Tears: ఏడుస్తే కన్నీళ్లు ఎందుకు వస్తాయో తెలుసా..? కన్నీటికి కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు..

కన్నీళ్లు బయటకు ప్రవాహంలా వస్తుంటాయి. ఇలా ప్రతి చిన్న విషయానికి కన్నీళ్లు రావడం వెనక పెద్ద కారణమే ఉందండోయ్.

Tears: ఏడుస్తే కన్నీళ్లు ఎందుకు వస్తాయో తెలుసా..? కన్నీటికి కారణం తెలిస్తే నోరెళ్లబెడతారు..
Tears
Follow us

|

Updated on: Sep 15, 2022 | 12:32 PM

సాధారణంగా మనసు బాధపడినప్పుడు.. ఓ వ్యక్తి విచారంగా ఉన్న సమయంలో ఏడవడం ప్రారంభిస్తాడు. దీంతో కన్నీళ్లు వెంటనే వచ్చేస్తుంటాయి. అలాగే సంతోషంగా ఎక్కువైనప్పుడు.. పెద్దగా నవ్వినప్పుడు కూడా కన్నీళ్లు వస్తుంటాయి. కానీ ఒకటి గమనించారా ? ఏడుస్తున్నప్పుడు.. నవ్వుతున్నప్పుడు అసలు కళ్లలో నుంచి నీళ్లు ఎందుకు వస్తాయి ?. ఏడవాలి అని ఎవరు అనుకోరు. కానీ బాధ, సంతోషం, ప్రేమ, విపరీతమైన ఆనందం.. భరించలేనంత దుఃఖం కలిగినప్పుడు మనకు తెలియకుండానే కన్నీళ్లు వచ్చేస్తుంటాయి. కొన్నిసార్లు సినిమాల్లో భావోద్వేగ సన్నివేశాలు చూసినప్పుడు.. ఎక్కువగా నవ్వినప్పుడు కూడా తొందరగా కన్నీళ్లు వస్తాయి. ఇక ప్రయాణాలు చేస్తున్నప్పుడు ముఖానికి ఎక్కువగా గాలి తగిలితే.. కళ్లలోకి నీళ్లు వెళ్లినప్పుడు.. ఏదైనా చిన్న కీటకం కళ్లలలో పడినప్పుడు కన్నీళ్లు బయటకు ప్రవాహంలా వస్తుంటాయి. ఇలా ప్రతి చిన్న విషయానికి కన్నీళ్లు రావడం వెనక పెద్ద కారణమే ఉందండోయ్.

కన్నీళ్లు మన మానసిక స్థితికి సంబంధించినవి. శాస్త్రవేత్తలు కన్నీళ్లను ప్రధానంగా మూడు వర్గాలుగా విభజించారు. మొదటి వర్గం బేసల్. ఇవి నాన్-ఎమోషనల్ కన్నీళ్లు. ఇవి కళ్ళు ఎండిపోకుండా ఆరోగ్యంగా ఉంచుతాయి. రెండవ వర్గంలో భావోద్వేగాలు లేని కన్నీళ్లు కూడా ఉన్నాయి. ఈ కన్నీళ్లు ఉల్లిపాయను కత్తిరించడం లేదా ఫినైల్ వంటి బలమైన వాసన పీల్చడం వల్ల వచ్చే కన్నీళ్లు. ఇక మూడవ వర్గం క్రయింగ్ టియర్స్ అంటారు. ఏడుపు కన్నీళ్లు భావోద్వేగ ప్రతిస్పందనగా వస్తాయి. నిజానికి మానవ మెదడులో ఒక లింబిక్ వ్యవస్థ ఉంటుంది. దీనిలో మెదడు హైపోథాలమస్ ఉంటుంది. ఈ భాగం నాడీ వ్యవస్థతో ప్రత్యక్ష సంబంధంలో ఉంటుంది. ఈ వ్యవస్థ న్యూరోట్రాన్స్మిటర్ సంకేతాలను ఇస్తుంది. ఎక్కువగా బాధపడడం.. కోపం.. భయంతో ఉన్నప్పుడు మనిషి ఏడవడం ప్రారంభిస్తాడు. దీంతో కన్నీళ్లు వచ్చేస్తుంటాయి.

ఇవి కూడా చదవండి

ఇక ఉల్లిపాయను కట్ చేస్తున్నప్పుడు కళ్లలో నీళ్లు రావడానికి ప్రధాన కారణం ఉల్లిపాయలో ఉండే రసాయనమే. దీనిని సిన్-ప్రొపాంథైల్-ఎస్-ఆక్సైడ్ అంటారు. ఉల్లిపాయను కోసినప్పుడు, అందులో ఉండే ఈ రసాయనం కళ్లలో ఉండే లాక్రిమల్ గ్రంధిని ప్రేరేపిస్తుంది. దీంతో కళ్లలో నుంచి నీళ్లు రావడం ప్రారంభమవుతుంది. ఏడుపు వల్ల చాలా లాభాలున్నాయి. మనం ఏడ్చినప్పుడు శరీరంలోని విషపదార్థాలు బయటకు వస్తాయి. కొద్దిసేపు ఏడడం ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఒత్తిడి తగ్గుతుంది. ఏడుస్తున్నప్పుడు కనుబొమ్మలు, కనురెప్పలు ద్రవాన్ని పొందుతాయి.