IRCTC Tour: కేరళ అందాలను చూసేలా ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ.. ధరెంతో తెలుసా..?

|

Sep 25, 2024 | 3:45 PM

భారతదేశంలో ప్రకృతి అందాలకు కొదవ ఉండదు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ప్రకృతిని ఆశ్వాదించేందుకు చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని కూడా అంటారు. మీరు కేరళను సందర్శించాలని ప్లాన్ చేయాలనుకునే వారికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీను ప్రకటించింది. కేరళలోని చాలా ప్రాంతాలను అతి తక్కువ బడ్జెట్ లో సందర్శించేలా ఈ ప్యాకేజీను రూపొందించారు.

IRCTC Tour: కేరళ అందాలను చూసేలా ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ.. ధరెంతో తెలుసా..?
Irctc Tour Packages
Follow us on

భారతదేశంలో ప్రకృతి అందాలకు కొదవ ఉండదు. ముఖ్యంగా కేరళ రాష్ట్రంలో ప్రకృతిని ఆశ్వాదించేందుకు చాలా మంది ఆసక్తి చూపుతూ ఉంటారు. కేరళను గాడ్స్ ఓన్ కంట్రీ అని కూడా అంటారు. మీరు కేరళను సందర్శించాలని ప్లాన్ చేయాలనుకునే వారికి ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీను ప్రకటించింది. కేరళలోని చాలా ప్రాంతాలను అతి తక్కువ బడ్జెట్ లో సందర్శించేలా ఈ ప్యాకేజీను రూపొందించారు. ఈ టూర్ ప్యాకేజీలో మీరు కొచ్చి, మున్నార్, అలెప్పీ, తిరువనంతపురం సందర్శించవచ్చు. ఈ నేపథ్యంలో ఐఆర్‌సీటీసీ తాజా ప్యాకేజీ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

ఐఆర్‌సీటీసీ ట్వీట్ చేయడం ద్వారా ఈ టూర్ ప్యాకేజీ గురించి సమాచారాన్ని ఇచ్చింది. సాంస్కృతిక కేరళ పేరుతో వచ్చే ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ 6 రాత్రులు, 7 పగళ్లు ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ అక్టోబర్ 14న హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతుంది. ట్రావెలింగ్ మోడ్ విమానంలో ఉంటుంది. ఇండిగో ఎయిర్‌లైన్స్ ద్వారా హైదరాబాద్ నుంచి తిరువనంతపురం వరకు ప్రయాణించవచ్చు.  ఉదయం టిఫిన్‌తో రెండు పూటలా భోజనం అందిస్తారు. అలాగే కంఫర్ట్ క్లాస్‌లో ప్రయాణాలకు అందిస్తారు. 

ఈ టూర్ ప్యాకేజీలో ఒక్కో వ్యక్తికి రూ.34,850 నుంచి ప్యాకేజీ ప్రారంభమవుతుంది. ట్రిపుల్ ఆక్యుపెన్సీపై ఒక్కో వ్యక్తి ఖర్చు రూ.34,850గా ఉంటుంది. డబుల్ ఆక్యుపెన్సీ కోసం ఒక్కో వ్యక్తికి రూ.37,000 చెల్లించాల్సి ఉంటుంది. సింగిల్ ఆక్యుపెన్సీకి ఒక్కో వ్యక్తికి రూ.53400 వెచ్చించాల్సి ఉంటుంది. ఐఆర్‌సీటీసీ అధికారిక వెబ్‌సైట్ ద్వారా ఈ టూర్ ప్యాకేజీను బుక్ చేసుకోవచ్చు. అలాగే ఐఆర్‌సీటీసీ టూరిస్ట్ ఫెసిలిటేషన్ సెంటర్, జోనల్ కార్యాలయాలు, ప్రాంతీయ కార్యాలయాల ద్వారా కూడా బుకింగ్ చేయవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..