధికమవుతున్న సమయాల్లో తల్లిదండ్రులుగా మీరు ఏమి చేయలేని పరిస్థితుల్లో ఎవరైనా నిపుణుల సలహాలు, సూచనలు తీసుకోవచ్చు.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
మరికాసేపట్లో తెలంగాణ ఇంటర్‌ 2024 ఫలితాలు.. డైరెక్ట్‌ లింక్‌ ఇదే!
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
ఈ పంటకు తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు.. సాగు చేసే విధానం ఏంటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
పర్సనల్ లోన్ ప్రయోజనాలు..అప్రయోజనాలు ఏమిటి?
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
మ్యూచువల్ ఫండ్ ఖాతాలో మళ్లీ కేవైసీ చేసారా? ఆన్‌లైన్ నిబంధనలు ఏంటి
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 24, 2024): 12 రాశుల వారికి ఇలా..
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌.. భారీగా తగ్గిన బంగారం ధర.. ఎంతంటే
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
ఇక ఓటీపీతో మోసాలకు పాల్పడేవారికి చెక్‌..ప్రభుత్వం కొత్త టెక్నాలజీ
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
మార్కస్ స్టొయినిస్ సూపర్ సెంచరీ.. చెన్నైపై లక్నో సంచలన విజయం
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
ఈ స్టార్ హీరోయిన్లు ఇండియాలో ఓటు వేయలేరు.. లిస్టులో అలియా కూడా..
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!
మీరు కొన్నది నిజమైనా వెండినా లేక కల్తీనా? ఇలా చెక్ చేసుకోండి!