ఎక్కువ సేపు కూర్చుని పని చేస్తున్నారా.. జర జాగ్రత్త!

మనలో చాలామంది గంటల తరబడి ఒకేచోట కూర్చునే పని చేస్తుంటారు. అలా ఒక చోటే గంటల తరబడి కూర్చుని పని చేయడం మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫిట్ నెస్ గా ఉండాలని అనుకునేవారు ఈ అలవాటుని మానుకోవాలట. ఈ అలవాటు వదిలించుకోవడం కూడా పెద్ద కష్టం ఏమి కాదండి.. వెరీ సింపుల్. కుర్చీకి అతుక్కుని కూర్చోకుండా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుని రండి. కింగ్స్ కాలేజీ లండన్ నిపుణులు ఇలా ఎక్కువసేపు కూర్చోవడం […]

ఎక్కువ సేపు కూర్చుని పని చేస్తున్నారా.. జర జాగ్రత్త!
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 06, 2019 | 9:22 PM

మనలో చాలామంది గంటల తరబడి ఒకేచోట కూర్చునే పని చేస్తుంటారు. అలా ఒక చోటే గంటల తరబడి కూర్చుని పని చేయడం మంచి అలవాటు కాదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఫిట్ నెస్ గా ఉండాలని అనుకునేవారు ఈ అలవాటుని మానుకోవాలట. ఈ అలవాటు వదిలించుకోవడం కూడా పెద్ద కష్టం ఏమి కాదండి.. వెరీ సింపుల్. కుర్చీకి అతుక్కుని కూర్చోకుండా మధ్య మధ్యలో బ్రేక్ తీసుకుని రండి.

కింగ్స్ కాలేజీ లండన్ నిపుణులు ఇలా ఎక్కువసేపు కూర్చోవడం గురుంచి ఇటీవల ఒక అధ్యయనం చేశారు. ఇలా గంటల తరబడి కూర్చోవడం వల్ల వ్యాయామాలు చేసినా, ఫిట్ నెస్ ఫ్రీక్స్ గా ఉందామన్నా మంచి ఫలితాలు కనబడవని వీరు అన్నారు. ఇందు వల్ల కూర్చునే సమయాన్ని ఎంత తగ్గించుకుంటే అంత మంచిది అని వీరి అభిప్రాయం. ఈ సమస్యను అధిగమించడానికి వారు పలు మార్గాలను అన్వేషించారు. వాటిల్లో ఒకటి సిట్- స్టాండ్ డెస్క్ లు. అందుకే ఎక్కువ సేపు కూర్చుంటున్నారని మీ తోటి ఉద్యోగస్తులను హెచ్చరించకుండా.. నడిచేలా వారిని ప్రోత్సహించమని సూచించారు.