ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది జుట్టు సమస్యలతో ఇబ్బంది పడతున్నారు. మానసిక ఒత్తిడి.. సరైన నిద్రలేకపోవడం వలన జుట్టు రాలడం.. జుట్టు విరిగిపోవడం.. జుట్టు రాలడం జరుగుతుంటుంది. చలికాలంలో జుట్టు రాలిపోవడం.. చుండ్రు సమస్యలు మరింత వేధిస్తుంటాయి. చుండ్రు సమస్యను తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయాత్నాలు చేసి విసిగిపోతారు. అంతేకాకుండా.. మార్కెట్ లో లభించే కెమికల్ ప్రొడక్ట్స్ ఉపయోగించడం వలన జుట్టు రాలడం మరింత తీవ్రమవుతుంది. కానీ మన ఇంట్లో ఉండే కొన్ని పదార్థాల వలన చుండ్రును తగ్గించుకోవచ్చు. అవెంటో తెలుసుకుందామా.
వేపలో యాంటీ బాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. నాలుగు కప్పుల నీటిలో కొన్ని వేపాకులు వేసి మరిగించాలి. ఆ తర్వాత వడగట్టి.. చల్లారిన తర్వాత తలకు పట్టించాలి. అరగంట తర్వాత జుట్టును శుభ్రం చేసుకోవాలి. వారంలో 2, 3 సార్లు ఇలా చేయడం వలన చుండ్రు సమస్య తగ్గుతుంది.
కొబ్బరి నూనెలో యాంటీ ఫంగల్ లక్షణాలు ఉంటాయి. ఇది డ్రై స్కాల్ఫ్ ను తేమ చేస్తుంది. దురదను తగ్గిస్తుంది. కొద్దిగా కొబ్బరి నూనెలో సగం నిమ్మకాయను రసం వేసి తలకు పట్టించాలి. అనంతరం 20 నిమిషాల తర్వాత తలను శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి కడిగేయాలి.
ఆలివ్ నూనెను వాడితే స్కాల్ఫ్ పొడిగా … తేమతో ఉంటుంది. కొద్దిగా ఆలివ్ నూనెను వేడి చేసి తలకు మసాజ్ చే్యాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటిలో ముంచిన గుడ్డతో జుట్టుకు చుట్టు కనీసం 45 నిమిషాల పాటు నానబెట్టి షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వలన చుండ్రు సమస్య తగ్గుతుంది.
Sneha: సంక్రాంతి సంబరాల్లో హీరోయిన్ స్నేహ ఫ్యామిలీ.. సోషల్ మీడియాలో ఎట్రాక్ట్ చేస్తున్న ఫొటోస్..