Lifestyle: పొట్ట పెరుగుతోందా.? అయితే మీరు ఈ వ్యాధులకు వెల్‌కమ్‌ చెబుతున్నట్లే

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఊబకాయం ఒకటి. రోజురోజుకీ ఈ సమస్య బారినపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోవడం, గంటల తరబడి కూర్చొని పనులు చేయడం వంటి కారణాల వల్ల ఊబకాయంతో బాధపడుతున్నారు. తాజా గణంకాల ప్రకారం ఊబకాయం కారణంగా ప్రతీ ఏటా సుమారు..

Lifestyle: పొట్ట పెరుగుతోందా.? అయితే మీరు ఈ వ్యాధులకు వెల్‌కమ్‌ చెబుతున్నట్లే
Obesity
Follow us

|

Updated on: Sep 27, 2024 | 9:53 AM

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో ఊబకాయం ఒకటి. రోజురోజుకీ ఈ సమస్య బారినపడుతోన్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శారీరక శ్రమ పూర్తిగా తగ్గిపోవడం, గంటల తరబడి కూర్చొని పనులు చేయడం వంటి కారణాల వల్ల ఊబకాయంతో బాధపడుతున్నారు. తాజా గణంకాల ప్రకారం ఊబకాయం కారణంగా ప్రతీ ఏటా సుమారు 2.8 మిలియన్ల మంది మరణిస్తున్నారు. భారత్‌లో సుమారు 26 మిలియన్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారు. ముఖ్యంగా పొట్ట సమస్యతో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అయితే ఊబకాయం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఊబకాయం దారి తీసే ఆ ఆరోగ్య సమస్యలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* ఊబకాయం కారణంగా వచ్చే ప్రధాన ఆరోగ్య సమస్యల్లో మధుమేహం ఒకటి. భారత్‌లో ప్రస్తుతం దాదాపు 101 మిలియన్లకుపైగా ప్రజలు మధుమేహంతో బాధపడుతున్నారు. 27% మంది భారతీయ పురుషులు పొట్ట సమస్యతో బాధపడుతున్నారు. ఇలాంటి వారిలో డయాబెటిస్‌ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. రక్తంలో చక్కెర లెవల్స్‌ పెరుగుతాయి.

* ఊబకాయం గుండెపోటుకు కూడా దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. 40 కంటే ఎక్కువ BMI ఉన్న పురుషులు గుండెపోటు, స్ట్రోక్ వంటి సమస్యల బారిన పడే అవకాశాలు మూడు రెట్లు ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా నడుము చుట్టూ కొవ్వు పెరిగే వారిలో ధమనుల్లో అడ్డంకులు ఏర్పడే అవకాశం ఉంటుంది. దీంతో ఇది గుండె జబ్బులకు దారి తీస్తుంది.

* అధిక బరువుతో బాధపడేవారిలో 34.1 శాతం మందికి అధిక రక్తపోటు ఉందని గణంకాలు చెబుతున్నారు. పొట్ట ఉన్న వారి హృదయనాళ వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతంది. ఇది రక్తపోటుకు దారి తీస్తుందని నిపుణులు అంటున్నారు.

* అధిక బరువు కారణంగా ఆస్టియో ఆర్థరైటిస్ సమస్య బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇది అత్యంత సాధారణ కీళ్ల రుగ్మత.. మోకాళ్లు, వీపు, మెడ వంటి భాగాలపై ప్రభావం పడుతుంది. కేవలం 10 పౌండ్ల అదనపు బరువు మీ మోకాళ్లపై ప్రతి అడుగుతో 30-60 పౌండ్ల అదనపు శక్తి పడుతుంది. అధిక బరువు ఉన్న వారిలో మోకాళ్ల నొప్పులు రావడానికి ప్రధాన కారణం ఇదే.

* అధిక బరువుతో బాధపడేవారిలో పక్షవాతం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య వచ్చే అవకాశాలు అధికంగా ఉంటాయి. 14 ఏళ్ల వయసులో అధిక బరువు గల మహిళలకు 55 ఏళ్లలోపు పక్షవాతం వచ్చే అవకాశం పెరుగుతున్నట్టు ఓ అధ్యయనంలో తేలింది.

నోట్: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..