‘కీటో డైట్’ తీసుకుంటే మొదటికే మోసం వస్తుందా?

డయాబెటీస్.. దీన్ని తగ్గించుకోవాలని ఎన్నో రకాల మందులు వాడుతూ రకరకాల ఆహార నియమాలను పాటిస్తూ ఉంటారు. డయాబెటీస్ స్ధాయిని తగ్గించడంలో ఆహార పదార్ధాల పాత్రే కీలకమైంది గనుక.. ఎలాంటి నియమాలు పాటిస్తే వ్యాధి నియంత్రణకు సహకరిస్తుందో నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన మాట ‘కీటో డైట్’ దీనినే కీటో జనిక్ డైట్ అని కూడా పిలుస్తారు. కీటో డైట్‌ అంటే తక్కువ ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం కీటో డైట్ విధానంలో […]

  • Publish Date - 5:18 pm, Thu, 15 August 19 Edited By:
'కీటో డైట్' తీసుకుంటే మొదటికే మోసం వస్తుందా?

డయాబెటీస్.. దీన్ని తగ్గించుకోవాలని ఎన్నో రకాల మందులు వాడుతూ రకరకాల ఆహార నియమాలను పాటిస్తూ ఉంటారు. డయాబెటీస్ స్ధాయిని తగ్గించడంలో ఆహార పదార్ధాల పాత్రే కీలకమైంది గనుక.. ఎలాంటి నియమాలు పాటిస్తే వ్యాధి నియంత్రణకు సహకరిస్తుందో నిపుణులు చెబుతున్నారు. ఈ మధ్యకాలంలో తెలుగు రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యంలోకి వచ్చిన మాట ‘కీటో డైట్’ దీనినే కీటో జనిక్ డైట్ అని కూడా పిలుస్తారు. కీటో డైట్‌ అంటే తక్కువ ప్రొటీన్, కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం కీటో డైట్ విధానంలో ముఖ్యమైంది.

కొంతమంది డయాబెటీస్‌ నుంచి బయటపడాలని ఆలోచిస్తూ ఈ కీటో డైట్‌ను అలవాటు చేసుకుని అనారోగ్యం పాలైన సంఘటనలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా శరీరానికి అందాల్సిన పోషకాలు, ప్రోటీన్లు తగినంత అందకపోడంతో ఏకంగా ప్రాణాలమీదికి సైతం తెచ్చుకుంటున్నారు. కీట్ డైట్‌పై ఓ సంస్ధ జరిపిన అధ్యయనంలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.

ఈ డైట్ తీసుకోవడం వల్ల శరీరంలో కార్బోహైడ్రేట్ స్థాయి తగ్గడం వల్ల బరువు గరిష్టంగా తగ్గిపోతుందని, అదే సమయంలో టైప్ 2 డయాబెటీస్ రిస్క్ పెరిగే ఛాన్స్ కూడా ఉన్నట్టుగా అధ్యయనంలో తేలింది. కీటో డైట్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్‌ని నియంత్రించే వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయదని తేలింది. వీటన్నిటి వల్ల టైప్ 2 డయాబెటీస్ ముప్పు పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ వివరాలన్నీ జర్నల్ ఆఫ్ ఫిజియాలజీలో ప్రచురించారు. డయాబెటీస్ వంటి అనారోగ్య సమస్యతో బాధపడుతున్నవారు కొత్తగా ప్రాచుర్యంలోకి వచ్చిన విధానాన్ని పాటించాల్సి వస్తే .. దాని వెనుక కలిగే లాభనష్టాలను ఒకసారి ఆలోచిస్తే మంచిది అంటున్నారు నిపుణులు.