మూత్ర విసర్జన అనేది సాధారణ ప్రక్రియ. మల, మూత్ర విసర్జనల ద్వారానే శరీరంలో ఉండే మలినాలు, వ్యర్థ పదార్థాలు అనేవి బయటకు పోతాయి. చాలా మంది మూత్రాన్ని ఆపుకుంటూ ఉంటారు. దీని వలన అనేక ఆరోగ్య సమస్యలు రావడం ఖాయం. మూత్రాన్ని ఎక్కువ సమయం ఆపివేయడం మంచిది కాదని ఆరోగ్య నిపుణులు కూడా సూచిస్తున్నారు. సాధారణంగా మగవారు మూత్రాన్ని నిలబడి విసర్జన చేస్తూ ఉంటారు. కానీ ఇది చాలా తప్పని వైద్య నిపుణులు చెబుతున్నారు. మగవారు కూడా కూర్చొని మూత్ర విసర్జన చేసుకుంటేనే మంచిదట. అప్పట్లో కూడా చాలా మంది కూర్చోనే మూత్ర విసర్జన చేసేవారు. గ్రామాల్లో చాలా మంది పురుషులు ఇప్పటికీ కూర్చోనే విసర్జన చేస్తున్నారు. ఇలా కూర్చొని మూత్ర విసర్జన చేయడం వల్ల ఆరోగ్యానికి కూడా మంచిదట. అనేక ప్రయోజనాలు కూడా ఉన్నాయట.
పురుషులు నిలబడి మూత్ర విసర్జన చేయడం కంటే కూర్చొని మూత్ర విసర్జన చేయడం వల్ల ప్రోస్టేట్ సమస్య అనేది ఉండదు. చాలా మంది పురుగులు ఈ సమస్యతోనే బాధ పడుతున్నారు. ఇలాంటి వారు ఇకపై కూర్చొని మూత్ర విసర్జన చేయడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
పురుషులు కూర్చొని మూత్ర విసర్జన చేయడం వల్ల బ్లాడర్ మొత్తం ఖాళీ అవుతుంది. నిలబడి చేస్తే.. బ్లాడర్ మొత్తం ఖాళీ అవ్వదు. బ్లాడర్ మొత్తం ఖాళీ అవ్వడం వల్ల వైరస్, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వంటివి వచ్చే సమస్య చాలా వరకు తగ్గుతుంది. అంతే కాకుండా పెల్విక్ ఫ్లోర్ కండారాలు కూడా ఫ్రీగా ఉంటాయి. ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు.
చాలా మంది మగవారు ఈ మధ్య ఎక్కువగా బాత్రూమ్‌కి వెళ్లేముందు ఫోన్లను కూడా ఎక్కువగా ఉపయోగిస్తున్నారని పలు పరిశోధనల్లో తేలింది. ఇలా వాష్ రూమ్‌లో కూర్చొని ఫోన్ చూడటం వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయి. కాబట్టి ఇది అస్సలు మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..