బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్… ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్.. ఆ ఏటీఎంలలో డబ్బులు తీసుకోలేం

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఖాతా ఉన్నవారి కోసం ఓ ముఖ్యమైన అప్‌డేట్ తీసుకొచ్చాం. ఈ బ్యాంక్ ఏటీఎం క్యాష్ విత్‌డ్రా నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచి మారబోతున్నాయి.

 • Ram Naramaneni
 • Publish Date - 5:01 pm, Sun, 31 January 21
బ్యాంక్ ఖాతాదారులకు అలర్ట్... ఫిబ్రవరి 1 నుంచి కొత్త రూల్.. ఆ ఏటీఎంలలో డబ్బులు తీసుకోలేం

పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో ఖాతా ఉన్నవారి కోసం ఓ ముఖ్యమైన అప్‌డేట్ తీసుకొచ్చాం. ఈ బ్యాంక్ ఏటీఎం క్యాష్ విత్‌డ్రా నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచి మారబోతున్నాయి. ఏటీఎం మోసాలను కట్టడి చేయాలనే లక్ష్యంతో పంజాబ్ నేషనల్ బ్యాంక్ ఈ నిర్ణయం తీసుకుంది. పీఎన్‌బీ ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. నాన్ ఈఎంవీ ఏటీఎం మెషీన్ల నుంచి డబ్బులు తీసుకోవడం ఫిబ్రవరి 1 వ తేదీ నుంచి కుదరదని స్పష్టం చేసింది.

“మా గౌరవనీయ కస్టమర్లను మోసపూరిత ఏటిఎం కార్యకలాపాల నుంచి రక్షించడానికి, పీఎన్‌బీ  2021 ఫిబ్రవరి 1 నుండి నాన్-ఈఎంవీ ఏటీఎం యంత్రాల నుంచి లావాదేవీలను (ఆర్థిక, ఆర్థికేతర) నియంత్రిస్తుంది. గో డిజిటల్, సురక్షితంగా ఉండండి!” అని  బ్యాంక్ ట్వీట్ చేసింది.నాన్ ఈఎంవీ ఏటీఎం మెషీన్లు మాగ్నెటిక్ స్ట్రిప్స్ ద్వారా డేటాను రీడ్ చేస్తాయి. ట్రాన్సాక్షన్లు చేసే సమయంలో ఏటీఎం కార్డును కలిగి ఉండవు. 2020 డిసెంబర్‌లో బ్యాంక్ ఏటీఎంల నుంచి నగదు ఉపసంహరించుకునే నిబంధనలను పంజాబ్ నేషనల్ బ్యాంక్ మార్చింది. పీఎన్‌బీ ఖాతాదారులకు రాత్రి 8 నుంచి ఉదయం 8 గంటల మధ్య ఏటిఎంల నుంచి రూ. 10,000 అంతకంటే ఎక్కువ నగదు ఉపసంహరణకు వన్ టైమ్ పాస్‌వర్డ్ (ఓటీపీ) సిస్టమ్ పెట్టిది. ఓటీపీ లేకుండా, పీఎన్‌బీ ఖాతాదారులకు నగదు ఉపసంహరణ సాధ్యం కాదు.

ఓటీపీ- ఆధారిత వ్యవస్థ ద్వారా పీఎన్‌బీ ఏటీఎంలలో నగదును ఎలా విత్ డ్రా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం…

 1. పీఎన్‌బీ ఏటీఎం వద్ద నగదు ఉపసంహరించుకోవటానికి, మీకు ఓటిపి అవసరం
 2. OTP మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది.
 3. ఓటీపీ అనేది ఒకే లావాదేవీ కోసం వినియోగదారుడికి పంపబడుతుంది.
 4. తొలుత పీఎన్‌బీ ఏటిఎమ్‌కు వెళ్లండి.
 5. మీ డెబిట్ / ఏటీఎం కార్డును చొప్పించండి.
 6. అవసరమైన వివరాలను నమోదు చేయండి.
 7. మీరు ఒకేసారి  10,000 కంటే ఎక్కువ నగదు తీసుకోవాలంటే, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌‌కు ఓటీపీ వస్తుంది.
 8.  మీ మొబైల్ నంబర్‌లో వచ్చిన ఓటీపీని ఏటీఏంలో ఎంటర్ చేయండి.
 9. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు నగదు లభిస్తుంది.

Also Read:

e-Challan: ఇదే చిత్రం గురూ..! హెల్మెట్‌ పెట్టుకోలేదని ట్రాక్టర్ డ్రైవర్‌కు ఫైన్.. దీంతో అతడు ఏం చేశాడంటే..?

SBI Online Banking: ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఏటీఎం లేకుండా క్యాష్‌ విత్‌ డ్రా.. ఇవిగో వివరాలు