North India: ఉత్తర భారతంలో ఈ 5 ఉత్తమ ప్రదేశాలు..! పర్యాటకంగా పేరు పొందిన ప్రాంతాలు..

North India: ఉత్తర భారతంలో ఈ 5 ఉత్తమ ప్రదేశాలు..! పర్యాటకంగా పేరు పొందిన ప్రాంతాలు..
North India

North India: ఉత్తర భారతదేశంలో సందర్శించడానికి చాలా గొప్ప గొప్ప ప్రదేశాలు ఉన్నాయి. కాశ్మీర్ అందం నుంచి రాజస్థాన్ వైభవం వరకు అన్నీ చారిత్రక

uppula Raju

| Edited By: Ravi Kiran

Aug 17, 2021 | 6:20 AM

North India: ఉత్తర భారతదేశంలో సందర్శించడానికి చాలా గొప్ప గొప్ప ప్రదేశాలు ఉన్నాయి. కాశ్మీర్ అందం నుంచి రాజస్థాన్ వైభవం వరకు అన్నీ చారిత్రక ప్రదేశాలే. ప్రేమకు చిహ్నమైన తాజ్ మహల్ నుంచి నదులలో అతి పవిత్రమైన గంగా వరకు అన్ని ఉత్తమమైనవే. ఉత్తర భారతదేశం విశాలమైన స్వభావం, సంస్కృతి, ప్రశాంతమైన అనుభవాల శ్రేణి. ఇది గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని కలిగి ఉంది. ఇది మిమ్మల్ని మంత్రముగ్ధులను చేస్తుంది. ఇందులో 5 గొప్ప ప్రదేశాల గురించి తెలుసుకుందాం.

1. ఢిల్లీ ఢిల్లీ భారతదేశ రాజధాని. నగరం ప్రతి మూలలో దుకాణాలు, రెస్టారెంట్లు ఉంటాయి. ఆకర్షణీయమైన స్మారక కట్టడాల నుంచి వాస్తుశిల్పం, అద్భుతమైన కోటలు, ప్రభుత్వ భవనాలు, పచ్చని తోటలు, వివిధ మ్యూజియంలు, దేవాలయాలు ఉన్నాయి. మీరు ఢిల్లీ పర్యటనలో ఉంటే ఇండియా గేట్, ఎర్రకోట, జామా మసీదు, కుతుబ్ మినార్, హుమయూన్ సమాధి, హజ్రత్ నిజాముద్దీన్ దర్గా, చాందినీ చౌక్, రాజ్ ఘాట్, కమల్ మందిర్, అక్షరధామ్ ఆలయం, స్వామినారాయణ దేవాలయం, రాష్ట్రపతి భవన్ చూడవచ్చు.

2. రాజస్థాన్ రాజస్థాన్ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ప్రతి సంవత్సరం విదేశాల నుంచి పర్యాటకులు పెద్ద సంఖ్యలో రాజస్థాన్ సందర్శిస్తారు. ఈ మహారాజుల భూమి సంప్రదాయం, కళలు, చేతిపనులు, వాస్తుశిల్పం, వంటకాలు మొదలైన వాటిలో రాయల్టీని ప్రతిబింబిస్తుంది. జైపూర్, ఉదయ్‌పూర్, జైసల్మేర్, జోధ్‌పూర్, అజ్మీర్, పుష్కర్, బికనీర్ వంటి అనేక ప్రధాన నగరాలు ఉన్నాయి. అద్భుతమైన కోటలు, మంత్రముగ్ధులను చేసే రాజభవనాలు, హస్తకళలు, గొప్ప సంస్కృతి, ఒంటె, ఏనుగుల సఫారీలు కనువిందు చేస్తాయి. ఈ రాష్ట్రంలో మౌంట్ అబూ అనే హిల్ స్టేషన్ కూడా ఉంది. అమెర్ ఫోర్ట్, సిటీ ప్యాలెస్, హవా మహల్, జంతర్ మంతర్, జైగర్ ఫోర్ట్, పిచోలా లేక్, జల్ మహల్, ఉమైద్ భవన్ ప్యాలెస్, ఆల్బర్ట్ హాల్ మ్యూజియం వంటి అనేక అందమైన ప్రదేశాలు చూడవచ్చు.

3. జమ్మూ కశ్మీర్ జమ్మూ కశ్మీర్ భారతదేశం ఉత్తర భాగంలో ఉంటుంది. ఈ అందమైన ప్రదేశాన్ని “భూమిపై స్వర్గం” గా భావిస్తారు. జమ్మూ కశ్మీర్ ప్రకృతి అందాలు పర్యాటకులను మంత్రముగ్దులను చేస్తాయి. ఇందులో అనేక అందమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి. వీటిలో శ్రీనగర్, గుల్మార్గ్, ఉధంపూర్, కుప్వారా, కార్గిల్, సోన్మార్గ్, పుల్వామా, పహల్గామ్, దోడా, పూంచ్, అనంతనాగ్, బారాముల్లా ఉన్నాయి.

4. హిమాచల్ ప్రదేశ్‌ హిమాచల్ ప్రదేశ్‌లో ప్రకృతి అందాలను ఆస్వాదించవచ్చు. ప్రకృతి మధ్య ప్రశాంతమైన క్షణాలు గడపడానికి విదేశాల నుంచి పర్యాటకులు ఇక్కడికి వస్తారు. ఇది అద్భుతమైన దృశ్యాలను అందించే మనోహరమైన లోయలను కలిగి ఉంటుంది. కులు, మనాలి, సిమ్లా, ముస్సోరీ, చంబా, ధర్మశాల, డల్‌హౌసీ, కాంగ్రా, కసౌలి, హమీర్‌పూర్, సోలాన్, ఉనా, కొన్ని ప్రధాన ఆకర్షణలలో రోహ్‌తాంగ్ పాస్, సోలాంగ్ వ్యాలీ, కాంగ్రా వ్యాలీ మరియు జఖూ ఉన్నాయి.

5. ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్ ప్రధానంగా పుణ్యక్షేత్రాలకు ప్రసిద్ధి చెందింది. ఇది భారతదేశంలోని పవిత్ర రాష్ట్రాలలో ఒకటి. ఇది భారతదేశంలోని ఉత్తర భాగంలో ఉంటుంది. ప్రతి సంవత్సరం పెద్ద సంఖ్యలో యాత్రికులు ఈ రాష్ట్రాన్ని సందర్శిస్తారు. ఉత్తరాఖండ్ హిమాలయాల ఒడిలో ఉంటుంది. డెహ్రాడూన్, నైనిటాల్, హరిద్వార్, రిషికేష్ దీని ప్రసిద్ధ పర్యాటక ప్రదేశాలు. నైనిటాల్ లేక్, బద్రీనాథ్ టెంపుల్, హర్ కి పౌరీ చండీ దేవి టెంపుల్, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్, రాజాజీ నేషనల్ పార్క్, నాయిని పీక్, కేదార్ నాథ్ టెంపుల్, జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఇంకా అనేక ఆకర్షణలు ఉత్తరాఖండ్‌లో ఉన్నాయి.

Viral Video : భర్త మరో మహిళతో ఉండగా రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్న భార్య..! తర్వాత ఏం జరిగిందో మీరే చూడండి..

Two Headed Cobra: వామ్మో రెండు తలల నాగుపాము..! చూస్తే ఆశ్చర్యపోతారు..

Sports Photos: చీరలో ‘సింధు’ మెరిసే..! సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్న ఫొటోలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu