House Rent Rules: కొత్తగా అద్దె ఇంటి కోసం వెతుకుతున్నారా? ఈ టిప్స్ మీకోసమే!

అద్దె కోసం ఇంటికి వెదికేవారు కొన్ని జాగ్రత్త వహించాలి. తద్వారా సమస్యలు తరువాత తలెత్తవు. ఈరోజు ఇంటి కోసం అద్దెను వెదికేవారు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకోండి.

House Rent Rules: కొత్తగా అద్దె ఇంటి కోసం వెతుకుతున్నారా? ఈ టిప్స్ మీకోసమే!
House Rent Rules
Follow us

|

Updated on: May 21, 2022 | 11:19 AM

House Rent Rules: విద్య, ఉద్యోగం, వ్యాపారం లేదా జీవనోపాధి కోసం స్వగ్రామం నుంచి లేదా తామున్న ప్రాంతం నుంచి కొత్త నగరానికి వెళ్లినప్పుడు.. మొదటి దృష్టి సారించేది.. ఇంటి ఏర్పాట్లు కోసం. మంచి గృహాలు అద్దెకు అందుబాటులో ఉన్నాయంటూ అన్వేషణ. అయితే అద్దె కోసం ఇంటికి వెదికేవారు కొన్ని జాగ్రత్త వహించాలి. తద్వారా సమస్యలు తరువాత తలెత్తవు. ఈరోజు ఇంటి కోసం అద్దెను వెదికేవారు తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తల గురించి తెలుసుకోండి.

ముందుగా కొత్త ఇంటిని ఎంపిక చేసుకోవడానికి.. ఇంటి విస్తీర్ణంలో సౌలభ్యం, ఆఫీసు, కళాశాల దూరం,  ఇల్లు ఉన్న నివాస ప్రాంతం, చుట్టుపక్కల ప్రాంతంలో ఉన్న సౌకర్యాలు, ఇంటి అంతర్గత నిర్మాణం, ఏర్పాట్లపై శ్రద్ధ వహించండి. ఇల్లు,  వెంటిలేటెడ్ కిటికీలు, బాల్కనీ లేదా టెర్రేస్, ఇంటి లోపల తాగునీరు వంటి సదుపాయాలతో పాటు.. అదే ఇల్లు పార్ట్మెంట్ వంటి వాటిల్లో అద్దెకు ఇల్లును వెదుకుతుంటే.. శుభ్రమైన, సురక్షితమైన మెట్లు ఉండేలా చూసుకోండి.

అద్దె డిక్లరేషన్ నిబంధనలు: అద్దె తీసుకునే ముందు నిబంధనలు తప్పనిసరిగా చదవండి. ఇందులో అద్దె ఎంత సమయం తర్వాత పెంచుతారు, నివాస కాలం ఎంత అన్ని రాసి ఉంటాయి. సెక్యూరిటీ మొత్తానికి సంబంధించిన నియమాలు ఒప్పందంలో వ్రాయబడేలా చర్యలు తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

హక్కుల గురించి తెలుసుకోండి: అద్దెకు ఇచ్చేవారు మీ వ్యక్తిగత జీవితంలో జోక్యం చేసుకోరు. మీ కుటుంబ సభ్యుల రాకతో అద్దెలో పెరుగుదల ఉండదు. మీరు అద్దె ఇంటి నుంచి వెళ్లే సమయంలో ఇంటి యజమానికి ఆ విషయాన్ని  ముందుగానే తెలియజేయండి. ఇంటి గేట్ కు ఒక తాళం ఏర్పటు చేస్తే.. దానికి సంబంధించిన ఒక కీ వంటి నిబంధనలు,  షరతులను ఇంటి యజమానితో చర్చించండి. ఇంట్లోకి దిగిన అనంతరం యజమానిని ఈ విషయాల గురించి ప్రశ్నించడం సరికాదు.

మీటర్‌ తనిఖీ: మీరు ఇంటిలో అద్దెకు దిగే సమయంలో ఆ ఇంటి ఇద్దెలో విద్యుత్ ఛార్జీలు చేర్చకపోతే.. ఇంటిలో అడుగు పెట్టె ముందు.. విద్యుత్  మీటర్ రీడింగ్‌ను నమోదు చేసుకోండి. తద్వారా విద్యుత్ చెల్లింపు చేసే విషయంలో ఎటువంటి గొడవ ఉండదు. కొన్నిసార్లు భూస్వాముల నుంచి కౌలుదారు పొలాన్ని కౌలుకి తీసుకునే ముందు నీటి మోటార్లను తీసుకుంటారు. అలాంటి సమయంలో విద్యుత్ మీటర్‌ గురించి స్పష్టంగా మాట్లాడండి.

అద్దె ఇంట్లో ఇతర సౌకర్యలు: ప్రస్తుతం.. ఎక్కువమంది అన్ని సౌకర్యలున్న ఇంటిని అద్దెకు తీసుకోవాలని భావిస్తున్నారు. అటువంటి వినియోగదారులు ముందుగా ఇంటిలో ఉన్న ఫర్నిచర్, ఫ్యాన్స్ వంటి వాటిని చెక్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే.. మీరు ఇంటికి ఖాళీ చేసే సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఇటువంటి తనిఖీలు తప్పనిసరి. లేదంటే.. ఇంటిని ఖాళీ చేస్తున్నప్పుడు ఫర్నిచర్ పగిలింది వంటి విషయాల్లో అభ్యతరం చెప్పవచ్చు. అంతేకాదు కొన్ని సార్లు డ్యామేజీ కింద మీరు ముందుగా ఇచ్చిన సెక్యూరిటీ మొత్తం నుండి డబ్బును తీసివేసికుంటారు. కనుక ముందుజాగ్రత్తగా, ఫర్నిచర్, కిటికీలు, తలుపులు, వంటగది ఫోటోలు తీసి.. వాటిని ఇంటి యజమానితో పంచుకోండి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..