Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాత్రి ఆలస్యంగా నిద్రపోయే అలవాటుందా..? వామ్మో.. ఎంత డేంజరో తెలుసా..

ఈ రోజుల్లో చాలా మందికి రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం అలవాటుగా మారుతుంది.. ముఖ్యంగా చదువుకునే పిల్లలు, ఉద్యోగ యువత జీవనశైలి ఇలాగే మారిపోతుంది.. కానీ నిపుణుల అభిప్రాయం ప్రకారం, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం అనేది.. ఆరోగ్యానికి మంచిది కాదు. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఒక వ్యక్తికి అనేక తీవ్రమైన సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

రాత్రి ఆలస్యంగా నిద్రపోయే అలవాటుందా..? వామ్మో.. ఎంత డేంజరో తెలుసా..
Sleep
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Feb 04, 2025 | 3:03 PM

ఉరుకులు పరుగుల జీవితంలో ఎన్నో అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి.. ముఖ్యంగా పేలవమైన జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారం ఇవన్నీ పలు సమస్యల బారిన పడేలా చేస్తుంది.. అయితే, ఈ రోజుల్లో ప్రజల జీవనశైలి రాత్రి ఆలస్యంగా నిద్రపోయేలా మారింది. ఇది సాధారణంగా పని చేసే యువతలో కనిపిస్తుంది. చాలా మంది పనిచేయడం వల్ల రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోతారు. చాలా సార్లు ప్రజలు దీనిని ఒక సాధారణ విషయంగా తీసుకుంటారు. కానీ, రాత్రిపూట ఎక్కువసేపు ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి..

రాత్రి వేళ ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఒక వ్యక్తి ఎలాంటి మానసిక, శారీరక సమస్యలను ఎదుర్కొంటారు… ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయి..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు.. ఈ వివరాలను తెలుసుకోండి..

ఆరోగ్య నిపుణుల ప్రకారం.. రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల అధిక రక్తపోటు, గుండె సమస్యలు వచ్చే ప్రమాదం పెరుగుతుంది. దీనితో పాటు, రోగనిరోధక శక్తి సమస్య కూడా పెరుగుతుంది. దీని కారణంగా, మీరు అనేక రకాల ఇన్ఫెక్షన్లను కూడా పొందే అవకాశం ఉంది. దీనితో పాటు, రాత్రి ఆలస్యంగా నిద్రపోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యత కూడా ఏర్పడుతుంది.. మధుమేహం, జీర్ణ సంబంధిత సమస్యలు వస్తాయి.

నిద్ర లేకపోవడం వల్ల మానసిక ఆరోగ్యం కూడా ప్రభావితం అవుతుంది. ఇది మీ జ్ఞాపకశక్తిని, ఏకాగ్రతను తగ్గిస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట ఆలస్యంగా నిద్రపోవడం వల్ల కూడా డిప్రెషన్, ఆందోళన వంటి సమస్యలు వస్తాయని చెబుతున్నారు. దీనితో పాటు, చిరాకు, కోపం కూడా పెరుగుతుంది. అదే సమయంలో, కళ్ళ కింద నల్లటి వలయాలు, మొహంపై ముడతలు కూడా కనిపిస్తాయి.

ఒక వ్యక్తి ఒక రోజులో ఎంత సేపు నిద్రపోవాలి?

ఒక వ్యక్తికి ఒక రోజులో ఎంత నిద్ర అవసరం అనే ప్రశ్నకు.. అది వ్యక్తి వయస్సుపై ఆధారపడి ఉంటుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. మనం అప్పుడే పుట్టిన శిశువు గురించి మాట్లాడుకుంటే.. వారు 14 నుంచి 16 గంటలు నిద్రపోవాలి..

అదే సమయంలో, పాఠశాలకు వెళ్లే పిల్లలు 9 నుంచి 13 గంటలు నిద్రపోవాలి.

యుక్తవయస్సులోకి అడుగుపెట్టినప్పుడు 9 నుంచి 10 గంటలు నిద్రపోవాలి.

యువత, మధ్య వయస్కులు రోజుకు 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి.

అదేవిధంగా, వృద్ధులు కూడా 7 నుంచి 9 గంటలు నిద్రపోవాలి.

ఎప్పుడు నిద్రపోవాలి..

ఏ వ్యక్తి అయినా రాత్రి 10 గంటలకే నిద్రపోవాలి.. ఎందుకంటే మన నిద్ర చక్రం సూర్యోదయం – సూర్యాస్తమయంపై ఆధారపడి ఉంటుంది. సూర్యుడు అస్తమించగానే.. మన శరీరంలో మెలిటాన్యులర్ హార్మోన్ విడుదల కావడం ప్రారంభమవుతుంది.. ఇది మనకు నిద్ర పట్టడానికి సహాయపడుతుంది.. ఉదయం వచ్చే సమయానికి దాని ప్రభావం ముగుస్తుంది. మన శరీరంలో రాత్రి నాలుగు గంటలకు గరిష్టంగా మెలటోనియం విడుదల అవుతుంది. ఈ సమయంలో మనం బాగా నిద్రపోతాము.. కాబట్టి ఇది మనం నిద్రించడానికి అనువైన సమయం.. వయస్సుకి నిద్రతో సంబంధం లేదని.. కానీ వయస్సు పెరిగే కొద్దీ నిద్రపోవడంలో సమస్య వస్తుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది… ప్రయత్నించేముందు సంబంధిత నిపుణుల సలహాలను పాటించవలసిందిగా మనవి. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)

మరిన్ని జీవనశైలి వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

మీ సిమ్‌ కార్డును యాక్టివ్‌ ఉంచుకోవాలా..? అపరిమిత కాలింగ్‌తో పాటు
మీ సిమ్‌ కార్డును యాక్టివ్‌ ఉంచుకోవాలా..? అపరిమిత కాలింగ్‌తో పాటు
మాజీ మంత్రి రోజాఎత్తుకొని ఆడించిన పాన్ఇండియా స్టార్ హీరో ఎవరంటే?
మాజీ మంత్రి రోజాఎత్తుకొని ఆడించిన పాన్ఇండియా స్టార్ హీరో ఎవరంటే?
42 లక్షల మందికి.. భారత్‌ సహా 27 దేశాల్లో.. బోర్డు పరీక్షలు షురూ!
42 లక్షల మందికి.. భారత్‌ సహా 27 దేశాల్లో.. బోర్డు పరీక్షలు షురూ!
ఫస్ట్ సినిమా హీరోతో ప్రేమ, పెళ్లి.. కట్ చేస్తే..
ఫస్ట్ సినిమా హీరోతో ప్రేమ, పెళ్లి.. కట్ చేస్తే..
ఏంటీ.. ఈ పాటలను సాయి పల్లవి కొరియోగ్రాఫ్ చేసిందా..!!
ఏంటీ.. ఈ పాటలను సాయి పల్లవి కొరియోగ్రాఫ్ చేసిందా..!!
స్కూటర్ మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. స్టోరేజీ కూడా ముఖ్యమే..!
స్కూటర్ మార్కెట్‌కు ఎలక్ట్రిక్ కిక్.. స్టోరేజీ కూడా ముఖ్యమే..!
మొటిమలు, మచ్చలు లేని మెరిసే చర్మం కోసం ఈ ఆయిల్‌ ది బెస్ట్‌..!
మొటిమలు, మచ్చలు లేని మెరిసే చర్మం కోసం ఈ ఆయిల్‌ ది బెస్ట్‌..!
ఇద్దరు యువకుల దారుణహత్య..!
ఇద్దరు యువకుల దారుణహత్య..!
పక్కా నిఘా నీడలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు.. 8 వేలకుపైగా CC కెమెరాలు
పక్కా నిఘా నీడలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలు.. 8 వేలకుపైగా CC కెమెరాలు
గోల్డ్‌ స్మగ్లింగ్‌తో కస్టమ్స్‌ అధికారులకే ఝలక్‌.. శరీరంలో బంగారం
గోల్డ్‌ స్మగ్లింగ్‌తో కస్టమ్స్‌ అధికారులకే ఝలక్‌.. శరీరంలో బంగారం