అతిగా తినకుండా ఉండేందుకు ‘మెదడు’ను ఎలా కంట్రోల్ చేయాలి..?

అతిగా తినకుండా ఉండేందుకు 'మెదడు'ను ఎలా కంట్రోల్ చేయాలి..?

ఏదైనా ఫుడ్ మనకు నచ్చితే దాన్ని ఎక్కువగా లాగించేస్తూ ఉంటాం.. అనంతరం ఇబ్బందులు పడుతూ ఉంటాం.. కదా..! ఇదంతా నార్మల్‌నే అని చాలా తేలికగా తీసుకుంటాం. కానీ.. అతిగా తినడం వల్ల కూడా చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే.. అతిగా తినకుండా ఉండేందుకు మెదడును ఎలా కంట్రోల్ చేయాలన్నదానిపై శాస్త్రవేత్తలు ఒక నూతన పద్దతిని కనుక్కొన్నారు. అమెరికాలో ఉండే ధనంవంతులలో దాదాపు మూడు వంతుల మంది అధిక బరువును లేదా ఊబకాయంతో ఉంటారు. […]

TV9 Telugu Digital Desk

| Edited By: Pardhasaradhi Peri

Apr 05, 2019 | 6:00 PM

ఏదైనా ఫుడ్ మనకు నచ్చితే దాన్ని ఎక్కువగా లాగించేస్తూ ఉంటాం.. అనంతరం ఇబ్బందులు పడుతూ ఉంటాం.. కదా..! ఇదంతా నార్మల్‌నే అని చాలా తేలికగా తీసుకుంటాం. కానీ.. అతిగా తినడం వల్ల కూడా చాలా సమస్యలను ఎదుర్కోవలసి వస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. అయితే.. అతిగా తినకుండా ఉండేందుకు మెదడును ఎలా కంట్రోల్ చేయాలన్నదానిపై శాస్త్రవేత్తలు ఒక నూతన పద్దతిని కనుక్కొన్నారు.

అమెరికాలో ఉండే ధనంవంతులలో దాదాపు మూడు వంతుల మంది అధిక బరువును లేదా ఊబకాయంతో ఉంటారు. వీటిని అదుపులో ఉంచేందుకు శాస్ర్తవేత్తలు రకరకాలైన ఆరోగ్యకరమైన పరిశోధనలు చేస్తున్నారు. అయితే.. బరువు పెరగడాన్ని మనం కావాలనుకోం.. ఎక్కువగా తినడం వల్ల అలాంటివి చోటుకుంటాయని అన్నారు పరిశోధకులు.

రాక్ఫెల్లర్ యూనివర్సిటీలో పరిశోధకులు కనుగొన్న దాని ప్రకారం.. ఆహారం తినాలనిపించినప్పుడల్లా.. ఏదో ఒక పనిమీదకు ధ్యాసను మళ్లించాలని.. దాంతో తినాలనే కోరికలను అరికట్టవచ్చని అన్నారు. అలాగని అసలు ఆహారమే తీసుకోకుండా ఉండటం ఇంకా ప్రమాదకరమని తెలియజేశారు పరిశోధకులు. శరీరానికి కావాల్సిన ఆహారాన్ని తీసుకోవచ్చన్నారు. లావుగా.. ఉన్నా కదా అని.. వెంటనే స్లిమ్‌గా అవ్వడానికి ట్రై చేయొద్దని.. దీనికి దీర్ఘకాల ట్రైనింగ్ అవసరమని తెలిపారు.

మనస్తత్వశాస్త్రం ప్రకారం.. మనం తినే పదార్థాలు కానీ, విధానం కానీ మన మెదడుకు కనెక్షన్ అయి ఉంటాయి. ఉదాహరణకు :- జంతువులపై శాస్త్రవేత్తలు పరిశోధన చేయగా.. ఒక జంతువు ఏదైనా తిండి పదార్థాలను చూసి వాసన పసిగట్టి.. తినేందుకు ఇష్టపడుతుంది. కాబట్టి అది తింటుంది. కానీ.. పరిణామాత్మకంగా ఆహారాన్ని అందుబాటులోకి తెచ్చినప్పుడు జంతువులకు, మనుషులకు ఒకే అనుభూతి ఉంటుందని శాస్త్రవేత్తలు చెప్పారు.

అయితే.. జంతువుల కన్నా మానవులకు మెదడులో ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది. తినే ఆహారాన్ని ఎంత తీసుకోవాలనేదానిపై ఒక నిబద్ధత ఉంటుంది. ఏ ఆహారాన్నైనా మితంగా తీసుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. జంతువుల్లో అయినా.. మనుషుల్లో అయినా అతిగా తినడం మంచిది కాదనేది శాస్త్రవేత్తల వాదన.

అతిగా ఆహారాన్ని తీసుకోవడం ద్వారా మందబుద్ధిని కలిగి ఉంటారని అన్నారు శాస్త్రవేత్తలు. వాళ్ల ఆలోచనా వేగం కూడా తగ్గుతుందని శాస్త్రవేత్త అజెవెడో చెప్పారు. కాబట్టి శిక్షణతో కూడిన ఆహారాన్ని ప్రజలు తీసుకోవాలని సూచించారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu