IRCTC Tour Package: చార్‌ధామ్ యాత్ర కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్సీటీసీ.. యాత్ర వివరాలు ఇలా.. 

IRCTC Tour Package: చార్‌ధామ్ యాత్ర కోసం ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్సీటీసీ.. యాత్ర వివరాలు ఇలా.. 
Irctc Tour Package

కరోనా ఇబ్బందులతో చార్‌ధామ్ యాత్ర చేయాలని అనుకున్న భక్తులు వెనుకడుగు వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే, చార్‌ధామ్ యాత్ర చేయాలనుకునే భక్తుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది.

KVD Varma

|

Aug 21, 2021 | 7:43 PM

IRCTC Tour Package: కరోనా ఇబ్బందులతో చార్‌ధామ్ యాత్ర చేయాలని అనుకున్న భక్తులు వెనుకడుగు వేస్తున్న పరిస్థితి ఉంది. అయితే, చార్‌ధామ్ యాత్ర చేయాలనుకునే భక్తుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేకమైన టూర్ ప్యాకేజీని ప్రకటించింది. చెన్నై నుంచి విమానంలోనూ ఢిల్లీ నుంచి ప్రత్యేక బస్సు ద్వారానూ భక్తులను చార్‌ధామ్ యాత్ర చేయించడానికి ఐఆర్సీటీసీ ఏర్పాట్లు చేసింది.  ఇది 13 రోజుల వ్యవధిలో భారతదేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలైన చార్ ధామ్ – బద్రినాథ్, గంగోత్రి, కేదారనాథ్, యమునోత్రి సందర్శనను కవర్ చేస్తుంది.

ఈ పర్యటన 24 సెప్టెంబర్  2021 న ప్రారంభమవుతుంది. మొత్తం 22 సీట్లు ఈ యాత్రకు అందుబాటులో ఉన్నాయి. ఐఆర్టీసీ నిబంధన ప్రకారం, 18 మరియు అంతకంటే ఎక్కువ వయస్సు గల ప్రయాణికులకు కోవిడ్ టీకా (కనీసం ఒక టీకా మోతాదు) తప్పనిసరి.

ఇక ఈ యాత్ర ప్యాకేజీ విశేషాలు ఇలా ఉన్నాయి.. 

విమాన యాత్ర ద్వారా చెన్నై యాత్ర పేరుతో ఈ యాత్ర నిర్వహిస్తున్నారు. ఈ టూర్ చెన్నైలో విమానం ద్వారా ప్రారంభం అవుతుంది. విమానంలో ఢిల్లీ చేరిన తరువాత అక్కడ నుంచి ప్రత్యేక బస్సులో బద్రీనాథ్-కేదార్‌నాథ్-గంగోత్రి-యమునోత్రి దర్శనం అనంతరం తిరిగి ఢిల్లీ వస్తుంది. అక్కడ నుంచి చెన్నైకి విమానంలో తిరుగు ప్రయాణం ఉంటుంది.

విమాన వివరాలు :

ఫ్లైట్ నం UK-0832 చెన్నైలో 24.09.2021 ఉదయం 07.05 గంటలకు బయలు దేరి ఢిల్లీకి 24.09.2021 ఉదయం 09.55 గంటలకు చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఫ్లైట్ నం UK-0837 ఢిల్లీలో 06.10.2021 రాత్రి 17.25 గంటలకు బయలు దేరి అదేరోజు రాత్రి 0.15 గంటలకు చెన్నై చేరుకుంటుంది.

ఛార్జీల వివరాలు.. 

ఒక్కరికి ఒకే ఆక్యుపెన్సీతో 54,000 రూపాయలు. అదే డబుల్ ఆక్యుపెన్సీ విధానంలో 43,500 రూపాయలు, ఇక ట్రిపుల్ ఆక్యుపెన్సీకి 42,000 రూపాయలు ఛార్జి నిర్ణయించారు. ఇక 5-11 సంవత్సరాల పిల్లలకు ప్రత్యేక మంచం సదుపాయంతో 39,500 రూపాయలు.. మంచం సదుపాయం లేకుండా 2 నుంచి 4 సంవత్సరాల పిల్లలకు 35,500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది.

13 రోజుల పూర్తి యాత్ర చార్జీలు వీటన్నిటికీ..

ఎకానమీ క్లాస్‌లో (చెన్నై-ఢిల్లీ-చెన్నై) విమాన చార్జీలతో పాటు.. బడ్జెట్ క్యాటగిరీలో నాన్ ఏసీ గదుల్లో వసతి కల్పిస్తారు. ప్రయివేట్ బస్సు ద్వారా అన్ని సందర్శనా స్థలాలకు తీసుకువెళతారు. ఢిల్లీ-హరిద్వార్-ఢిల్లీ AC వాహనం ద్వారానూ,  హరిద్వార్-చార్ధామ్- హరిద్వార్ నాన్ AC వాహనం ద్వారానూ ప్రయాణ వసతి ఉంటుంది. కేదార్‌నాథ్ అలగే యమునో త్రి ట్రెక్కింగ్ మినహా అన్ని భోజనాలు ప్రయాణ ప్రణాళిక ప్రకారం ఐఆర్టీసీ ఏర్పాటు చేస్తుంది. ఇక కోవిడ్ నివారణ కిట్ అందుబాటులో ఉంటుంది. టూర్ మేనేజర్ సేవలు అందుబాటులో ఉంటాయి. భోజనం పూర్తిగా శాఖాహారం ఉంటుంది. అదేవిధంగా ఐఆర్టీసీ అనుబంధ హోటళ్లలోనే వసతి, భోజనం ఏర్పాట్లు ఉంటాయి.

యాత్రకు వెళ్లాల్సిన వారు తీసుకువెళ్లాల్సిన వస్తువులు ఇవే..

చార్‌ధామ్ యాత్రలో ఎత్తైన పర్వతాలు దాటి, బలమైన చల్లటి గాలులను ఎదుర్కొంటూ ట్రెక్కింగ్ చేయాలి. అందువల్ల మీరుఈ వస్తువులు తీసుకువెళ్లాలని ఐఆర్సీటీసీ సూచిస్తోంది.

తగినన్ని ఉన్ని దుస్తులు, ఒక చిన్న గొడుగు, విండ్‌చీటర్, రెయిన్ కోట్, జలనిరోధిత ట్రెక్కింగ్ బూట్లు, చేతి కర్ర, టోపీ (ప్రాధాన్యంగా మంకీ క్యాప్), చేతి తొడుగులు, జాకెట్, ఉన్ని సాక్స్, ట్రౌజర్‌లు (ప్రాధాన్యంగా జలనిరోధిత జత). వాతావరణం అత్యంత అనూహ్యంగా ఉంటుంది. అదేవిధంగా ఎండ నుంచి వర్షం.. మంచు అకస్మాత్తుగా మారిపోతుంటుంది కాబట్టి ఈ వస్తువుల అవసరం తప్పకుండా ఉంటుందని. అక్కడ ఉష్ణోగ్రతలు ఒక్కోసారి 5 డిగ్రీలకు పడిపోతాయి. అటువంటి పరిస్థితిని తట్టుకోగలిగి ఏర్పాట్లు కూడా ఉంచుకోవడం మంచిది.

చార్‌ధామ్ యాత్రకు వెళ్లాలని అనుకునే వారు యాత్ర పూర్తి వివరాల కోసం ఇలా..

వెబ్‌సైట్ www.irctctourism.com లో వివరాలు తెలుసుకోవచ్చు. లేదా ఐఆర్సీటీసీ ప్రతినిధులతో ఉదయం 10:00 – 18:00 గంటల మధ్య 08287931973 నంబరుకు కాల్ చేయటం ద్వారా సంప్రదించవచ్చు. అంతేకాకుండా..thiagarajan6438@irctc.com అనే ఈ మెయిల్ ఎడ్రస్ కు మెయిల్ చేయడం ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు.

Also Read: Tourism Capital: జమ్ము-కశ్మీర్‌ ‘టెర్రరిజం’ కేపిటల్ కాదు – ‘టూరిజం’ కేపిటల్

Tirupati Pilgrims: తిరుమల కొండపై తప్పకుండా దర్శించాల్సిన పవిత్ర స్థలాలు

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu