Tourist Destinations: గోవా, కేరళలకు ఏమాత్రం తీసుపోని ప్రకృతి అందాలివి.. స్నేహితులతో ఓసారి చూట్టేసి వచ్చేయండి..

|

Sep 25, 2024 | 2:22 PM

మన దేశంలో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ ఎన్నో చూడదగిన ప్రాంతాలున్నాయి. ప్రతి ప్రాంతానికి ఓ ప్రత్యేకత ఉంటుంది. ఆయా చోట్ల ఉన్న చెరువులు, కొండలు, అడవులు, సదుపాయాలు, సౌకర్యాల ఆధారంగా అక్కడి పర్యాటకులు వెళ్తుంటారు. మనం కూడా ఎప్పుడైనా స్నేహితులు లేదా కుంటుంబ సభ్యులతో టూర్ వెళ్లాలనుకుంటే మంచి పేరు ప్రఖ్యాతులు గాంచిన టూరిస్ట్ స్పాట్ నే ఎంచుకుంటాం. అయితే కొన్ని ప్రదేశాలు మాత్రం అంత పెద్ద పేరు ఉండదు. అండర్ రేటెడ్ గా ఉంటాయి. కానీ వాటి ప్రత్యేకత వాటిదే. పెద్దగా ఎవరికీ తెలియని సుందర పర్యాటక ప్రాంతాలు.. స్నేహితులతో కలిసి వెళ్లదగిన ప్రాంతాలు ఇవి. మీరు వెళ్తే విశేష అనుభూతిని అందిస్తాయి. ఆ అండర్ రేటెడ్ టూరిస్ట్ డెస్టినేషన్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
మజులీ, అసోం.. ఇది ప్రపంచంలోనే అతి పొడవైన రివర్ ఐల్యాండ్. బ్రహ్మపుత్రా నది తీరంలో ఉంటుంది. ఇది ప్రకృతి వర ప్రసాదం. పచ్చందాలను ఇష్టపడే వారికి అమితంగా నచ్చుతుంది. ఇక్కడి పచ్చదనం, విభిన్నమైన జంతు సంపద పర్యాటకులకు అమితమైన అనుభూతిని కలిగిస్తాయి.

2 / 5
స్పిటి వ్యాలీ, హిమాచల్ ప్రదేశ్.. ఇది ఒక అందమైన ప్రాంతం. సాధారణంగా హిమాచల్ ప్రదేశ్ అనగానే అందరికీ మంచు కొండలే గుర్తొస్తాయి. ఇది అలాంటిదే. కానీ ఎందుకో పెద్ద పర్యాటక ప్రాంతంగా ఎదగలేకపోయింది. అయితే ఇక్కడి ప్రకృతి దృశ్యాలు, ప్రత్యేకమైన సంస్కృతి మీకు విశేష అనుభవాన్ని అందిస్తాయి.

3 / 5
హంపి, కర్ణాటక.. విజయనగర సామ్రాజ్యానికి ప్రతీకగా ఈ ప్రాంతం నిలుస్తుంది. నాటి వైభవానికి, కళకు నిలువెత్తు సాక్ష్యంగా ఈ ప్రాంతం ఉంటుంది. ఇక్కడ శిల్ప కళ అబ్బురపరుస్తుంది. స్నేహితులతో కలిసి వీటిని ఆస్వాదించవచ్చు.

4 / 5
తవాంగ్, అరుణాచలప్రదేశ్.. ఇది తూర్పు హిమాలయాల్లో ఉన్న ప్రాంతమిది. భూతల స్వర్గంలా ఉంటుంది. విభిన్న వాతావరణం ఉంటుంది. మంచు కొండలు, లోయలు విశేషంగా ఆకర్షిస్తాయి. స్నేహితులతో కలిసి తప్పనిసరిగా చూడదగిన ప్రాంతం ఇది.

5 / 5
గోకర్నా, కర్ణాటక.. ఇది అద్భుతమైన బీచ్ లకు పెట్టింది పేరు. ఇక్కడి వాతావరణం మనసుకు రిఫ్రెష్ మెంట్ ను ఇస్తుంది. వర్క్ స్ట్రెస్ తో ఉన్న వారికి రిలక్సేషన్ కావాలంటే ఈ బీచ్ లు బెస్ట్. మనసుకు ఆహ్లాదాన్ని అందిస్తాయి.