చక్కెర కన్నా బెల్లం మిన్న.. ఎందుకో చదవండి..

చక్కెర కన్నా బెల్లం మిన్న.. ఎందుకో చదవండి..

చక్కెర.. తీపి కోసం మనం నిత్యం ఉపయోగించే ఆహార పదార్ధం. అయితే చక్కెర ఒకటే కాదు.. బెల్లం కూడా కొందరు ఉపయోగిస్తారు. నిజానికి ఈ చక్కెరను కనిపెట్టక ముందు వరకూ.. మన పూర్వీకులంతా తీపి కోసం బెల్లాన్నే వాడేవారు. ప్రస్తుతం ఎక్కువ మంది వంటల్లో తీపి కోసం చక్కెరనే విరివిగా ఉపయోగిస్తారు. అయితే చక్కెర ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు చెబుతుంటారు. వారు చెప్పడమనే కాదు.. అదే నిజం కూడా. చక్కెర బదులుగా బెల్లాన్ని ఉపయోగించమని […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Aug 31, 2019 | 5:28 PM

చక్కెర.. తీపి కోసం మనం నిత్యం ఉపయోగించే ఆహార పదార్ధం. అయితే చక్కెర ఒకటే కాదు.. బెల్లం కూడా కొందరు ఉపయోగిస్తారు. నిజానికి ఈ చక్కెరను కనిపెట్టక ముందు వరకూ.. మన పూర్వీకులంతా తీపి కోసం బెల్లాన్నే వాడేవారు. ప్రస్తుతం ఎక్కువ మంది వంటల్లో తీపి కోసం చక్కెరనే విరివిగా ఉపయోగిస్తారు. అయితే చక్కెర ఆరోగ్యానికి అంత మంచిది కాదని వైద్యులు చెబుతుంటారు. వారు చెప్పడమనే కాదు.. అదే నిజం కూడా. చక్కెర బదులుగా బెల్లాన్ని ఉపయోగించమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అయితే ఈ బెల్లం వాడకం ద్వారా ఉపయోగాలేంటో చూద్ధాం.

* ప్రతి నిత్యం రాత్రిపూట భోజనం చేసిన తర్వాత చిన్న బెల్లం ముక్క తింటే ఎంతో ఉపయోగమట. దీని ద్వారా జీర్ణప్రక్రియ మెరుగవుతుంది. అయితే బెల్లాన్ని ముక్కలా కాకుండా నీటిలో కలుపుకొని కూడా తాగవచ్చు. ఇలా బెల్లం తీసుకోవడం వలన జీర్ణప్రక్రియ వ్యవస్థ బాగా పనిచేస్తుంది.

* శరీరంలో వేడిని కూడా తగ్గించే శక్తి ఈ బెల్లానికి ఉంది. ఓ గ్లాస్ వాటర్‌లో బెల్లం ముక్కను కలిపి తాగితే శరీరంలోని ఉష్ణోగ్రత కంట్రోల్‌లో ఉంటుంది.

* అంతేకాదు లివర్ సమస్యలకు కూడా బెల్లం ద్వారా చెక్ పెట్టవచ్చు. నిత్యం బెల్లాన్ని తీసుకోవడం వల్ల శరీర భాగాలకు కావాల్సిన పోషకాలు, రసాయనాల్ని వేరు చేస్తుంది. అందువల్ల బెల్లం వల్ల లివర్ పరిశుభ్రంగా ఉంటుంది.

* బెల్లంలో ఉండే మొలాసిస్‌లో పొటాషియం, ఎలక్ట్రోలైట్స్ పదార్థాలు శరీరానికి శక్తిని అందిస్తాయి. బెల్లం నీరు దాదాపు ఎనర్జీ డ్రింక్స్ లాగే పనిచేస్తుంది.

* శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్‌ను కూడా బెల్లం పెంచుతుంది. ఎందుకంటే దీనిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఇలా బెల్లం తీసుకోవడంతో రక్త ప్రసరణ వ్యవస్థ మెరుగవుతుంది. రక్తం పరిశుభ్రంగా ఉంటే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.

* అంతేకాదు బెల్లంలో ఉన్న ఇనుము, జింక్, సెలెనియం.. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. నొప్పి, బాధల నివారిణిగా కూడా బెల్లం ఉపయోగపడుతుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్, ఆర్థరైటిస్, నొప్పులతో బాధపడేవారు తినే ఆహారంలో బెల్లం తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఇంకా పేగుల్ని శక్తిమంతంగా చేసే మెగ్నీషియం కూడా బెల్లంలో ఉంటుంది. దీని ద్వారా పేగులు శక్తివంతంగా మారి.. జీర్ణ ప్రక్రియకు ఎంతో ఉపయోగపడతాయి. ముఖ్యంగా పంచదార తింటే బరువు పెరుగుతారు. అదే బెల్లం తింటే బరువు తగ్గుతారు.

ఇవి బెల్లం తీసుకుంటే కలిగే లాభాలు. సో మీరు కూడా చక్కెరకు బదులుగా బెల్లాన్ని ఉపయోగించి ఆరోగ్యంగా జీవించండి.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu