Pregnancy Care: మొదటిసారి గర్భం ధరించిన మహిళలు ఎలా నిద్రపోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..

గర్భం ధరించామని తెలియగానే మహిళల మదిలో ఆనందంతో పాటు ఎన్నో ఆలోచనలు మెదులుతాయి. అందులోనూ మొదటి సారి తల్లిగా మారే మహిళల విషయంలో ఈ ఆలోచనలు కాస్త ఎక్కువగా ఉంటాయి.

Pregnancy Care: మొదటిసారి గర్భం ధరించిన మహిళలు ఎలా నిద్రపోవాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారంటే..
Pregnancy Care
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 25, 2022 | 10:03 AM

గర్భం ధరించామని తెలియగానే మహిళల మదిలో ఆనందంతో పాటు ఎన్నో ఆలోచనలు మెదులుతాయి. అందులోనూ మొదటి సారి తల్లిగా మారే మహిళల విషయంలో ఈ ఆలోచనలు కాస్త ఎక్కువగా ఉంటాయి. గర్భం కారణంగా శరీరంలో కలిగే హార్మోన్ల మార్పులు (Harmonal Changes) మహిళలను శారీరకంగా, మానసికంగా ప్రభావితం చేస్తాయి. పుట్టబోయే పిల్లల గురించి ఎన్నో ప్రశ్నలు, అనుమానాలు తలెత్తుతాయి. ఏం తినాలో, తినకూడదో, ఏయే జాగ్రత్తలు పాటించాలి ? తేలికపాటి వ్యాయామాలు చేయచ్చా? చేయకూడదా? తదితర ప్రశ్నలతో గర్భిణీలు (Pregnant Woman) తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతుంటారు. మరి అలాంటి కొన్ని ప్రశ్నలు, అనుమానాలకు సమాధానాలు తెలుసుకుందాం రండి.

బరువు విషయంలో..

సాధారణంగా గర్భం ధరించిన తర్వాత మహిళలు బరువు పెరుగుతారు. అయితే ఎంత బరువు పెరగాలి అనేదానికి నిర్దిష్ట పరిమితులు లేవు. సాధారణంగా గర్భం దాల్చిన తర్వాత మహిళలు 10 నుంచి 12 కిలోల బరువు పెరుగుతారు. అయితే గర్భధారణకు ముందు బరువు తక్కువగా ఉన్నట్లయితే, 18 నుంచి 20 కిలోల వరకు బరువు పెరగవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఒకవేళ గర్భం రావడానికి ముందే అధిక బరువుతో ఉన్నట్లయితే, గర్భధారణ సమయంలో 6 నుండి 7 కిలోల వరకు బరువు పెరగవచ్చు.

ఈ పనులకు దూరంగా ఉండాలి..

గర్భం ధరించిన మహిళలు మరీ సున్నితంగా ఉండాల్సిన అవసరం లేదు. గర్భం సాధారణంగా ఉండి, ఎటువంటి సమస్యలు రానంతవరకు సాధారణ రోజువారీ కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. గర్భధారణ సమయంలో మహిళలు ఎంత చురుకుగా ఉంటే అంత మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తుంటారు. అయితే బరువులు వంచడం లేదా ఎత్తడం వంటి పనులకు దూరంగా ఉండాలి. ఇది కాకుండా, డాక్టర్ సూచించిన తేలికపాటి వ్యాయామాలు చేయవచ్చు. ఇవి శరీరాన్ని ఫిట్‌గా ఉంచుతాయి. అయితే ఎక్సర్‌ సైజులు చేసే సమయంలో విపరీతంగా చెమట, అలసిపోతుంటే మాత్రం బెడ్‌ రెస్ట్‌ తీసుకోవడం మేలు.

ఆహారం ఎలా ఉండాలంటే..

తల్లితో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రెగ్నెన్సీ డైట్ పాటించడం ఎంతో ముఖ్యం. తీసుకునే ఆహారంలో అన్ని రకాల విటమిన్లు, మినరల్స్ ఉండేలా చూసుకోవాలి. ఇందుకోసం పచ్చి కూరగాయలు, పండ్లు, రసాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, సలాడ్ తదితరాలను ఆహారంలో చేర్చుకోవాలి. ఇవి కాకుండా శరీరంలోని పోషకాల శాతం పెంచడానికి వైద్యులు కొన్ని సప్లిమెంట్లను రెఫర్‌ చేస్తారు. వాటిని కూడా సమయానికి తీసుకోండి.

నిద్ర..

గర్భం ధరించిన రెండవ త్రైమాసికం నుంచి పొట్ట పెద్దదిగా మారడం ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ సమయంలో నిద్ర పోయే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. పొట్టకు ఎలాంటి సమస్యలు రాకుండా జాగ్రత్త తీసుకోవాలి. వీలైనంత ఎక్కువగా ఎడమ వైపున తిరిగి పడుకోవాలి . ఇలా చేయడం వల్ల గర్భంలోని బిడ్డకు తగినంత రక్తం సరఫరా అవుతుంది. పొట్ట మీద బరువు పడేలా నిద్రపోకండి.

వ్యాక్సిన్లు తీసుకోవచ్చా?

గర్భధారణ సమయంలో ఫ్లూ వ్యాక్సిన్లు తీసుకోవడంపై చాలామందికి అనుమానాలుంటాయి. అయితే ఇందులో ఎలాంటి ప్రమాదం లేదు. పైగా ఫ్లూ వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల కడుపులోని బిడ్డకు ఎలాంటి ఇన్ఫెక్షన్లు సోకవు. అయితే టీకాలు తీసుకునే ముందు ఒకసారి గైనకాలజిస్ట్ కలవండి. వారు సిఫార్సు చేసిన టీకాలను మాత్రమే తీసుకోండి.

Also Read: Russia Ukraine Crisis: రష్యా దాడులపై అమెరికా అధ్యక్షుడి కీలక ప్రకటన.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదంటూ..

Russia Ukraine Crisis: పుతిన్‌కు ఫోన్ చేసిన ప్రధాని మోడీ.. ఏం మాట్లాడారంటే..

Jharkhand: నదిలో పడవ బోల్తా.. 14 మంది గల్లంతు.. కొనసాగుతున్న గాలింపు చర్యలు..