Relationship tips: మీ భాగస్వామికి మెసేజ్‌లు పంపేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు.. లేదంటే అంతే సంగతులు..

Relationship tips: ప్రేమను సజీవంగా ఉంచుకోవాలంటే భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం చాలా ముఖ్యం. కానీ నేటి బిజీ లైఫ్ స్టైల్..

Relationship tips: మీ భాగస్వామికి మెసేజ్‌లు పంపేటప్పుడు ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు.. లేదంటే అంతే సంగతులు..
Couple
Follow us

|

Updated on: Sep 16, 2022 | 6:57 AM

Relationship tips: ప్రేమను సజీవంగా ఉంచుకోవాలంటే భాగస్వామితో ఎక్కువ సమయం గడపడం చాలా ముఖ్యం. కానీ నేటి బిజీ లైఫ్ స్టైల్, పని ఒత్తిడి కారణంగా దంపతులు ఎక్కువ టైమ్ కలిసి ఉండలేకపోతున్నారు. అలాంటప్పుడు ఇద్దరూ దగ్గర లేని సమయంలో, ఆఫీసు వేళల్లో ఫోన్ చేయడం కుదరదు. చాటింగ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇలా అయినా ఇద్దరూ టచ్‌లో ఉండొచ్చు. తమ తమ అభిప్రాయాలను షేర్ చేసుకోవచ్చు. అయితే, మాట్లాడుకోవడం వేరు, చాటింగ్ వేరు. చాటింగ్ చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కొన్ని పొరపాట్ల కారణంగా ఆ సంబంధం విడిపోయే ఛాన్స్ ఉంది. అందుకే టెక్ట్స్ చేసేటప్పుడు కొన్ని తప్పులను నివారించాల్సిన అవసరం ఉంటుంది. మరి చేయకూడని ఆ తప్పులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

మీ భాగస్వామికి మెసేజ్‌లు పంపేటప్పుడు ఈ తప్పులు చేయకండి..

నిరంతరం మెసేజ్‌లు పంపొద్దు: కొంతమందికి తమ ప్రేమ, ఆందోళనను తెలియజేయడానికి తమ ప్రియమైన భాగస్వామికి నిరంతరం మెసేజ్‌లు పంపే అలవాటు ఉంటుంది. చాలా సార్లు వారు వేరే పనిలో నిమగ్నమై ఉంటారు. మీరు పంపే ఆ మెసేజ్‌ల వల్ల వారు డిస్ట్రబ్ అవుతుంటారు. మెసేజ్ పంపే ముందు అవతలి వ్యక్తికి కూడా కొంత స్వేచ్ఛ ఉంటుందనేది గుర్తించుకోవాలి. లేదంటే.. మీ బంధానికి బీటలువారే ప్రమాదం ఉంది.

పెద్ద పెద్ద మెసేజ్‌లు వద్దు: చాలా మంది తమ భాగస్వామి స్వభావాన్ని అర్థం చేసుకోరు. కొందరు తమ భాగస్వామికి వివరణాత్మకంగా పెద్ద పెద్ద టెక్ట్స్ చేస్తుంటారు. ఎక్కువ విషయాలు చెప్పాలనుకుంటే.. సరైన సమయం కోసం వేచి ఉండాలి. అంతే తప్ప.. ఇలా చాంతాడంత మెసేజ్‌లు పంపితే.. వారు చిరాకు పడే ఛాన్స్ ఉంది.

ఒకే ప్రశ్నను పదే పదే అడగవద్దు: కొందరు తమ భాగస్వామిని ఒకే ప్రశ్నను పదే పదే అడుగుతుంటారు. అది వారికి ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అవతలివైపు నుంచి ఆలస్యంగా రిప్లై వస్తే.. ఇతర ప్రశ్నలు అడిగి వారిపై ఆగ్రహం వ్యక్తం చేయొద్దు.

మరిన్ని లైఫ్‌స్టైల్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..