Beauty Care Tips: సన్ స్క్రీన్ లోషన్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ నిజాలు తెలుసుకోండి..

అపాదమస్తకం అందకంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం మార్కెట్లో దొరికే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను వినియోగిస్తుంటారు. అందులో సన్‌స్క్రీన్ ఒకటి.

Beauty Care Tips: సన్ స్క్రీన్ లోషన్ ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారా.. అయితే ఈ నిజాలు తెలుసుకోండి..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Jan 17, 2022 | 6:44 AM

అపాదమస్తకం అందకంగా కనిపించాలని అందరూ కోరుకుంటారు. అందుకోసం మార్కెట్లో దొరికే వివిధ రకాల సౌందర్య ఉత్పత్తులను వినియోగిస్తుంటారు. అందులో సన్‌స్క్రీన్ ఒకటి. చర్మ సంరక్షణ ఇది ప్రధాన పాత్ర పోషిస్తుంది. హానికరమైన UV తరంగాలు, సన్‌బర్న్స్ ల న నుండి మన చర్మాన్ని రక్షిస్తుంది. అంతేకాకుండా  చర్మం ముడతలు పడకుండా నివారిస్తుంది. వృద్ధాప్య ఛాయలను కూడా తగ్గిస్తుంది .  సన్‌స్క్రీన్‌లో ఉండే రసాయనాలు సూర్యరశ్మిలోని అతినీలలోహిత కిరణాలు   చర్మాన్ని చేరకుండా అడ్డుపడతాయి. ఫలితంగా చర్మ క్యాన్సర్ లాంటి వ్యాధులు రాకుండా రక్షణ కలిగిస్తుంది. అయితే, సన్‌స్క్రీన్‌ను సరిగ్గా ఉపయోగించకపోవడం లేదా అతిగా ఉపయోగించినట్లయితే కొన్ని దుష్ఫ్రభావాలు కలుగుతాయని చర్మ సంరక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చర్మ సంబంధిత సమస్యలు వెంటాడుతాయని సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం రండి.

స్కిన్ అలెర్జీలు..

సన్‌స్క్రీన్ తయారీలో వివిధ రసాయనాలను ఉపయోగిస్తారు. ఇవి సూర్యరశ్మి ప్రభావం నుంచి మన చర్మాన్ని కాపాడినప్పటికీ ఇందులోని   టెట్రాసైక్లిన్ , సల్ఫా ఫినోథియాజైన్స్ వంటి రసాయనాలు చర్మంపై ప్రతికూల ప్రభావం చూపుతాయి.  పరిమితికి మించి సన్‌స్క్రీన్ రాసుకోవడం వల్ల  వివిధ రకాల స్కిన్ అలెర్జీలు కలుగుతాయి. అలర్జీ సమస్య కూడా రావచ్చు. కొన్ని సన్‌స్క్రీన్‌లలో  పారా  అమైనో బెంజోయిక్ (PABA) రసాయనాలు కలుపుతారు. ఇవి చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి.   అందుకే సన్‌స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఏవైనా అలెర్జీ సమస్యలు ఎదురైతే వెంటనే చర్మ సంరక్షణ నిపుణులను సంప్రదించాలి.

మొటిమలు..

మనలో చాలామంది ఆన్‌లైన్ లేదా టీవీల్లో వచ్చే  ప్రకటనలను చూసి మార్కెట్లో దొరికే సన్‌స్క్రీన్‌ని కొనుగోలు చేస్తుంటారు. ఇలా వైద్యులు, చర్మ నిపుణుల సలహాలు తీసుకోకుండా సన్ స్క్రీన్లను వాడడం వల్ల మొటిమలు, డార్క్ సర్కిల్స్ ఏర్పడే ప్రమాదం ఉంది.

కంటి  సమస్యలు

చాలామంది ముఖంపై ఇష్టమొచ్చినట్లు సన్ స్క్రీన్లను అప్లై చేస్తుంటారు. కొన్నిసార్లు సున్నితమైన కంటి భాగాలకు కూడా తగిలేలా రాస్తుంటారు. ఇలా చేయడం వల్ల కంటి సమస్యలు కలుగుతాయి. సన్‌స్క్రీన్ కళ్లలో పడినప్పుడు వెంటనే చల్లని నీటితో  శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాత శుభ్రమైన క్లాత్ తో మృదువుగా తుడుచుకోవాలి. అప్పటికీ మంట, తదితర సమస్యలు తగ్గకపోతే వెంటనే వైద్యులను సంప్రదించాలి.

ఇవి కూడా..

సన్‌స్క్రీన్‌కి సంబంధించిన మరో సమస్య కూడా ఉంది. అదేంటంటే…చాలామంది తమ చర్మ తత్త్వానికి తగ్గట్టుగా సన్‌స్క్రీన్‌ను ఎంచుకోరు. ఫలితంగా పలు చర్మ సమస్యలను ఎదుర్కొంటారు.  జిడ్డు చర్మం ఉన్నవాళ్లు వాటర్‌ బేస్డ్‌ సన్‌స్క్రీన్‌ లోషన్లు వాడవచ్చు. ఇక పొడి చర్మం కలిగినవారు ముందుగా ముఖానికి మాయిశ్చరైజర్‌ అప్లై చేసి, ఆ తర్వాత సన్‌స్క్రీన్‌ వాడాలి.  ఇక అలెర్జీలు, సున్నితమైన చర్మం ఉన్నవారు ఆల్కహాల్ కలిగిన లోషన్లు వాడకపోవడం ఉత్తమం. అలాగే చిన్నారులకు డై ఆక్సీబెంజాన్ ఉండే సన్‌స్క్రీన్ లోషన్లు వాడకూడదు.

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ కావాలా? ఈ బ్యాంకులు ట్రై చేయండి
ఫిక్స్‌డ్ డిపాజిట్లపై అధిక వడ్డీ కావాలా? ఈ బ్యాంకులు ట్రై చేయండి
మీరు సకాలంలో గృహ రుణం చెల్లించకపోతే మీ ఇంటిని ఎన్ని రోజులకు సీజ్‌
మీరు సకాలంలో గృహ రుణం చెల్లించకపోతే మీ ఇంటిని ఎన్ని రోజులకు సీజ్‌
ప్రియదర్శి, నభా నటేష్ మధ్య డార్లింగ్ పంచాయితీ. రీతూవర్మ రియాక్షన్
ప్రియదర్శి, నభా నటేష్ మధ్య డార్లింగ్ పంచాయితీ. రీతూవర్మ రియాక్షన్
వ్యాపారంలో ఇబ్బందులా.. ఈ రోజు సాయంత్రం ఈ చిన్న పరిష్కారం చేయండి
వ్యాపారంలో ఇబ్బందులా.. ఈ రోజు సాయంత్రం ఈ చిన్న పరిష్కారం చేయండి
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా..
కేఏ పాల్ ఆస్తులు మరీ అంత తక్కువా..
ఇట్స్ అఫీషియల్.. టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
ఇట్స్ అఫీషియల్.. టిల్లు స్క్వేర్ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్..
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
నల్లగొండ నేతల మధ్య 'పవర్' ఫుల్ డైలాగ్ వార్.. దీని చుట్టే రాజకీయం
నల్లగొండ నేతల మధ్య 'పవర్' ఫుల్ డైలాగ్ వార్.. దీని చుట్టే రాజకీయం
భార్య బౌలింగ్.. భర్త బ్యాటింగ్.. 6 బంతుల్లో 36 పరుగుల ఛాలెంజ్
భార్య బౌలింగ్.. భర్త బ్యాటింగ్.. 6 బంతుల్లో 36 పరుగుల ఛాలెంజ్
ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో తెలంగాణ ఆడపడుచు..!
ఉత్తరప్రదేశ్ ఎన్నికల బరిలో తెలంగాణ ఆడపడుచు..!
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
కుర్ర హీరోల మధ్య క్రేజీ వార్.. నితిన్, నాగచైతన్య మధ్య పోరు  
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
Watch Video: అసదుద్దీన్ - మాధవీ లత మధ్య డైలాగ్ వార్..
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
గేమింగ్ కంపెనీల్లో లేఆఫ్స్ క‌ల‌క‌లం.. 600 మంది ఉద్యోగుల‌పై వేటు.!
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
టపాసుల పెట్టెను నెత్తిమీద పెట్టుకొని డాన్స్‌.. ఆ తర్వాత.? వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
జిమ్ ట్రైనర్‏ను మోసం చేస్తున్న హీరోయిన్ మృణాల్ ఠాకూర్.! వీడియో.
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
యోధగా దిమ్మతిరిగేలా చేస్తున్న తేజా సజ్జా.! ఈసారి మరింత అడ్వాన్స్
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
డార్లింగ్ అభిమానులకు ‘రాజాసాబ్’ పై గుడ్ న్యూస్ చెప్పిన తేజ సజ్జా.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
కడుపులో బిడ్డతో షూటింగ్‌లో స్టార్ హీరోయిన్.! వీడియో వైరల్.
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
నభా నటేష్‌తో ట్విట్టర్ లొల్లి.. కానీ దొరికిపోయిన ప్రియదర్శి.!
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు
తెలుగు నటుడి గొప్పతనం.! 100వ సారి రక్త దానం చేసి.. 'చిరు' మెప్పు