Life style: తలనొప్పికి ఇంకా ట్యాబ్లెట్స్ వాడుతున్నారా.? వెంటనే మానేయండి..

తలనొప్పి ప్రతీ ఒక్కరిలో సర్వసాధారణంగా వచ్చే సమస్య. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో తలనొప్పి సమస్యను ఎదుర్కొనే ఉంటారు. తలనొప్పి రావడానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. నిద్రలేకపోవడం మొదలు మరెన్నో కారణాలతో తలనొప్పి వేధిస్తుంటుంది. మనలో చాలా మంది తలనొప్పి రాగానే వెంటనే మందులు వేసుకుంటారు. అయితే ట్యాబ్లెట్‌ వేసుకుంటే వెంటనే..

Life style: తలనొప్పికి ఇంకా ట్యాబ్లెట్స్ వాడుతున్నారా.? వెంటనే మానేయండి..
Headache Relief Tips

Updated on: Mar 24, 2024 | 4:59 PM

తలనొప్పి ప్రతీ ఒక్కరిలో సర్వసాధారణంగా వచ్చే సమస్య. మనలో చాలా మంది ఏదో ఒక సమయంలో తలనొప్పి సమస్యను ఎదుర్కొనే ఉంటారు. తలనొప్పి రావడానికి ఎన్నో సమస్యలు ఉన్నాయి. నిద్రలేకపోవడం మొదలు మరెన్నో కారణాలతో తలనొప్పి వేధిస్తుంటుంది. మనలో చాలా మంది తలనొప్పి రాగానే వెంటనే మందులు వేసుకుంటారు. అయితే ట్యాబ్లెట్‌ వేసుకుంటే వెంటనే ఉపశమనం లభించినా వాటివల్ల కలిగే దుష్ప్రభావాలు కూడా అదే స్థాయిలో ఉంటాయి. అందుకే తలనొప్పిని వీలైనంత వరకు సహజ మార్గాల ద్వారానే తగ్గించుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పెయిన్ కిల్లర్స్‌కి అలవాటు పడడం ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ తలనొప్పిని తగ్గించే ఆ నేచురల్‌ టిప్స్‌ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఉదయం నిద్రలేవగానే తలనొప్పిగా ఉండే వెంటనే మనలో చాలా మంది చేసే పని టీ తాగడం. అయితే టీకి బదులు తులసి టీ తాగడం వల్ల మెరుగైన ఫలితం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం కొన్ని తులసి ఆకులను తీసుకొని నీటిలో మరిగించి తీసుకోవాలి. దీనివల్ల తలనొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

* ఇక తలనొప్పి రావడానికి డీహైడ్రేషన్‌ కూడా ఒక కారణంగా చెప్పొచ్చు. తగినంత నీరు తీసుకోకపోతే తలనొప్పి సమస్య వేధిస్తుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే కచ్చితంగా ప్రతీ రోజూ 3 నుంచి 4 లీటర్ల నీటిని తీసుకోవాలని సూచిస్తున్నారు.

* నిద్రలేమి కూడా తలనొప్పికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి కచ్చితంగా రోజు 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.

* స్మార్ట్ ఫోన్‌ వాడకం పెరగడం, గంటలతరబడి కంప్యూటర్ల ముందు కూర్చోవడం కారణం ఏదైనా వీటివల్ల కూడా ఇటీవల తలనొప్పి సమస్య చాలా మందిలో పెరిగిపోయింది. అయితే ఈ సమస్యకు చెక్‌ పెట్టాలంటే గ్యాడ్జెట్ల వినియోగాన్ని తగ్గించాలి.

* ఇక తలనొప్పిని సహజంగా చెక్‌ పెట్టేందుకు తులసి ఆకులను తీసుకోవాలని చెబుతున్నారు. రోజుకు రెండు, మూడు తులసి ఆకులను తింటే తలనొప్పి సమస్య బలదూర్‌ అవుతుందని చెబుతున్నారు.

* ఒత్తిడితో కూడుకున్న జీవితం కూడా తలనొప్పికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే ఒత్తిడిని దూరం చేసుకునేందుకు యోగా, మెడిటేషన్‌ వంటి వాటిని అలవాటుగా మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి…

Follow Us