వేసవిలో చర్మ సంరక్షణ… ఎలాగంటే?
వేసవిలో చర్మ సంరక్షణకు ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అందాన్ని ఆరోగ్యాన్నిపదిలంగా కాపాడుకోవచ్చు. ఎలాగంటే దోసకాయ చెక్కుతీసి బాగా తురిమి రసాన్ని తీయాలి. ఈ రసంలో అరటీస్పూన్ గ్లిజరిన్, అరటీస్పూన్ రోజ్‌వాటర్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ఎండకు కమిలిన ప్రదేశంలో రాసి ఆరేంతవరకు ఉంచి శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజూ చేస్తే కమిలిన భాగం మామూలుగా అయిపోతుంది. పెట్రోలియం జెల్లీలో కొద్దిగా గ్లిజరిన్… రెండు టీ స్పూన్ల నిమ్మరసాన్ని కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వారానికి […]
వేసవిలో చర్మ సంరక్షణకు ఇంట్లోనే కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే అందాన్ని ఆరోగ్యాన్నిపదిలంగా కాపాడుకోవచ్చు. ఎలాగంటే
- దోసకాయ చెక్కుతీసి బాగా తురిమి రసాన్ని తీయాలి. ఈ రసంలో అరటీస్పూన్ గ్లిజరిన్, అరటీస్పూన్ రోజ్‌వాటర్‌ను కలపాలి. ఈ మిశ్రమాన్ని ఎండకు కమిలిన ప్రదేశంలో రాసి ఆరేంతవరకు ఉంచి శుభ్రపరుచుకోవాలి. ఇలా రోజూ చేస్తే కమిలిన భాగం మామూలుగా అయిపోతుంది.
- పెట్రోలియం జెల్లీలో కొద్దిగా గ్లిజరిన్… రెండు టీ స్పూన్ల నిమ్మరసాన్ని కలిపి మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు పొడిబారిన చర్మానికి, చేతులకి, కాళ్లకి రాస్తే శరీరం మృదువుగా మారుతుంది.
- కొబ్బరి నూనెలో రోజ్‌మేరీ, లావెండర్ సుగంధ తైలాలను కలిపి మసాజ్ చేసినట్టయితే శరీరం నునుపుగా తయారవుతుంది. మసాజ్ వల్ల రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది.
- పాదాలు పగిలినట్లయితే పారాఫిన్ వాక్స్‌ను కరిగించి, అందులో కొద్దిగా ఆవాల నూనెను కలిపి పగుళ్లు ఉన్న చోట రాస్తే పాదాలు మృదువుగా అవుతాయి. ఈ మిశ్రమం అందుబాటులో లేకుంటే గ్లిజరిన్, నిమ్మరసం సమపాళ్లలో కలిపి కాలి పగుళ్లకు రాస్తే నునుపుగా అవుతాయి.
- చేతులు, పాదాలపై ఉండే గరుకుదనం, నలుపు, జిడ్డు మురికి పోవాలంటే నిమ్మ చెక్కతో రుద్దాలి. రోజుకు ఒకసారైనా సబ్బుతో ముఖం కడగాలి. కడిగిన తర్వాత ఐస్‌క్యూబ్‌తో ముఖమంతా మసాజ్ చేసినట్లు రుద్దాలి. రోజుకు కనీసం మూడు సార్లు చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి.