పరగడుపునే అరటి పండును తింటున్నారా..? అయితే జాగ్రత్త !

అరటి పండ్లను మీరు పరగడుపునే తింటున్నారా..? అయితే, కొంచం జాగ్రత్తగా ఉండండి..అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అరటి పండు సంపూర్ణ ఆరోగ్య ప్రదాయినిగా అందరికీతెలిసిన విషయమే..అరటి పండు శరీరానికి తక్షణ శక్తినందిస్తుంది. అరటి పండులో పొటాషియం ఉండడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణసమస్యలు కూడా తగ్గుతాయి. ఇన్నీఆరోగ్య ప్రయోజనాలు దాగివున్న అరటి పండ్లను పరగడునా తినొచ్చా లేదా..? అలా తింటే ఏమవుతుందో ఓ సారి చూద్దాం… అరటిపండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. అవి మనకు […]

పరగడుపునే అరటి పండును తింటున్నారా..? అయితే జాగ్రత్త !
Follow us

|

Updated on: Sep 11, 2019 | 4:40 PM

అరటి పండ్లను మీరు పరగడుపునే తింటున్నారా..? అయితే, కొంచం జాగ్రత్తగా ఉండండి..అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. అరటి పండు సంపూర్ణ ఆరోగ్య ప్రదాయినిగా అందరికీతెలిసిన విషయమే..అరటి పండు శరీరానికి తక్షణ శక్తినందిస్తుంది. అరటి పండులో పొటాషియం ఉండడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. జీర్ణసమస్యలు కూడా తగ్గుతాయి. ఇన్నీఆరోగ్య ప్రయోజనాలు దాగివున్న అరటి పండ్లను పరగడునా తినొచ్చా లేదా..? అలా తింటే ఏమవుతుందో ఓ సారి చూద్దాం… అరటిపండ్లలో సహజసిద్ధమైన చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. అవి మనకు బాగా శక్తిని ఇస్తాయి. కానీ కొన్ని గంటల వ్యవధిలోనే పొందిన శక్తి క్రమక్రమంగా క్షీణించిపోతుంది.. అంతే కాకుండా మీలో ఉన్న చురుకుదనాన్నినెమ్మదించేలా చేస్తుంది. కడుపు నిండిన భావన కలిగి నిద్ర వస్తుంది. ఉదయాన్నే నిద్ర మబ్బుతో ఉండాల్సి వస్తుంది. దీంతోపాటు అరటిపండ్లు సహజసిద్ధంగానే యాసిడిక్ గుణాన్ని కలిగి ఉంటాయి. అందువల్ల వాటిని ఖాళీ కడుపుతో తింటే జీర్ణ సమస్యలు వస్తాయి. కాబట్టి అరటిపండ్లను ఖాళీ కడుపుతో తినరాదు అనేది నిపుణుల సలహా. కానీ అరటిని ఇతర ఆహార పదార్ధాలతో కలిపి తీసుకోవచ్చట. డ్రైఫూట్స్‌తో కలిపి అరటి పండ్లను తినడం వల్ల దాని ఆమ్లత్వ స్వభావం ఎఫెక్ట్‌ తక్కువగా ఉంటుందని చెబుతున్నారు. అరటి పండును ఇతర పండ్లు, లేదా.. ఆహార పదార్థాలతో జతచేసి తినటంవల్ల భోజనంలో పోషకాల స్థాయి పెరుగుతుందంటున్నారు. సో…అల్పహారంగా అరటిపండ్లను తినేటప్పుడు..మిక్స్‌ ఫ్రూట్స్‌, డ్రైఫ్రూట్స్‌తో కలిపి తినేసేయండి…రోజంతా హెల్తీ అండ్‌ ఎనర్జీటిక్‌గా గడిపేయండి.