Tourism day: మహిళల్లో పెరుగుతోన్న కొత్త ట్రెండ్‌.. ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు

టూరిజం రంగ ప్రాముఖ్యతను వివరించేందుకు ప్రతీ ఏటా సెప్టెంబర్‌ 27వ తేదీని ప్రపంచ టూరిజం దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళా టూరిస్టులకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు మహిళలు ఒంటరిగా ప్రయాణం చేసేందుకు సంకోచించేవారు. సెలవులు వస్తే కుటుంబ సభ్యులతో విహారయాత్రకు...

Tourism day: మహిళల్లో పెరుగుతోన్న కొత్త ట్రెండ్‌.. ఒంటరిగా ప్రపంచాన్ని చుట్టేస్తున్నారు
World Tourism Day
Follow us

| Edited By: Narender Vaitla

Updated on: Sep 27, 2024 | 10:42 AM

ప్రస్తుతం టూరిజం కూడా ఒక పెద్ద ఇండస్ట్రీగా మారింది. బడా దిగ్గజ సంస్థలు సైతం ఈ రంగంలోకి ఎంట్రీ ఇస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు టూరిజాన్ని ఒక ఆదాయ వనరుగా మార్చుకుంటున్నాయి. ఏకంగా ప్రభుత్వాలే తమ దేశాన్ని సందర్శించండి అని పిలుపునిస్తున్నారు. దీంతో ఈ రంగం భారీగా విస్తరిస్తోంది. టూరిజంపై హోటల్ రంగాలు సైతం ఆధారపడి ఉన్నాయి.

టూరిజం రంగ ప్రాముఖ్యతను వివరించేందుకు ప్రతీ ఏటా సెప్టెంబర్‌ 27వ తేదీని ప్రపంచ టూరిజం దినోత్సవంగా నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహిళా టూరిస్టులకు సంబంధించి ఒక ఆసక్తికర విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఒకప్పుడు మహిళలు ఒంటరిగా ప్రయాణం చేసేందుకు సంకోచించేవారు. సెలవులు వస్తే కుటుంబ సభ్యులతో విహారయాత్రకు వెళ్లడం లేదా ఇంటికి పరిమితం అయ్యే వారు. అయితే ప్రస్తుతం సోలో ట్రాలెవర్స్‌ సంఖ్య పెరుగుతోంది. మహిళలు ఒంటరిగా ప్రయాణాలు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు.

గడిచిన కొన్ని రోజులుగా ఇందులో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. విదేశాలకు కూడా మహిళలు ఒంటరిగా షికారు చేస్తున్నారు. కేవలం పర్యాటక ప్రదేశాలు చూడడం మాత్రమే కాకుండా. అడ్వాంచర్‌ గేమ్స్‌ అయిన.. డైవింగ్‌, పారా గ్లైడింగ్‌ వంటి సాహస క్రీడలకు కూడా మొగ్గు చూపుతున్నారు. ఇందుకోసం శిక్షణ తీసుకుంటున్న వారి సంఖ్య ప్రతీ ఏటా పెరుగుతోంది. అయితే ఒంటరిగా ప్రయాణం చేస్తున్న మహిళలకు కొన్ని ఇబ్బందులు ఎదురువుతున్నాయి. ముఖ్యంగా మహిళా ట్రావెలర్ల అవసరాలకు అనుగుణంగా టూరిజం ఇండస్ట్రీ పూర్తి స్థాయిలో అవసరాలను కల్పించలేకపోతోంది.

మహిళా భద్రత కోణంలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. లైంగిక వేధింపులకు నివారించడానికి జెండర్‌ సెన్సిటివీ ట్రైనింగ్ కీలకంగా మారింది. మహిళా భద్రత కోణంలో ఇది కీలకంగా మారింది. మహిళల భద్రతా సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని ఉమెన్ ట్రావెలర్ ఎక్విప్మెంట్ రూపొందించాల్సిన బాధ్యత టూరిజం కంపెనీలపై ఉంది. శానిటరీ ప్రోడక్ట్స్‌, పెయిన్ రిలీఫ్‌ మందులు వంటి ఆరోగ్యానికి సంబంధించిన స్టాండర్డ్‌ మెడికల్ కిట్స్‌ను అందుబాటులోకి తీసుకురావాలని సోలో ట్రావెలర్స్‌ చెబుతున్నారు.

మరిన్ని టూరిజం వార్తల కోసం క్లిక్ చేయండి..