ముఖం మీద నల్లమచ్చలను మాయం చేసే చిట్కాలు

వయస్సు పెరిగే కొద్ది చర్మ సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా ముఖం మీద ముడతలు, మచ్చలు అందాన్ని తగ్గిస్తాయి. దీంతో చాలామంది అద్దం ముందు నుంచొని ఆవేదనకు గురవ్వుతారు. ఈ మచ్చలు ఏర్పడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ నాలుగు చిట్కాలతో తక్కువ సమయంలో ఈ నల్ల మచ్చలను తగ్గి౦చవచ్చు. కలబంద మధ్యలో జెల్‌లా ఉండే తాజా జిగును ముఖానికి రాసుకుని మర్దన చేసి కాసేపు ఆరనివ్వండి. ఇలా రోజూ చేస్తే ముఖం కాంతివంతంగా మారడమే కాకుండా ముఖం […]

ముఖం మీద నల్లమచ్చలను మాయం చేసే చిట్కాలు
TV9 Telugu Digital Desk

| Edited By: Srinu Perla

Mar 06, 2019 | 7:39 PM

వయస్సు పెరిగే కొద్ది చర్మ సమస్యలు పెరుగుతాయి. ముఖ్యంగా ముఖం మీద ముడతలు, మచ్చలు అందాన్ని తగ్గిస్తాయి. దీంతో చాలామంది అద్దం ముందు నుంచొని ఆవేదనకు గురవ్వుతారు. ఈ మచ్చలు ఏర్పడటానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ఈ నాలుగు చిట్కాలతో తక్కువ సమయంలో ఈ నల్ల మచ్చలను తగ్గి౦చవచ్చు.

కలబంద మధ్యలో జెల్‌లా ఉండే తాజా జిగును ముఖానికి రాసుకుని మర్దన చేసి కాసేపు ఆరనివ్వండి. ఇలా రోజూ చేస్తే ముఖం కాంతివంతంగా మారడమే కాకుండా ముఖం మీద మచ్చలు కూడా మాయమవుతాయి.

గుడ్డులోని పసుపు పచ్చ సొనను తీసేసి కేవలం తెలుపును మాత్రమే ముఖానికి రాయండి. ఆరిన తర్వాత చల్లని నీటితో కడిగేయండి. వారంలో మూడు సార్లు ఇలా చేస్తే నల్ల మచ్చలనేవే కనిపించవు.

టమోటా ముఖాన్ని కాంతివంతంగా ఉంచుతుంది. అలాగే, ముఖంపై ముండే నల్ల మచ్చలను మాయం చేస్తుంది. వారంలో కనీసం రెండు సార్లు టమోటాతో మర్దన చేసుకుంటే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

నిమ్మకాయలో విటమిన్-సి ఉంటుంది. ఇది చర్మం మీద ఉండే నల్ల మచ్చలను సులభంగా తొలగిస్తుంది. ఎక్కడైతే నల్ల మచ్చలు ఉంటాయో అక్కడ నిమ్మకాయ రసం లేదా నిమ్మ బద్దలతో మర్దన చేయాలి. రోజూ ఇలా చేస్తే త్వరలోనే ఫలితం కనిపిస్తుంది.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu