Rajasthan: ఎడారి రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకలు.. ఈ 5 ప్రదేశాలు చాలా ఫేమస్‌..!

Rajasthan: రాజస్థాన్‌లో న్యూ ఇయర్‌ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. రాష్ట్రంలో పెద్ద పెద్ద రాజభవనాలు, పురాతన కోటలు చూడముచ్చటగా ఉంటాయి. ఈ నూతన

Rajasthan: ఎడారి రాష్ట్రంలో న్యూ ఇయర్ వేడుకలు.. ఈ 5 ప్రదేశాలు చాలా ఫేమస్‌..!
Bundi Rajasthan

Rajasthan: రాజస్థాన్‌లో న్యూ ఇయర్‌ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. రాష్ట్రంలో పెద్ద పెద్ద రాజభవనాలు, పురాతన కోటలు చూడముచ్చటగా ఉంటాయి. ఈ నూతన సంవత్సరంలో మీ సెలవులను రాజస్థాన్‌లో న్యూ ఇయర్ వేడుకలను గడపడానికి వినియోగించండి. అక్కడ దాగి ఉన్న అందాలను అన్వేషించండి. సాధారణ టూరిస్ట్‌గా కాకుండా స్థానికుడిలా గమ్యాన్ని అన్వేషించే ప్రయాణికుడిగా తిరగండి జీవితంలో ఎన్నో అనుభూతులు మిగిలి పోతాయి.

1. నవల్గర్
రాజస్థాన్‌లోని మరో చిన్న పట్టణం నవల్‌గర్. షెఖావతి ప్రాంతంలో ముఖ్యమైన భాగం. ఈ నగరం అద్భుతమైన హవేలీలకు ప్రసిద్ధి చెందింది. దీనిని తరచుగా హవేలీల భూమిగా సూచిస్తారు. నవల్‌గర్ ఒక పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధి చెందలేదు కానీ ఇక్కడ ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయన్నది నిజం. రూప్ నివాస్ ప్యాలెస్, నవాల్‌ఘర్ కోట, మురార్కా హవేలీ, భగత్ హవేలీ, బన్సీధర్ భగత్ హవేలీ, చోఖాని హవేలీ, పొద్దార్ హవేలీ, బేడియా హవేలీ, చుడీ వాలీ హవేలీ ఇక్కడ ప్రధాన ఆకర్షణలు.

2. లాంగ్వాలా
భారత సైనికులతో కలిసి న్యూ ఇయర్ వేడుకలు జరుపుకోవడం కంటే ఆనందం మరొకటి ఉంటుందా.. 1971లో భారత్‌, పాకిస్థాన్‌ల మధ్య జరిగిన లాంగేవాలా యుద్ధం జైసల్మేర్‌కు సమీపంలోని లోంగేవాలా గ్రామంలో జరిగింది. ప్రముఖ బాలీవుడ్ సినిమా, బోర్డర్‌ను విస్తృతంగా చిత్రీకరించిన ప్రదేశం ఇదే. థార్ ఎడారి మధ్యలో ఉన్న ఈ గ్రామాన్ని ప్రతి భారతీయుడు తప్పక సందర్శించాలి. రాత్రిపూట బస చేయడానికి ఎటువంటి నిబంధన లేదు. కాబట్టి పగటిపూట నగరాన్ని సందర్శించవచ్చు. సీమా కేఫ్‌లో కొంత సమయం గడపవచ్చు సైనికులతో సంభాషించవచ్చు.

3. బుండి
రాజస్థాన్‌లోని మరొక ఆఫ్‌బీట్ రత్నం బుండి. ఈ ప్రాంతంలో అనేక అద్భుతమైన హవేలీలు ఉన్నాయి. బుండీలో రాణి జీ కి బావోరి, బుండీ ప్యాలెస్, తారాగఢ్ ఫోర్ట్, సుఖ్ మహల్‌లను మిస్ అవ్వకండి.

4. బార్మర్
అందమైన ఎడారి నగరం బార్మర్. థార్ ఎడారిలో ఒక భాగం. ఇది రాజస్థాన్‌లోని అత్యంత అన్వేషించే ప్రదేశాలలో ఒకటి. నూతన సంవత్సరాన్ని జరుపుకోవాలనుకునే వారికి ఈ ఆఫ్‌బీట్ నగరం ఉత్తమమైనది.
ఈ నగరం బంగారు ఇసుక దిబ్బలకు ప్రసిద్ధి చెందింది. బార్మెర్‌లోని మహాబర్ దిబ్బలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఇది కాకుండా శివనా కోట, జోగ్మయ దేవాలయం, బ్రహ్మ దేవాలయం కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు.

5. అల్సిసార్
అల్సిసర్ అనే చిన్న పట్టణం రాజస్థాన్‌లోని జుంజును జిల్లాలో ఉంది. చుట్టూ ఎడారి ఉంటుంది. ఈ ప్రదేశం రాజ్‌పుత్ నిర్మాణ సౌందర్యానికి సజీవ ఉదాహరణ. ఇప్పుడు ప్యాలెస్‌ ఒక భారీ స్విమ్మింగ్ పూల్, రెస్టారెంట్‌తో విలాసవంతమైన హోటల్‌గా మార్చబడింది. కేజ్రీవాల్ హవేలీ, లక్ష్మీ నారాయణ్ మందిర్, రామ్ జాస్ ఝున్‌జున్‌వాలాకి కొన్ని ఆసక్తికరమైన ప్రదేశాలు.

Women Health: మహిళల్లో రొమ్ము నొప్పి ఎందుకు వస్తుంది..! క్యాన్సర్‌ సాధారణ నొప్పికి గల తేడాలేంటి..?

యాపిల్‌ పండ్లలో రారాజు.. ఎన్నో వ్యాధులకు దివ్య ఔషధం.. ఈ 8 సమస్యలకి చక్కటి పరిష్కారం..

పోస్టాఫీసులోని ఈ 3 పథకాలలో పెట్టుబడి పెట్టండి.. ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కంటే ఎక్కువ వడ్డీ పొందండి..

Click on your DTH Provider to Add TV9 Telugu