International Yoga Day 2021: ప్రతి రోజు యోగా చేయడం ద్వారా శరీరానికి.. మనస్సుకు ఉత్సాహాన్నిస్తుంది. అలాగే ప్రశాంతమైన ఆలోచనలతోపాటు..ఇతర శరీర వ్యాధులను తొలగిస్తుంది. ప్రపంచ దేశాలకు యోగాను పరిచయం చేసింది మన దేశమే. యోగా.. ఇతర వ్యాధులను తొలగించడమే కాకుండా.. జుట్టు.. చర్మ సమస్యలను కూడా నివారిస్తుంది. వివిధ వ్యాయామాల సమాహారమే ఈ యోగ. ఇందులోని ఒక్కో ఆసనం.. మనకు ఎంతో మేలు చేస్తాయి. ప్రస్తుతం ఉరుకుల పరుగుల జీవితంలో.. మారిన జీవనశైలి.. పోషకాహార లోపం కారణంగా చాలా వరకు జుట్టు రాలడం.. చర్మ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కొన్ని యోగాసనాలు చేయడం ద్వారా ఈ సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. అవెంటో తెలుసుకుందామా.
ఉత్తన్ పాదసనం… ఈ ఆసనం చేయడం ద్వారా శరీరంలోని అలసటను తొలగిస్తుంది. అలాగే ఈ ఆసనాన్ని రోజూ చేయడం వలన జుట్టు రాలడం తగ్గిపోతుంది. అంతేకాకుండా.. పీరియడ్స్ సమయంలో ఏర్పడే నొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు.
ముఖ స్వాసాన.. ఈ ఆసనం రోజూ చేయడం ద్వారా శరీరంలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. అంతేకాకుండా.. జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు ఉన్నవారు అధో ముఖ శ్వాసను కూడా తొలగించుకోవచ్చు.
వజ్రాసనం.. చాలా వరకు యోగాసనాలు.. ఖాళీ కడుపుతో చేయాలని చెబుతుంటారు. అయితే ఈ వజ్రాసనం ఆహారం తిన్న తర్వాత కూడా వేయవచ్చు. అలాగే రోజుకు 15 నిమిషాలు ఈ యోగా చేయడం ద్వారా జుట్టు రాలడం సమస్య తగ్గిపోతుంది. అంతేకాకుండా.. బరువు తగ్గాలనుకునేవారికి కూడా ఈ యోగాసనం చాలా వరకు ఉపయోగపడుతుంది.
అపానసనం.. ఈ ఆసనం చేయడం ద్వారా జీర్ణవ్యవస్థ బలపడుతుంది. అలాగే శరీరంలోని విష వ్యర్థ పదార్థాలు అన్ని తొలగిపోయి.. శరీరం స్వచ్చంగా మారుతుంది. జుట్టు రాలడం సమస్యను తగ్గించడమే కాకుండా.. శరీర అలసటను తగ్గిస్తుంది.