AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weight Loss Diet: చక్కెర బదులు బెల్లం తింటున్నారా? బరువు తగ్గకపోగా పెరిగే ఛాన్స్.. నిపుణులు ఏమంటున్నారంటే!

బరువు తగ్గడం కోసం చాలా మంది తమ జీవనశైలిలో, ఆహారపు అలవాట్లలో రకరకాల మార్పులు చేసుకుంటారు. అందులో మొదటిది ఆహారం నుండి తెల్ల చక్కెరను (White Sugar) పూర్తిగా దూరం చేయడం. తీపి తినాలనే కోరికను తీర్చుకోవడానికి చక్కెర స్థానంలో బెల్లాన్ని హెల్తీ ఆప్షన్‌గా భావించి చాయ్, కాఫీ, స్వీట్లలో విరివిగా వాడుతుంటారు. బెల్లం వాడటం వల్ల బరువు ఆటోమేటిక్‌గా తగ్గిపోతుందని చాలా మంది నమ్ముతారు. కానీ ఇది నిజమేనా? ప్రముఖ క్లినికల్ న్యూట్రిషనిస్ట్ ఎడ్వినా రాజ్ ఈ విషయంపై కొన్ని ఆసక్తికరమైన నిజాలను వెల్లడించారు.

Weight Loss Diet: చక్కెర బదులు బెల్లం తింటున్నారా? బరువు తగ్గకపోగా పెరిగే ఛాన్స్.. నిపుణులు ఏమంటున్నారంటే!
Jaggery Vs Sugar For Weight
Jyothi Gadda
|

Updated on: May 24, 2026 | 9:13 PM

Share

బరువు తగ్గాలని (Weight Loss) ప్రయత్నించేవారు తరచుగా చక్కెరను పూర్తిగా మానేసి, దానికి బదులుగా ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయంగా బెల్లం (Jaggery) వాడుతుంటారు. బెల్లం చక్కెర కంటే తక్కువ ప్రాసెస్ చేయబడుతుంది. కాబట్టి, ఇందులో ఐరన్, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అయితే, పోషకాహార నిపుణుల ప్రకారం.. కేవలం చక్కెర స్థానంలో బెల్లం తిన్నంత మాత్రాన బరువు తగ్గరు, పైగా అతిగా తింటే బరువు మరింత పెరిగే అవకాశం ఉంది. బరువు తగ్గడానికి మొత్తం క్యాలరీల నియంత్రణ, మితంగా తినడం చాలా ముఖ్యం అంటున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

పోషకాలు ఎక్కువ.. కానీ క్యాలరీలు సమానం!

న్యూట్రిషనిస్ట్ ఎడ్వినా రాజ్ ప్రకారం, చక్కెరతో పోలిస్తే బెల్లాన్ని చాలా తక్కువగా ప్రాసెస్ (Refine) చేస్తారు. దీనివల్ల బెల్లంలో ఐరన్ (ఇనుము), పొటాషియం, కాల్షియం, మేగ్నీషియం వంటి అవసరమైన ఖనిజాలు మరియు పోషకాలు అలాగే నిలిచివుంటాయి. బెల్లం పీచు పదార్థాన్ని కలిగి ఉండటం వల్ల అది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలను తగ్గిస్తుంది.

అయితే బరువు తగ్గే విషయానికి వస్తే ఒక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. చక్కెర, బెల్లం రెండింటిలోనూ ఉండే క్యాలరీల పరిమాణం (Calorie Content) దాదాపు సమానంగానే ఉంటుంది. వంద గ్రాముల చక్కెరలో ఎంత క్యాలరీలు ఉంటాయో, అంతే బెల్లంలోనూ ఉంటాయి. కాబట్టి, మీరు చక్కెర మానేసి, బెల్లం కదా అని ఎక్కువ మొత్తంలో తీసుకుంటే శరీరంలో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగడంతో పాటు బరువు తగ్గడానికి బదులు వేగంగా పెరిగే ప్రమాదం ఉంది.

ఇవి కూడా చదవండి

బరువు తగ్గడానికి అసలైన సూత్రం:

వెయిట్ లాస్ జర్నీలో కేవలం పదార్థాన్ని మార్చడం మాత్రమే ముఖ్యం కాదు. మీరు రోజంతా తీసుకునే మొత్తం క్యాలరీల పరిమాణం (Total Calorie Intake) మీద నియంత్రణ ఉండాలి. బెల్లం శరీరానికి మంచిదే అయినప్పటికీ బరువు తగ్గాలనుకునే వారు రోజుకు కేవలం 1 నుండి 2 చిన్న చెంచాలు (సుమారు 5-10 గ్రాములు) మాత్రమే పరిమిత పరిమాణంలో తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us