రాత్రి నిద్రపోయే ముందు కాళ్లు కడుగుతున్నారా ? అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే.. ఎందుకంటే..

సాధారణంగా బయటకు వెళ్లివచ్చినప్పుడు... లేదా ఆఫీస్‏ నుంచి రాగానే కాళ్లను శుభ్రం చేసుకోవడం అలవాటు ఉంటుంది చాలా మందికి.

రాత్రి నిద్రపోయే ముందు కాళ్లు కడుగుతున్నారా ? అయితే ఈ విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాల్సిందే.. ఎందుకంటే..
Feet
Follow us

|

Updated on: Apr 26, 2022 | 8:57 PM

సాధారణంగా బయటకు వెళ్లివచ్చినప్పుడు… లేదా ఆఫీస్‏ నుంచి రాగానే కాళ్లను శుభ్రం చేసుకోవడం అలవాటు ఉంటుంది చాలా మందికి. అంతేకాకుండా.. కొందరికీ ప్రతి గంటకు కాళ్లు కడిగే అలవాటు ఉంటుంది. కానీ చాలా రాత్రిళ్లు కాళ్లు కడగకుండానే మంచంపై నిద్రపోతుంటారు. బయటకు వెళ్లొచ్చకా కాళ్లు కడుక్కుండానే ఇంట్లోకి వచ్చేస్తుంటారు. అయితే అలాంటి అలవాట్లు ఉండడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు నిపుణులు. రాత్రిళ్లు నిద్రపోయే ముందు పాదాలను శుభ్రం చేసుకోవడం వలన అనేక ప్రయోజనాలున్నాయి. అనేక రకాల ఇన్ఫెక్షన్లు, వ్యాధులను తగ్గించుకోవచ్చు.. రాత్రి పడుకునే ముందు తలస్నానం చేయడం.. చేతులు, కాళ్లు, ముఖం శుభ్రం చేసుకోవడం వలన సరైన నిద్ర ఉంటుంది. అలాగే రిఫ్రెష్‏గా ఉండడమే కాకుండా.. మానసిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. మరి రాత్రిపూట పాదాలు కడగడం వలన కలిగే ప్రయోజనాలు తెలుసుకుందామా..

ప్రయోజనాలు.. 1. స్లీప్ డాట్ కామ్ లో ప్రచురించబడిన ఒక నివేదిక ప్రకారం.. అధిక చెమట లేదా హైపర్ హైడ్రోసిస్ సమస్య ఉన్నవారు పాదాలను కడగకుండా రాత్రి నిద్రపోకూడదు. శుభ్రమైన పాదాలతో నిద్రించడం వల్ల బ్యాక్టీరియా తగ్గుతుంది ఇది అథ్లెట్స్ ఫుట్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. 2. పాదాల చర్మం పొడిగా, పొరలుగా, పగుళ్లుగా ఉంటే, రోజంతా చెమట, దుమ్ము, ధూళి అంటుకోవడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. నిద్రపోయే ముందు లేదా ఆఫీసు నుంచి వచ్చిన తర్వాత పాదాలను సబ్బుతో శుభ్రంగా శుభ్రం చేసుకోవాలి. కొన్ని నిమిషాల పాటు స్క్రబ్బర్‌తో చర్మాన్ని శుభ్రం చేయాలి. దీంతో చనిపోయిన చర్మ కణాలన్నీ తొలగిపోతాయి. దీంతో చర్మం మృదువుగా మారుతుంది. 3. పాదాలను శుభ్రంగా ఉంచుకుని నిద్రించడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. పాదాలను కడగడం వల్ల శరీర ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది మెదడు నిద్రపోవడానికి సహాయపడుతుంది. 4. అలాగే.. ఆందోళన, నొప్పి తగ్గుతాయి. అర బకెట్ నీటిలో ఎప్సమ్ ఉప్పు వేసి పాదాలను కడగాలి. దీంతో ప్రశాంతమైన నిద్ర వస్తుంది. 5. రాత్రిపూట గోరువెచ్చని నీటిలో పాదాలను శుభ్రంగా ఉంచుకుని నిద్రిస్తే, కండరాలు రిలాక్స్‌గా ఉంటాయి. నొప్పి పోతుంది. తిమ్మిర్లు, దృఢత్వం వంటి సమస్యలు తగ్గుతాయి. 6. రోజంతా పరుగెత్తడం వల్ల కాళ్ల కండరాలు, ఎముకల్లో నొప్పితోపాటు కండరాల్లో ఒత్తిడి ఉంటుంది. పాదాలను నీటితో పూర్తిగా శుభ్రం చేసిన తర్వాత, నిద్ర చాలా విశ్రాంతిగా ఉంటుంది.

గమనిక:- ఈ కథనం కేవలం నిపుణుల సూచనలు.. ఇతర వెబ్ సైట్స్ ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. దీనిని టీవీ9 తెలుగు దృవీకరించలేదు. అమలు చేయడానికి ముందు వైద్యుల సలహాలు తీసుకోవాలి.

Also Read: Chinni Trailer: వైలెంట్ పాత్రలో అదగొట్టేసిన కీర్తి సురేష్.. ఆకట్టుకుంటున్న చిన్ని ట్రైలర్..

Suma Kanakala: విడాకుల రూమర్లపై స్పందించిన యాంకర్ సుమ.. ఏమన్నదంటే..

Megastar Chiranjeevi: సిద్ధ పాత్ర రామ్ చరణ్ చేయకపోతే పవన్ కళ్యాణ్ బెస్ట్.. మెగాస్టార్ చిరంజీవి కామెంట్స్ వైరల్..

RRR: ఎత్తర జెండా ఫుల్ వీడియో సాంగ్ వచ్చేసింది.. అదరగొట్టిన చరణ్, తారక్